Secure Best Seats in Airplane: విమానాల్లో నచ్చిన సీటును ఎక్స్ ట్రా డబ్బులు చెల్లించకుండా బుక్ చేసుకోవాలంటే..
ABN , Publish Date - Apr 17 , 2025 | 08:30 PM
విమానాల్లో నచ్చిన సీటు దక్కించుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని టిప్స్ పాటిస్తే విమానాల్లో నచ్చిన సీటును అదనపు చార్జీలు చెల్లించుకుండానే దక్కించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగ మధ్య సీట్లను తక్కువ మంది ఇష్టపడతారు. ఇద్దరి మధ్య కూర్చోవడం అసౌకర్యంగా ఉండటమే ఇందుకు కారణం.
త్వరగా చెకిన్ అయ్యే వారికి మధ్య సీట్లు దక్కే అవకాశం ఎక్కువ. మంచి సీట్లను చివరి వరకూ ఖాళీగా ఉంచి ఆ తరువాత అధిక ధరకు విక్రయించాలని ఎయిర్ లైన్స్ భావిస్తుంటాయట.
ఆన్‌లైన్ చెకింగ్ ఇన్ చేసేటప్పుడు వీలైనంత సేపు వేచి చూడాల్సింది. దీంతో, మధ్య సీట్లు అన్నీ పోను ఎక్స్‌ట్రా లెగ్ రూం ఉన్న సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఇది బిజీ విమానాలకు వర్తిస్తుందని కొందరు చెబుతారు.
ఇక ఎయిర్‌లైన్స్ ఆఫర్ చేసే ప్రోగ్రాముల్లో చేరితే అదనపు ధరలు చెల్లించకుండానే నచ్చిన సీట్లను ఎంచుకోవచ్చు.
రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో ప్రయాణాలు పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. నచ్చిన సీట్లల్లో కూర్చుని జాలీగా ప్రయాణం చేయొచ్చు.
గ్రూపులో సభ్యులుగా వెళుతున్నప్పుడు రిజర్వేషన్ చేయించుకుంటే అందరికీ ఒకే చోట సీట్లు దక్కే అవకాశం ఉంది.
గేటు వద్ద ఉన్న సిబ్బందితో సభ్యతగా మాట్లాడుతూ వారిని మంచి చేసుకుని నచ్చిన చోట సీటు దక్కించుకునే అవకాశం ఉంది.
నిత్యం విమానాల్లో ప్రయాణించే వారికి కలుసుకుని వారి నుంటి టిప్స్ తెలుసుకుని అమలు చేయాలి.
ఎయిర్‌లైన్స్ సీటింగ్ పాలసీపై అవగాహనతో నచ్చిన సీటు దక్కించుకునే ఛాన్సులు పెంచుకోవచ్చు.
సీటింగ్‌లో ఉచిత మార్పులకు అనుమతించే ఎయిర్‌లైన్స్ సంస్థను ఎంచుకోవడం మంచిది. డబ్బులు ఖర్చు, సీటింగ్‌లో ప్రయాణ సౌకర్యాన్ని సరిగ్గా బేరిజు వేసుకుని రంగంలోకి దిగితే హ్యాపీగా జర్నీని ఎంజాయ్ చేయొచ్చు
సీటింగకు సంబంధించి వివిధ రకాల వ్యూహాలు ఒకేసారి అమలు చేయడం ద్వారా నచ్చిన సీటును దక్కించుకునే అవకాశాలు పెంచుకోవాలి. ఈ టిప్స్‌ను పాటిస్తే విమానాల్లో నచ్చిన సీటును దక్కించుకోవడం అంత కష్టమేమీ కాదని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో వింత రేసు.. వీర్య కణాల మధ్య పరుగుపందెం.. భారీ స్థాయిలో ఏర్పాట్లు
జాబ్‌లో మజా లేదని యువతి రాజీనామా.. షాక్‌లో సంస్థ యజమాని
ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..