Gas Tricks: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు..
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:18 AM
గ్యాస్ బండ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తద్వారా గ్యాస్ ఆదా అవుతుంది.
ప్రస్తుతం వంట గ్యాస్ వినియోగం బాగా పెరిగిపోయింది. గ్యాస్ బండ ధర రూ. 900 పైనే ఉంది. అదే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1200 పైనే ఉంది. ఈ గ్యాస్ బండ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదీకాక శీతాకాలం గ్యాస్ వినియోగం అధికంగా ఉంటుంది. దాంతో గ్యాస్ కొన్న కొద్ది రోజులకే సిలిండర్ ఖాళీ అయిపోతుంది. సింపుల్ చిట్కాలు పాటిస్తే.. గ్యాస్ బండను మరికొన్ని రోజులు వాడుకోవచ్చు.
ఇలా చేయండి..
వంట చేసేటప్పుడు బర్నర్‌ను పూర్తిగా హై ఫ్లేమ్‌లో ఉంచే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని వల్ల అవసరమైన దానికంటే అధికంగా మంట వస్తుంది. గ్యాస్ త్వరగా అయిపోతుంది. గ్యాస్ స్టౌవ్‌పై గిన్ని పెడితే.. ఆ వస్తువు కింద భాగం ఎంత వరకు మంట ఉండాలో అంతవరకు ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల ఆహారం వేగంగా ఉడకడమే కాకుండా.. గ్యాస్ సైతం ఆదా అవుతుంది.
శుభ్రం చేసుకోవాలి..
స్టౌవ్ బర్నర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి శుభ్రంగా ఉంటే.. మంట నీలం రంగులో వస్తుంది. అదే మంట ఎరుపు, లేదా పసుపు,నారింజ రంగులో ఉంటే.. బర్నర్‌లో ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఒక వేళ బర్నర్‌లో ఏదైనా సమస్య ఉంటే.. గోరు వెచ్చని నీటితోపాటు పీచుతో శుభ్రం చేయాలి. మంట పసుపు రంగులో ఉంటే.. దానిని రిపేర్ చేయడం ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తక్కువ నీరు ..
వంట చేసేటప్పుడు, అవసరమైన నీటిని మాత్రమే వినియోగించాలి. సరైన ప్రణాళిక లేకుండా ఎక్కువ నీరు ఉపయోగించడం వల్ల అవి మరిగే వరకు అధిక గ్యాస్ వినియోగం అవుతుంది. పరిమితంగా నీటిని ఉపయోగించడమే కాకుండా.. వంట చేసే సమయాన్ని సైతం తగ్గించడం వల్ల గ్యాస్‌ను ఆదా చేయవచ్చు.
పాత్రలకు తడి లేకుండా చూసుకోవాలి..
స్టౌవ్ మీద ఉంచి పాన్ మీద నీటి చుక్కులు పడినా.. అవి ఆవిరి కావడానికి గ్యాస్ ఎక్కువగానే వృధా అవుతుంది. పాన్ కానీ.. గిన్నె కానీ ఏదైనా వస్తువు పూర్తిగా ఆరిన తర్వాతే.. స్టౌవ్ మీద ఉంచాలి. తద్వారా గ్యాస్‌ను ఆదా చేయవచ్చు. అధిక మంటను ఉపయోగించడం వల్ల అధికంగా గ్యాస్ ఖర్చవుతుంది.
ఇవి కూడా చదవండి:
తల్లిదండ్రులు మందలింపు.. విద్యార్థి ఆత్మహత్య
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More Prathyekam And Telugu News