Titanic 3D Immersive Experience: టైటానిక్ ప్రమాదం.. 3డీ సినిమాను మించిన అనుభవం.. చూస్తే గుండెలు అదరాల్సిందే
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:54 PM
టైటానిక్ ప్రమాదాన్ని కళ్లముందు ఆవిష్కరించిన మూవీ గురించి అందరికీ తెలిసిందే. దీన్ని తలదన్నే ఇమ్మర్సివ్ 3డీ ఎక్స్‌పీరియన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయంటూ అనేక మంది కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టైటానిక్ నౌక ప్రమాదం గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. 1912 ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఇది మునిగిపోయింది. ఓ మంచు ఫలకాన్ని ఢీకొట్టడంతో ఈ నావ జలసమాధి అయ్యింది. ఇక నాటి ప్రమాదం ఎంత భయంకరమైనదో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా టైటానిక్. ఈ మూవీకి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ దర్శకత్వం వహించారు. ఇది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక టైటానిక్ 3డీ వర్షన్ కూడా దాదాపు ఇదే స్థాయిలో సినీ అభిమానులను ఉర్రూతలూగించింది (Titanic Immersive 3D Experience).
అయితే, ఆ సినిమాను తలదన్నే రీతిలో టైటానిక్ ప్రమాదం జరిగిన వైనాన్ని ఓ జర్మనీ సంస్థ ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. ఇది జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇమర్సివ్ 3డీ ఎక్స్‌పీరియన్స్ పేరిట టైటానిక్ ప్రమాద దృశ్యాలను ఆవిష్కరించింది. మ్యూనిక్ నగరంలో ఈ షోను ప్రదర్శించారు. టైటానిక్ నావ కళ్లముందే కూలుతున్నట్టు, కూలే నావలో తామున్నట్టు ప్రేక్షకులు అనుభూతి చెందేలా ఏర్పాట్లు చేశారు. ఓ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి నాలుగు వైపులా ఉన్న గోడలు, వేదిక ఉపరితలంపై కూడా ప్రమాద దృశ్యాలను ప్లే చేస్తూ ప్రేక్షకులకు ఒళ్లుగగుర్పొడిచే అనుభూతిని కలిగించారు.
ఇక ఈ షోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ వీడియోలను రికార్డు చేసిన నెట్టింట కూడా పంచుకోవడంతో ఇవి ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. టైటానిక్ ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారంటూ అనేక మంది ప్రశంసలు కురిపించారు. మరి మీరూ ఈ అద్భుత దృశ్యాలను చూసి ఎంజాయ్ చేయండి.
ఇవీ చదవండి:
వామ్మో ఐఫోన్.. తుపానులో చిక్కుకుపోయి.. 3 రోజుల తరువాత చూస్తే..
చిన్నారుల కోసం ప్రత్యేక కారును ఆవిష్కరించిన టొయోటా! చూస్తే మతిపోవాల్సిందే!