Indian Woman in Poland: పోలాండ్‌లో మైనర్ బాలుడిని ముద్దాడే ప్రయత్నం.. భారతీయ మహిళపై విమర్శలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 10:26 AM
పోలాండ్‌లో ఓ భారతీయ మహిళ మైనర్ బాలుడికి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట కలకలం రేపింది. అయితే, ఈ కాంట్రవర్సీపై మహిళ తన వివరణ కూడా ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పోలాండ్‌లో ఓ భారతీయ మహిళ చిక్కుల్లో పడ్డారు. ఆమె మైనర్ బాలుడిని ముద్దాడేందుకు ప్రయత్నించడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ఆమె క్షమాపణలు చెబుతూ మరో వీడియో చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, విజయ నాయర్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నెట్టింట మంచి పాప్యులారిటీ సంపాదించుకున్నారు. మనసుకు హత్తుకునేలా చిన్నారుల వీడియోలను పోస్టు చేస్తుంటారు. అయితే, తాజాగా ఆమె చేసిన వీడియో కాంట్రవర్సీకి దారి తీసింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, లిఫ్ట్‌లో ఉన్న ఓ బాలుడికి ఆమె బుగ్గపై కిస్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ చిన్నారి మాత్రం బిడియపడుతూ వెనక్కు జరిగాడు. రెండోసారి ఆమె కిస్ ఇచ్చేందుకు ప్రయత్నించగా అతడు మళ్లీ దూరం జరిగాడు. ఆ తరువాత లిఫ్ట్ తలుపు తెరుచుకోగానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇక వీడియో వైరల్ కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. అనేక మంది ఆమె తీరును తప్పుబట్టారు. భారత్‌లో అయితే ఇలాంటి చర్యలకు పోక్సో చట్టం వర్తిస్తుందని అన్నారు. అరెస్టయ్యాక కనీసం బెయిల్ కూడా దొరకదని హెచ్చరించారు.
ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మహిళ ఎట్టకేలకు స్పందించింది. తన వాదనను వినిపించింది. లిఫ్ట్‌లోని బాలుడు తన ఫ్రెండ్ కొడుకని, తామిద్దరం షాపింగ్‌కు వెళ్లివచ్చిన సమయంలో ఈ వీడియో తీశానని చెప్పింది. అయితే, తనకు ఐరోపా చట్టాలపై పూర్తి అవగాహన లేదని తెలిపింది. కానీ ఈ ఘటనను వేధింపులుగా చూడొద్దని నెటిజన్లను అభ్యర్థించింది. పూర్తి వివరం తెలుసుకోకుండా విమర్శలకు దిగొద్దని హితవు పలికింది. తనను పోలీసులు అరెస్టు చేసినట్టు వెలువడిన ఫేక్ వార్తలను కూడా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా ఖండించింది.
ఇవీ చదవండి:
డిగ్రీ పట్టా లేకున్నా మా సంస్థలో జాబ్ ఇస్తాం.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఆఫర్
పెళ్లిలో వధూవరుల కుటుంబాల పరస్పర దాడులు! రసగుల్లాలు తక్కువయ్యాయని..