Pigeon in IndiGo Flight: ఇండిగో విమానంలో పావురాయి.. మార్గమధ్యంలో ప్రయాణికులకు సర్‌ప్రైజ్
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:30 PM
ఇండిగో విమానం మార్గమధ్యంలో ఉండగా లోపలి ప్రయాణికులకు ఓ పావురాయి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. విమానం క్యాబిన్ లోపల పావురాయి ఎగరడాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: గత ఆరు రోజులుగా ఫ్లైట్‌ల రద్దుతో ఇబ్బందిపడ్డ కొందరు ఇండిగో ప్రయాణికులకు తాజాగా ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. విమానం గాల్లో ఉండగా సడెన్‌గా ఓ పావురాయి విమానం లోపల ఎగురుతూ చక్కర్లు కొట్టడంతో సీట్లలోని ప్రయాణికులు అందరూ షాకయిపోయారు (Pigeon in IndiGo Flight).
వడోదరకు వెళుతున్న విమానంలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు పావురాయిని పట్టుకునేందుకు ప్రయత్నించగా మరికొందరు దాన్ని వీడియో తీశారు. అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న కర్ణ్ పరేఖ్ అనే వ్యక్తి ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. విమానంలో స్పెషల్ గెస్టు వచ్చిందని కామెంట్ చేశారు. పావురాయి ఎగరడం చూసి విమానంలోని వారందరూ సర్‌ప్రైజ్ అయ్యారని తెలిపారు.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు సర్‌ప్రైజ్ అయిపోయారు. విమానంలో ఇదో తరహా ఎంటర్‌టెయిన్‌మెంట్ అని కొందరు వ్యాఖ్యానించారు. ప్రత్యేక అతిథి అని మరికొందరు అన్నారు.
మరోవైపు, ఇండిగో విమానాల క్యాన్సిలేషన్స్ నేడు కూడా కొనసాగాయి. సోమవారం దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్‌పోర్టుల్లో సుమారు 450 విమానాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితులపై ఇండిగో ఇప్పటికే ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. పైలట్‌ల డ్యూటీ షెడ్యూల్ మార్పు కారణంగా తలెత్తిన కొరతతో ఫ్లైట్‌లు రద్దయ్యాయని వివరించింది. ఇక తాజా పరిస్థితికి కారణమైన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనలను కేంద్రం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అయితే, డిసెంబర్ 10 నాటికల్లా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఇండిగో హామీ ఇచ్చింది.
ఇవీ చదవండి:
నాకూ ఇంటికి వెళ్లాలని ఉంది.. ఇండిగో పైలట్ వీడియో నెట్టింట వైరల్
చైనా అభివృద్ధి చూసి అమెరికన్‌కు షాక్.. టెక్నాలజీ మరీ ఈ రేంజ్‌లోనా..