Share News

Man Climbs High Tension Pole: రూ. 1500 కోసం హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే..

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:44 PM

వేణు గోపాల్ భార్య ఆ 1500 రూపాయలు ఎలాగైనా స్నేహితుడినుంచి తిరిగి తీసుకోవాలని ఒత్తిడి తెస్తూ ఉంది. దీంతో వేణుగోపాల్ తన స్నేహితుడిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దామని అనుకున్నాడు.

Man Climbs High Tension Pole: రూ. 1500 కోసం హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే..
Man Climbs High Tension Pole

స్నేహితుడు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదన్న కోపంలో ఓ వ్యక్తి హైటెన్షన్ కరెంట్ స్తంభం ఎక్కాడు. 1500 రూపాయల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్లేపల్లి వాంబే కాలనీకి చెందిన 30 ఏళ్ల వేణు గోపాల్ తాగుడుకు బానిస అయ్యాడు. బాగా తాగి వచ్చి భార్యను వేధించే వాడు. వేణు గోపాల్ కొంతకాలం క్రితం తన స్నేహితుడికి 1500 రూపాయలు అప్పుగా ఇచ్చాడు.


నెలలు గడుస్తున్నా అతడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఎంత బ్రతిమాలినా కూడా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. వేణు గోపాల్ భార్య ఆ 1500 రూపాయలు ఎలాగైనా స్నేహితుడినుంచి తిరిగి తీసుకోవాలని ఒత్తిడి తెస్తూ ఉంది. దీంతో వేణుగోపాల్ తన స్నేహితుడిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దామని అనుకున్నాడు. ఆదివారం బాగా తాగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన స్నేహితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.


పోలీసులు అతడ్ని కూర్చోమన్నారు. కొద్దిసేపు కూర్చున్న తర్వాత కంప్లైంట్ ఇవ్వమన్నారు. దీంతో అతడి సహనం దెబ్బతింది. పోలీసులు తన కంప్లైంట్‌ను సీరియస్‌గా తీసుకోవటం లేదని భావించాడు. వెంటనే అక్కడినుంచి బయటకు వచ్చాడు. హైటెన్షన్ కరెంట్ స్తంభం ఎక్కాడు. సమస్య పరిష్కారం కాకపోతే కిందకు దూకి ప్రాణం తీసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. హుటాహుటిన స్పందించిన పోలీసులు కరెంట్ సప్లై నిలిపివేశారు. అతడిని ఒప్పించి కిందకు దించారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

59 ఏళ్ల వయసులో ప్రేమ.. 2 కోట్లు మోసపోయిన టీచరమ్మ..

నేడు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 06 , 2025 | 03:41 PM