Elephant Rescue: నీటి ట్యాంకులో ఇరుక్కుపోయి ఏనుగు అవస్థలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:43 PM
నీటి ట్యాంకులో పడి ఇరుక్కుపోయిన ఓ ఏనుగును అటవీ శాఖ సిబ్బంది కాపాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఐఎఫ్ఎస్ అధికారి సుప్రీయా సాహూ ఈ వీడియోను షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: జనావాసాలు పెరుగుతున్న కొద్దీ అడవుల విస్తీర్ణం తగ్గి అక్కడి జంతువులు నానా రకాల అవస్థలూ పడుతున్నాయి. కొన్ని జనావాలవైపు వచ్చి ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాయి. సరిగ్గా ఇలాగే చిక్కుల్లో పడ్డ ఏనుగును అటవీ శాఖ సిబ్బంది రక్షించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుప్రియా సాహూ షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన జనాలు అటవీ శాఖ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు (Elephant Trapped Water Tank Video).
నీలగిరి అడవుల్లోని కూనూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సుప్రీయా సాహూ తెలిపారు. అక్కడి ఓ గిరిజన గ్రామానికి సమీపంలోని నీటి ట్యాంకులో ఏనుగు ఇరుక్కుపోయిందని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ట్యాంకు బద్దలు కొట్టి ఏనుగు బయటకొచ్చేలా చేశారని అన్నారు. మూగ జీవాన్ని కాపాడినందుకు వారిని ప్రశంసించారు. కూనూర్ రేంజ్ ఆఫీసర్, ఇతర టీమ్ సభ్యులు ఏనుగును కాపాడి మళ్లీ అడవిలోకి మళ్లేలా చేశారని అన్నారు (Elephant Rescue Tamil Nadu).
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. అటవీ శాఖ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. వన్యప్రాణు లకు అసలైన రక్షకులు వీళ్లేనని కొందరు కితాబునిచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.
ఐఎఫ్ఎస్ అధికారి సుప్రియా సాహూ గతంలో కూడా ఇలాంటి స్ఫూర్తివంతమైన వీడియోలను షేర్ చేశారు. ఇటీవల నీటిలో పడ్డ ఇండియన్ గోర్‌ను (అడవి దున్నల జాతికి చెందినది) అటవీ శాఖ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి కాపాడారు. నీటిలోకి దిగిన సిబ్బంది గోర్‌కు తాళ్లు కట్టి బయటకు లాక్కొచ్చారు. ఈ ఉదంతం గురించి కూడా ఐఎఫ్ఎస్ అధికారిణి వీడియోను చేశారు. ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది. అటవీ శాఖ సిబ్బందిపై జనాలు ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి:
భారతీయ మహిళ దుమ్ము దులిపేసిన ఇటలీ వనిత.. తన భర్తను అవమానించిందని..
బిలియనీర్‌ల సక్సెస్‌కు కారణం ఇదీ.. సీక్రెట్ చెప్పిన న్యూరాలజిస్టు