Share News

Elon Musk on Colonization: చరిత్ర తెలియక తొందరపడ్డ మస్క్.. ఫైరైపోతున్న భారతీయులు

ABN , Publish Date - Oct 03 , 2025 | 04:55 PM

భారత్‌పై బ్రిటీష్ వలసపాలనను సమర్థించేలా ఉన్న పోస్టుకు వంతపాడిన ఎలాన్ మస్క్ చిక్కుల్లో పడ్డారు. మస్క్‌పై భారతీయులు మండిపడుతుండటంతో ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Elon Musk on Colonization: చరిత్ర తెలియక తొందరపడ్డ మస్క్.. ఫైరైపోతున్న భారతీయులు
Elon Musk on Colonialism in India

ఇంటర్నెట్ డెస్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తాజాగా భారతీయుల ఆగ్రహానికి గురయ్యారు. బ్రిటీష్ వలసపాలన దారుణల గురించి పూర్తిగా తెలుసుకోకుండా తన మనసుకు తోచింది ట్వీట్ చేసి విమర్శల పాలయ్యారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయులు మస్క్‌పై మండిపడుతున్నారు (Elon Musk on Colonization).

భారత్‌లో బ్రిటీష్ వలసపాలనను సమర్థించే ప్రయతంలో ఓ వ్యక్తి వింత వాదనను తెరపైకి తెచ్చారు. బ్రిటన్‌లో ఉంటున్న భారత సంతతి వారు బ్రిటీషర్లు అయినప్పుడు భారత్‌కు వెళ్లిన బ్రిటీషర్లు భారతీయులు అయిపోతారు. ఆ లెక్కన వలస పాలన అనేదే లేదు’ అని కామెంట్ చేశారు. ఈ పోస్టును లైక్ చేసిన ఎలాన్ మస్క్ రిట్వీట్ కూడా చేశారు. ఇది ఆలోచించాల్సిన విషయమే అని అన్నట్టు ఓ ఎమోజీ కూడా పెట్టారు (Musk on British Rule in India).


వలసపాలనను సమర్థించేలా ఉన్న ఈ పోస్టు చూస్తుండగానే వైరల్ అయిపోయింది. జనాలు.. ముఖ్యంగా భారతీయులు మస్క్ రీట్వీట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘భారతీయులు ఇంగ్లండ్ వనరులను కొల్లగొట్టడం లేదు. అక్కడి పౌరులను టార్చర్ పెట్టట్లేదు. బెంగాల్ తరహా క్షమాలకు కారణం కావట్లేదు. జలియన్‌వాలాబాగ్ వంటి మానవ హననాలకు పాల్పడటం లేదు. అనవసర పన్నులు విధించి బ్రిటన్ వ్యాపారాలను కూల్చేయట్లేదు. బ్రిటన్ పౌరులను అండమాన్ లాంటి చోట్లల్లోని జైళ్లలకు తరలించట్లేదు. దేశవిభజన లాంటి విపత్తులకు కారణం కాలేదు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

‘వలస పాలనను సమర్థించుకునేందుకు తెల్లజాతీయులు ఎప్పటినుంచో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సైనిక దురాక్రమణ, సంపద దోపిడి, అత్యాచారాలు, పాలకుల అణచివేతను చట్టబద్ధ వలసలతో పోల్చోడం ఏరకంగా చూసినా సబబు కాదు. తమ తప్పులేదని చెప్పుకుంటూ మైనారిటీలను మరింత తక్కువ చేసి చూపే ప్రయత్నం ఇది’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

కట్నం వద్దన్నందుకు పెళ్లి రద్దు.. యువకుడికి ఊహించని షాక్

లాటరీల జోలికెళ్లన వ్యక్తికి సడెన్‌గా బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.17 కోట్లు

Read Latest and Viral News

Updated Date - Oct 03 , 2025 | 05:03 PM