Rs 3.5 Lakh Monthly Internship: ఐఐఎమ్‌లో చదివిన యువతికి నెలకు రూ.3.5 లక్షల స్టైఫెండ్.. స్నేహితురాలు షాక్
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:27 PM
ఐఐఎమ్‌లో చదివిన ఓ యువతికి నెలకు రూ.3.5 లక్షల స్టైఫెండ్‌తో ఇంటర్న్‌షిప్ రావడం ఆమె స్నేహితురాలిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రాకతో మానవమేధకు విలువ తగ్గుతుందన్న ఆందోళన నడుమ అనేక మంది డిగ్రీలకు ఇక విలువ లేదన్న అంచనాకు వస్తున్నారు. ఇది పూర్తిగా వాస్తవం కాదంటూ ఓ యువతి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఐఎమ్ కలకత్తాలో చదివిని తన స్నేహితురాలు నెలకు రూ.3.5 లక్షల స్టైఫెండ్ ఇచ్చే ఇంటర్న్‌షిప్ దక్కించుకుందంటూ సాక్షి జైన్ అనే మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
మీడియా ఏజెన్సీని నిర్వహిస్తున్న సాక్షి జైన్ అనే మహిళ లింక్డ్‌ఇన్‌లో ఈ పోస్టు పెట్టారు. ‘‘నిన్న నా ఫ్రెండ్‌ను కలిశా. సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం ఆమె ముంబైకి వచ్చింది. ఆమెకు నెలకు రూ.3.5 లక్షల స్టైఫెండ్ ఇస్తు్న్నారట. అవును.. జస్ట్ ఇంటర్న్‌షిప్ కోసమే. అప్పుడు నాకు అనిపించింది.. కాలేజీ డిగ్రీలు పనికి రావని అనుకుంటాం గానీ వాస్తవం కొంచెం భిన్నంగా ఉంటుంది. మొదట్లో నేనూ దీన్ని నమ్మేదాన్ని. కానీ కొన్ని సార్లు ఎదురయ్యే అనుభవాలు మనల్ని పునఃసమీక్షించుకునేలా చేస్తాయి. డిగ్రీలకు అన్ని చోట్లా విలువ ఉండకపోవచ్చు. కానీ అవి ఒక్కోసారి కొత్త మార్గాలు చూపిస్తాయి. మనం లేవు అనుకున్న అవకాశాలను కళ్లముందుంచుతాయి. కాలేజీ డిగ్రీలకు ఇప్పటికీ ఆ పవర్ ఉంది. నేనేమీ పోలికలు తేవట్లేదు కానీ విజయానికి అనేక మార్గాలు ఉన్నాయి. అన్ని సబబైనవే’’ అంటూ ఆమె తన పోస్టును ముగించింది.
దీనిపై నెట్టింట అనేక మంది కామెంట్ చేశారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయని అన్నారు. కొందరు ఐఐఎమ్ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ కింద నెలకు రూ.12.5 అందుకున్న ఘటనలు తనకు తెలుసునని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. ఈ కాలంలో ఎమ్‌బీయేలు అవసరం లేదని అనుకుంటాం గానీ ఐఐఎమ్ డిగ్రీలకు ఉండే గుర్తింపే వేరు. జీవితాంతం ఆ డిగ్రీ ఒక ఆస్తిగా మన వెంటే ఉంటుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు
వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..