Share News

Close Encounter with Tiger: పొలానికి వచ్చిన రైతులకు ఎదురుపడ్డ పెద్ద పులి.. ఆ తరువాత ఊహించని ట్విస్ట్!

ABN , Publish Date - Feb 06 , 2025 | 05:19 PM

పొలానికి వచ్చిన ఇద్దరు రైతులకు ఓ పెద్ద పులి ఎదురుపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో పులి చేసిన పని చూసి అంతా షాకైపోతున్నారు.

Close Encounter with Tiger: పొలానికి వచ్చిన రైతులకు ఎదురుపడ్డ పెద్ద పులి.. ఆ తరువాత ఊహించని ట్విస్ట్!

ఇంటర్నెట్ డెస్క్: అడవుల విస్తీర్ణం తగ్గుతున్న కొద్దీ క్రూర మృగాలు జనావాసాల వైపునకు వస్తున్నాయి. ఇది మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రమాదకరంగా మారుతోంది. క్రూర జంతువులు, మనుషులు కలిసి జీవించడం అసాధ్యం. అయితే, ఇలాంటి సందర్భాల్లో కొన్ని అనూహ్య ఘటనలు కూడా జరుగుతుంటాయి. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యూపీలో జరిగిన ఈ ఉదంతం తాలూకు వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాస్ షేర్ చేశారు (Viral).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు రైతులు తమ పొలం వద్దకు బైక్‌పై వచ్చారు. అప్పటికే పొలంలో ఎత్తైన మొక్కల మధ్య పులి దాగి ఉన్నది. ఆ విషయం వారికి తెలియదు. దీంతో, వారు యథాప్రకారం, తమ పొలాన్ని పరిశీలిస్తున్నారు. ఓ వ్యక్తి బైక్‌పై కూర్చుని ఉండగా మరో వ్యక్తి అతడి వెనకాల నిలబడ్డాడు. ఇంతలో పులి మొక్కల మాటు నుంచి తల బయటపెట్టింది.


Kumbh Mela - Non Veg Food: కుంభమేళాలో జంట నీచత్వం.. ఆగ్రహంతో ఊగిపోయిన నాగ సాధు ఊహించని విధంగా..

అయితే, అదృష్టవశాత్తూ అది బయటకు రాగానే ఆ ఇద్దరు రైతులు అప్రమత్తమయ్యారు. పులి దాడి చేస్తే వెంటనే తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో తమ బైక్‌ను వెనక్కు తిప్పారు. వారు కదలగానే పులి పొలంలోంచి బయటకు కాలు పెట్టింది. ఆ తరవాత ఊహించని విధంగా అది బద్ధకంగా రోడ్డుపైనే కూర్చుండిపోయింది. వారి వెంట పడే ప్రయత్నమే చేయలేదు. ఇదంతా సాధారణమన్నట్టు ఆ ఇద్దరు రైతులను పెద్ద పులి చూసీచూడనట్టుగా వదిలేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘‘జంతువులు మనుషులు కలుపుగోలుగా జీవించడం అంటే ఇదే’’ అని కామెంట్ చేశారు.


Viral: మరో 3 నిమిషాలు ఆగితే మరో రైలు వస్తుందని కద తల్లీ! ఎందుకింత తొందర!?

ఇక ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ‘‘వాళ్లు లక్కీ అనే చెప్పాలి. ప్రతి సారీ ఇలా జరుగుతుందని చెప్పలేం. అడవుల విస్తీర్ణం పెంచితే ఇలాంటి పరిస్థితులు తలెత్తవు’’ అని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. ‘‘పెద్దపులి గతంలో ఆ రైతులను చూసే ఉంటుంది. అందుకే దాడి చేయకుండా వదిలిపెట్టింది’’ అని మరో వ్యక్తి అన్నారు. ‘‘వారు వెనక్కు తిరగగానే పులి బయటకు వచ్చింది. పులి మొదటి నుంచీ వారినే గమనిస్తోంది’’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Feb 06 , 2025 | 05:19 PM