Share News

Viral: దేవుడా.. యువజంటలకు ఏమవుతోంది!? హైహీల్స్ వేసుకోవద్దని భర్త అన్నందుకు..

ABN , Publish Date - Feb 06 , 2025 | 07:18 PM

హైహీల్స్ వేసుకోవద్దన్నందుకు ఓ యువతి భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న జనాలు.. ఇలాంటి విషయాల్లోనూ జంటలు గొడవపడుతున్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral: దేవుడా.. యువజంటలకు ఏమవుతోంది!? హైహీల్స్ వేసుకోవద్దని భర్త అన్నందుకు..

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు, భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ కాలంతో పాటు ఈ వ్యవస్థలో కూడా అనేక మార్పులు అని వార్యమయ్యాయి. విడాకులు కూడా సాధారణ విషయంగా మారింది. చిన్న చిన్న విషయాలకే బంధాలు విచ్ఛిన్నమవుతున్న ఘటనలు పరిపాటిగా మారాయి. దాదాపు ఇలాంటి ఘటన ఒకటి ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేటి తరంలో జంటలకు ఏమవుతోందని అనేక మంది ప్రశ్నించేలా చేస్తోంది (Viral).

ఆగ్రాలో తాజా ఘటన వెలుగు చూసింది. హై హీల్స్ ఉన్న చెప్పుల వినియోగానికి సంబంధించి ఓ యువ జంట మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారి చివరకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ వరకూ వెళ్లింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ జంటకు ఇటీవలే పెళ్లైంది. కొన్ని రోజుల తరువాత యువతి తనకు హైహీల్స్ ఉన్న చెప్పులు తేవాలని భర్తకు కోరింది. ఇందుకు ఓకే చెప్పిన భర్త హైహీల్స్ శాండల్స్ తీసుకొచ్చాడు. వాటిని వేసుకుని బయటకు వెళ్లిన యువతి ఓ సందర్భంలో జారి కింద పడింది. కాలు బెణికింది.


Close Encounter with Tiger: పొలానికి వచ్చిన రైతులకు ఎదురుపడ్డ పెద్ద పులి.. ఆ తరువాత ఊహించని ట్విస్ట్!

దీంతో, ఆమె బాగుకోరే వాడిగా హై హీల్స్ వాడొద్దని భర్త చెప్పాడు. యువతి మాత్రం భర్త సూచనను అంగీకరించలేదు. హై హీల్స్ వాడుతూనే ఉంటానని తెగేసి చెప్పింది. అది మొదలు వారి మధ్య గొడవ మొదలైంది. ఈ విషయమై తరచూ గొడవలు పడుతుండేవారు. ఇటీవల ఓ రోజు వివాదం పతాకస్థాయికి చేరడంతో యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె నెల రోజులైనా తిరిగి రాకపోవడంతో వారి వివాదం చివరకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరింది.


Kumbh Mela - Non Veg Food: కుంభమేళాలో జంట నీచత్వం.. ఆగ్రహంతో ఊగిపోయిన నాగ సాధువు ఊహించని విధంగా..

అయితే, తాము కౌన్సెలింగ్ ఇచ్చాక యువ జంట రాజీ పడిందని అక్కడి సిబ్బంది చెప్పుకొచ్చారు. నేటి జమానాలో చిన్న చిన్న గొడవలు కూడా పెను వివాదాలుగా ఎలా మారుతున్నాయో చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. దీనిపై నెట్టింట కూడా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read Latest and Viral News

Updated Date - Feb 06 , 2025 | 07:18 PM