Viral Marriage Wishlist: వరుడి కోసం అమ్మాయి షాకింగ్ డిమాండ్లు.. క్రేజీ రూల్స్ లిస్ట్ వైరల్..
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:44 PM
Mumbai Woman Demands For Groom Viral: అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైనా తాము పెళ్లి చేసుకునే ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకోవడం సహజమే. కానీ, ఈ అమ్మాయి రూటే సెపరేటు. కాబోయే వరుడి కోసం ఈమె కోరికల చిట్టా వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఆ లిస్ట్ ఏంటో మీరూ చూసేయండి..
Mumbai Woman Marriage Wishlist Viral: సోషల్ మీడియా.. ప్రజలు తమ అభిప్రాయలను, భావాలను నిస్సంకోచంగా, నిరభ్యంతరంగా చెప్పుకునేందుకు వేదిక. అందుకే నేటి తరం తమ ఆశలు, కోరికలు ఏవైనా తడుముకోకుండా ప్రపంచం ముందు పెడుతున్నారు. అలాగే ముంబయికి చెందిన ఓ యువతి కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు, జీతం గురించి ఓ 18 పాయింట్ల లిస్ట్ తయారుచేసింది. మ్యాట్రిమోని సైట్‌లో ఆమె ప్రొఫైల్ చూసి ఒక అబ్బాయి అడగడంతో తన డిమాండ్ల చిట్టా షేర్ చేసింది. అది చూసి దిమ్మతిరిగిన ఆ అబ్బాయి స్క్రీన్ షాట్ తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఇటీవల, ఒక మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఒక అమ్మాయి ప్రొఫైల్ చూసి ఇంప్రెస్ అయిన ఓ వ్యక్తి తన ఇష్టాఇష్టాలు, కోరికలు చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. దీనికి ఆ అమ్మాయి తెగ సిగ్గుపడిపోతూనే.. 'మీకు నిజంగా తెలుసుకోవాలని ఉందా?' అని అడిగింది. దీనికి అతడు అవును అని సమాధానం ఇచ్చాడు.! తప్పకుండా నాకు తెలుసుకోవాలని ఉందని అన్నాడు. అంతే.. 18 పాయింట్లు ఉన్న ఓ లిస్ట్ చూసి అబ్బాయి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ముఖ్యంగా ఆమె తన కాబోయే భర్తకు ఉండాల్సిన కనీస లక్షణాలే అని క్యాప్షన్ పెట్టడంతో ఒక్కసారిగా మతిపోయినవాడిలాగే అయిపోయాడు. నెలకు రూ.3 లక్షల జీతం, అందం, హైట్, ఫిట్‌నెస్, విలాసవంతమైన జీవితం, పెళ్లి తర్వాత ఎలా ఉండాలి, పిల్లల్ని కనడంలో ఇలా అనేక రకాల డిమాండ్లు ఆ జాబితాలో ఉన్నాయి.

రెడ్డిట్‌లో తన పోస్ట్‌లో ఆ అబ్బాయి ఈ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన వెంటనే ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది యూజర్ల మహిళను విమర్శించగా, మరికొందరు ఇలా డిమాండ్ చేయడం తప్పేం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Optical Illusion Test: మీ కళ్లకు పరీక్ష.. జిరాఫీల మధ్యనున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి
Picture Puzzle: మీ అబ్జర్వేషన్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 15 సెకెన్లలో కనుక్కోండి...
120 Year Old: 120 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలా.. 50 ఏళ్లుగా అదే పని