Share News

Russian Woman - OCI Card: రష్యా మహిళకు ఓసీఐ కార్డు.. ఆమె సంబరం చూస్తే..

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:50 PM

భారతీయుడిని వివాహమాడిన ఓ రష్యా మహిళకు ఇటీవలే ఓసీఐ కార్డు దక్కింది. దీంతో, తన సంబరాన్ని నెట్టింట పంచుకుంటూ ఆమె పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Russian Woman - OCI Card: రష్యా మహిళకు ఓసీఐ కార్డు.. ఆమె సంబరం చూస్తే..
Russian Woman With OCI Card

ఇంటర్నెట్ డెస్క్: ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు దక్కించుకున్న ఓ రష్యా మహిళ సంబరపడిపోతూ పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. దాదాపుగా భారతీయురాలినైపోయా అంటూ ఆమె సంబరపడిపోతూ పెట్టిన పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

మరీనా ఖర్బానీ అనే రష్యన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ వీడియో పోస్టు చేశారు. భారతీయుడిని పెళ్లాడిన ఆమెకు ఓ బిడ్డ కూడా ఉంది. చిన్నారితో పాటు పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చి ఓసీఐ కార్డు తీసుకున్న ఆమె తెగ మురిసిపోయారు. సంబరంతో తుళ్లిపడుతూ ఓ వీడియో తీసి నెట్టింట పంచుకున్నారు. ‘‘ఈ విలువైన డాక్యుమెంట్ కోసం 3.5 ఏళ్లుగా వేచి చూశాను. ఇప్పుడు నేనూ ఓసీఐ కార్డు ఉన్న వ్యక్తినే’’ అని రాసుకొచ్చారు. కార్డును మాటమాటికీ చూసుకుంటూ ఆమె మురిసిపోతున్న తీరు జనాలను అమితంగా ఆకర్షిస్తుండటంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.


ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అనేక మంది ఆమెకు అభినందనలు తెలిపారు. ఇక ఆమెకు వీసా గడువు ముగియడం, పర్మిట్లు వంటి వాటి బెడదే ఉండదని అన్నారు. ఇక్కడి వారు ఐరోపాకు తరలిపోతుంటే అక్కడి వారు ఇక్కడ స్థిరపడేందుకు మొగ్గు చూపడం ఓ వింత అని మరికొందరు కామెంట్ చేశారు. అయితే, ఇది పౌరసత్వం కాదన్న విషయాన్ని కొందరు గుర్తు చేశారు. గత ఏడాది కూడా మరీనా వీడియో వైరల్‌గా మారింది. తను గర్భందాల్చిన విషయం తెలిసి తల్లిదండ్రులు ఎంతగా సంబరపడిపోయారో చెబుతూ ఆమె చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మరీనా ప్రస్తుతం తన భర్త, బిడ్డతో కలిసి మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఉంటున్నారు.


ఏమిటీ ఓవర్సీస్ సిటిజన్ కార్డు

భారత ప్రభుత్వం నిర్వహించే పలు వీసా పథకాల్లో ఇదీ ఒకటి. భారతీయులను పెళ్లాడిన విదేశీయులు కూడా ఓసీఐ కార్డుకు అర్హులే. ఇది ఉన్న వారు సుదీర్ఘకాలం పాటు భారత్‌లో ఉండొచ్చు. ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేందుకు ఆస్తిపాస్తులు కొనుక్కునేందుకూ వారికి అనుమతి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - Apr 26 , 2025 | 02:58 PM