Share News

నమ్మండి.. ఇది సైకిలేనండీ..

ABN , Publish Date - May 25 , 2025 | 01:53 PM

ఇదొక పెన్నీ- ఫర్తింగ్‌ సైకిల్‌. అంటే.. ముందు చక్రం పెద్దగా, వెనక చక్రం చిన్నగా ఉండే 1870, 1880ల నాటి పాపులర్‌ సైకిల్‌ అన్నమాట.

నమ్మండి.. ఇది సైకిలేనండీ..

  • బైక్‌లాంటి సైకిల్‌

ఇంగ్లాండ్‌కు చెందిన యువ ఇంజనీర్‌ మిచెల్‌ ఎప్పటిలాగే ఓ రోజు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ అలాగే నిద్రపోయాడట. కలలో తనకి సడెన్‌గా పెన్నీ-ఫర్తింగ్‌ సైకిల్‌ కనిపించింది. మెలకువ వచ్చాక తన ఆలోచనను ఒక బుక్‌లో రాసుకుని.. టెక్నాలజీ సాయంతో అందుకు తగినట్టుగా డిజైన్‌ చేయించుకున్నాడు. ఇంకేముంది తన మార్క్‌ కనబడేలా, కాస్త క్రేజీగా... తన ఇంట్లో ఉన్న 20 ఏళ్లనాటి యమహా ఆర్‌6 బైక్‌ని ఇలా సైకిల్‌గా మార్చేశాడు. దీని తయారీ కోసం స్టీల్‌తో అవసరమైన భాగాలన్నింటినీ సొంతంగా తయారు చేసుకున్నాడు.


ఒక్క ముందు చక్రమే సుమారు 165 కిలోలు బరువు ఉంటుందట. దీనికోసం దాదాపు 750 గంటలపాటు కష్టపడ్డాడు. ఈ టైపు మోడల్‌లో అత్యంత వేగంగా వెళ్లేది ఇదేనట. అంత కష్టపడి వెరైటీ సైకిల్‌ని తయారుచేస్తే, అది బైకో, సైకిలో తెలియక... దాన్ని రోడ్డు మీద తిరిగేందుకు ఆ దేశంలో అనుమతి లేదన్నారు అధికారులు. దాంతో చిన్న చిన్న వీధుల్లోనే కష్టంగా తొక్కుతూ.. సంతృప్తి చెందుతున్నాడు మిచెల్‌. అన్నీ అనుకూలిస్తే... దీని మీద కచ్చితంగా గంటకు 140 మీటర్ల వేగంతో దూసుకుపోవచ్చని చెబుతున్నాడీ ఇంజనీర్‌.


ఈ వార్తలు కూడా చదవండి.

భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి

Hyderabad Metro: పార్ట్‌-బీ మెట్రోకు డీపీఆర్‌ సిద్ధం

Read Latest Telangana News and National News

Updated Date - May 25 , 2025 | 01:53 PM