Techie Troubles: అమెరికాలో ఎమ్ఎస్.. 2 ఎల్‌పీఏ శాలరీతో తొలి జాబ్! చివరకు..
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:11 PM
అమెరికాలో ఎమ్ఎస్ చేసి వచ్చిన ఓ టెకీ భారత్‌లో పడుతున్న ఇబ్బందుల తాలూకు పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సదరు టెకీ పరిస్థితిపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తోచిన సలహాలు ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీలో సీటు రాని చాలా మంది అమెరికాలో పైచదువులు చదివి తమ కెరీర్‌ను గాడిలో పెట్టుకోవాలని అనుకుంటారు. ఇదే ప్లాన్‌తో అమెరికాలో ఎమ్ఎస్ చదివి చివరకు మళ్లీ భారత్‌కు తిరిగొచ్చిన ఓ టెకీ ఏటా రూ.2 లక్షల శాలరీ ఇచ్చే జాబ్‌లో చేరారు. చివరకు దానికి కూడా రిజైన్ చేశారు. అసలు ఏం జరిగిందో చెబుతూ ఆ టెకీ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది ( US Educated Techie Troubles)
గతేడాది ఇండియాకు తిరిగొచ్చాక జాబ్ లేకుండా ఉండటం ఇష్టం లేక తాను తక్కువ శాలరీ అయినా జాబ్‌లో చేరినట్టు తెలిపారు. ఓ ఫిన్‌టెక్ సంస్థలో చేరినట్టు వివరించారు. టైర్-1 నగరంలో తాను ఉండటంతో డబ్బులు అసలు ఏమాత్రం సరిపోయేవి కావని తెలిపారు. పైపెచ్చు ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు రోజుకు 3 గంటల సమయం వృథా అయ్యేదని తెలిపారు. ఆఫీసులో కొలీగ్స్, మేనేజర్ తీరు కూడా భరింపరానిదిగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టు కూడా ముందుకు సాగని స్థితికి చేరుకుందని తెలిపారు. దీంతో, అక్కడ భవిష్యత్తు లేదని భావించి జాబ్‌కు రిజైన్ ఇచ్చినట్టు తెలిపారు.
ప్రస్తుతం చేతిలో ఆఫర్ ఏదీ లేకపోయినా రిజైన్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు వివరించారు. నోటీస్ పీరియడ్‌లో భాగంగా కంపెనీలో మూడు నెలలు పనిచేయాలని తెలిపారు. ఈ సమయంలో ఇతర జాబ్స్ కోసం ప్రయత్నిస్తానని అన్నారు. డీఎస్ఏ, సిస్టమ్ డిజైన్‌లో మరిన్ని నైపుణ్యాలు సాధిస్తానని తెలిపారు. కనీసం ఏడాదికి రూ.9 లక్షల శాలరీ ఇచ్చే జాబ్ కోసం వెతుకుతున్నానని, ఈ మార్కెట్‌లో అది సాధ్యమేనా? అని ప్రశ్నించారు. టెకీ పరిస్థితికి చలించిపోయిన నెటిజన్లు పలు సలహాలు ఇచ్చారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
టెక్ రంగం ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఏఐ ప్రభావం, ఇతర కారణాల వల్ల అనేక సంస్థలు భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. మిడ్ లెవెల్ ఉద్యోగులను ఎక్కువగా తొలగిస్తున్నాయి. అదే సమయంలో నియామకాలను కూడా తగ్గిస్తుండటంతో ఇటీవలే చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి దొరక్క ఇబ్బందుల పాలవుతోంది.

ఇవీ చదవండి:
హెచ్ఆర్ తప్పిదం.. ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ఈమెయిల్
ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..