Vietnam Indian Couple: వియత్నాంలో భారత జంట చోరీ.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:02 PM
వియత్నాంలో పర్యటనలో ఓ భారతీయ జంట నిస్సిగ్గుగా చోరీ చేస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జనాలు ఆ జంటను తిట్టిపోస్తున్నారు. దేశం పరువు తీసేశారంటూ మండిపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వియత్నాం పర్యటనలో ఓ భారతీయ జంట వీధి వ్యాపారి నుంచి వస్తువులు దొంగతనం చేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుండగా జనాలు ఆ జంటపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దేశం పరువు తీసేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Indian tourists' controversy).
నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం, ఓ భారతీయ జంట వియత్నాంలో వీధి వ్యాపారి వద్ద షాపింగ్ చేయసాగారు. ఇంతలో ఆ భారతీయ వ్యక్తి వియత్నాం మహిళను ఏదో వస్తువు చూపించమని అడిగారు. ఆమె వెనక్కు తిరిగి అతడు అడిగిన డ్రస్సును తీసిస్తుండగా ఆ వ్యక్తి అక్కడున్న ఓ వస్తువును తీసి తన భార్యకు ఇచ్చేశాడు. ఆమె వెంటనే దాన్ని ఎవరికంటా కనబడకుండా దాచిపెట్టింది. ఆ తరువాత మహిళ కూడా ఓ వస్తువును సైలెంట్‌గా చోరీ చేసింది. ఇవన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యి నెట్టింట బాట పట్టాయి (viral video stealing vendor).
ఇక ఈ వీడియోపై భారతీయులు పెద్ద ఎత్తున స్పందించారు. సిగ్గులేకుండా చోరీ చేసిన భారతీయ జంటపై దుమ్మెత్తిపోశారు. దేశం పరువు తీసేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమ హోదాను సిగ్గులేకుండా ప్రదర్శించే ఇలాంటి వారు చిరు వ్యాపారుల వద్ద చోరీలు ఎలా చేస్తారో’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘ఇది మానోళ్లల్లో సాధారణంగా కనిపించే జాడ్యం. చిన్న చిన్న వస్తువులను చోరీ చేసి ఏదో సాధించామని అనుకుంటూ ఉంటారు’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలాంటి వాళ్ల వల్ల విదేశాల్లో భారతీయులపై వ్యతిరేకత పెరుగుతోందని మరొకరు అన్నారు. ‘ఓవైపు ఇలాంటి పనులు చేస్తూ మరో వైపు జాత్యాహంకారం అంటూ గోలపెడుతుంటారు. వీళ్లు ఎప్పుడు మారతారో’ అని కూడా కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. మరి ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి:
3 సార్లు హెచ్-1బీ వీసాలో నిరాశ.. పంతం పట్టి కల నెరవేర్చుకున్న యువకుడు
యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట