Share News

Disha Patani’s Sister Rescues Baby: పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి

ABN , Publish Date - Apr 21 , 2025 | 10:34 AM

తన నివాసం వెనకున్న పాడుబడ్డ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెళ్లిన చిన్నారిని బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Disha Patani’s Sister Rescues Baby: పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి
Khushboo Patani rescue story

ఇంటర్నెట్ డెస్క్: పాడు పడ్డ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టిన వెళ్లిన ఓ చిన్నారిని ప్రముఖ నటి దిశా పటానీ సోదరి, మాజీ ఆర్మీ ఆఫీసర్ ఖుష్బూ పటానీ కాపాడారు. బరేలీలో తన ఇంటి వెనకున్న పాడు పడ్డ భవనంలో ఉన్నట్టు గుర్తించి ఆమెను కాపాడారు. అసలేం జరిగిందీ చెబుతూ ఆమె సోషల్ మీడియాలో వీడియో కూడా షేర్ చేశారు. ఆడ బిడ్డల విషయంలో మన సమాజంలో మార్పు రాదా అంటూ ఆక్రోశం వెళ్ళగక్కారు. చిన్నారి బంగరు భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తానని కూడా చెప్పారు.

మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చిన ఖుష్బూకు తన ఇంటి వెనుక ఎవరో బిడ్డ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆమె ఇంటి వెనక నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇల్లు ఉంది. ఈ క్రమంలో ఖష్బూ గోడ ఎక్కి తొంగిచూడగా బాలిక నిస్సహాయంగా రోదిస్తూ కనిపించింది. ముఖం మీద గాయాలతో దుమ్మూధూళిలో పడి ఉన్న బాలికను ఖష్బూ సోదరి అక్కున చేర్చుకుంది. ఈ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పంచుకున్నా ఆమె.. బాలికలపై సమాజంలో నెలకున్న వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


‘‘మన దేశంలో ఆడ శిశువులను కాపాడుకోవాలి. ఈ బాలికకు ఓ కుటుంబాన్ని అందివ్వాలి. ప్రేమతో లాలించే చేతుల్లోకి చేర్చాలి. ఆమెకు మంచి భవిష్యత్తు దక్కేందుకు నేను ప్రయత్నిస్తాను’’ అని ఆమె వీడియో షేర్ చేశారు. సంబంధిత అధికారులను కూడా ట్యాగ్ చేశారు. బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లిన ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ఇక బాలికను ఎవరు అక్కడి వదిలిపెట్టి వెళ్లారో తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.


దిశా, ఖష్బూ బరేలీలో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే. ఖష్బూ ఆర్మీలో చేరగా దిశ నటన వైపు మళ్లారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలను కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..

Read Latest and Viral News

Updated Date - Apr 21 , 2025 | 10:52 AM