Viral: గుర్రంపైకి ఎక్కిన పెళ్లి కొడుకు.. ఇంతలో ఊహించని ఘటన!
ABN , Publish Date - Feb 14 , 2025 | 07:17 PM
గుర్రంపైకి ఎక్కిన ఓ వరుడు అనూహ్యంగా కింద పడ్డ ఘటన తాలూకు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి జనాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లడం భారతీయ వివాహాల్లో సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే, గుర్రాలు ఎప్పుడు ఏం చేస్తాయో చెప్పడం కష్టం. స్వారి చేసే వ్యక్తి దానికి ఏమాత్రం నచ్చకపోయినా అది కింద పడేస్తుంది. ఈ క్రమంలో భారీ గాయాలైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓ పెళ్లి కొడుకు విషయంలో దాదాపుగా ఇదే జరిగింది. గుర్రంపైకి ఎక్కిన వెంటనే అది అతడిని కింద పడేయడంతో చుట్టూ ఉన్న వారంతా షాకైపోయారు. ఈ ఉదంతంలో అతడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రిలాక్స్ అయిన జనాలు అతడి పరిస్థితి చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు. నెట్టింట కూడా ఈ ఉదంతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
Startup Rewards Loyalty: ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయా? నమ్మకస్తులైన ఉద్యోగులకు రూ.10 లక్షల బోస్!
ఘటన ఎక్కడ జరిగిందీ తెలియకపోయినా జనాలను మాత్రం ఈ వీడియో బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వరుడు పెళ్లి మండపం వద్దకు గుర్రంపై ఊరేగింపుగా వెళ్లేందుకు సిద్ధమైయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు గుర్రాన్ని ఏర్పాటు చేశాడు. డప్పు శబ్దాలు మోగుతుండగా ఆ వ్యక్తి గుర్రంపైకి ఎక్కాడు. వాస్తానానికి అశ్వంపైకి ఎక్కేటప్పుడే అతడు కొద్దిగా తడబడుతున్నట్టు కనిపించాడు. కానీ ఎలాగొలా మేనేజ్ చేసి ఎక్కేశాడు. కానీ గుర్రం మాత్రం మొదట్లోనే కాస్త అసహజంగా కదిలింది. అతడు ఎక్కగానే ఒక్కసారిగా ముందుకు లంఘించుకుంది. దీంతో, బ్యాలెన్స్ తప్పిన అతడు కిందపడిపోయాడు. పెళ్లి కొడుక్కు ఏమైందో అని అంతా కాంగారు పడ్డారు. ఇంతలో అతడు మెల్లగా దుస్తులు దులుపుకుని లేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటిదాకా నవ్వు ఆపుకున్న కొందరు అతడికి ఏం కాలేదని తెలిశాక ఒక్కసారి భళ్లున నవ్వారు.
Viral: భూటాన్‌లో భారతీయ పెట్రోల్ పంప్.. లీటర్ ఇంధనం ధర ఎంతో తెలిస్తే..
ఇక ఈ వీడియో నెట్టింట కూడా వైరల్‌గా మారింది. జనాలు షాకైయ్యేలా చేస్తోంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 40 లక్షల వరకూ వ్యూస్, లక్ష వరకూ లైకులు వచ్చాయి. ఇక వీడియోపై జనాల తుంటరి కామెంట్స్‌కు అంతేలేకుండా పోయింది. గుర్రంపై గాడిద ఎక్కి కూర్చునేందుకు ప్రయత్నిస్తే ఇలాగే జరుగుతుంది అని కొందరు కామెంట్ చేశారు. మద్యం మత్తులో గుర్రం ఎక్కి ఉంటాడు.. కింద పడ్డాక మత్తు వదలిపోయి ఉంటుంది అని మరో వ్యక్తి సెటైర్ పేల్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.