Share News

Korean tourists Harassed: కొరియా యువతికి భారతీయ యువకుడి వేధింపులు.. షాకింగ్ వీడియో వైరల్

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:42 PM

కొరియా యువతి వెంట పడుతూ వేధించిన ఓ భారతీయ యువకుడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడి చర్యలకు తాము సారీ చెబుతున్నామంటూ వేల మంది భారతీయులు కామెంట్స్ చేస్తున్నారు.

Korean tourists Harassed: కొరియా యువతికి భారతీయ యువకుడి వేధింపులు.. షాకింగ్ వీడియో వైరల్
Delhi video Korean tourists Harassed

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పర్యటిస్తున్న విదేశీయులు తమ చేదు అనుభవాల గురించి నెట్టింట పెట్టి రచ్చ చేస్తున్నా కొందరు తమ తప్పులు సరిదిద్దుకోవడం లేదు. తమ దుర్బుద్ధి ప్రదర్శిస్తూ దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా మరో వీడియో వైరల్‌గా మారింది. వీడియోలోని భారతీయ యువకుడి దుష్ప్రవర్తన చూసి జనాలు మండిపడుతున్నారు. దేశం పరువును మంటకలుపుతున్నావంటూ అతడిని తిట్టిపోశారు (Delhi video Korean tourists Harassed).

న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. భారత దేశ పర్యటనకు వచ్చిన ఇద్దరు కొరియా టూరిస్టులను ఓ భారతీయ యువకుడు వేధింపులకు గురి చేశాడు. ఆ కొరియా యువతి వెంట పడి ఫిస్ట్ బంప్ చేయమని కోరాడు. చివరకు ఆమె అతడు కోరినట్టు ఫిస్ట్ బంప్ ఇచ్చింది. ఆ తరువాత యువకుడు ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. మొదట ఇబ్బంది పడ్డ ఆమె ఏం చేయాలో తెలియని అయోమయంలో అతడు కోరినట్టు చేసింది. ఆ తరువాత కూడా అతడు వెళ్లిపోతూ.. నువ్వు చాలా అందంగా ఉన్నావు.. ఐ లవ్యూ అని చెప్పి వెళ్లిపోయాడు. అతడి చర్యలకు యువతి చాలా ఇబ్బంది పడింది. ఆమె ముఖంలో ఇది స్పష్టంగా కనిపించింది (India Gate fist bump video).


ఈ వీడియోను క్రియేటర్ జే అనే వ్యక్తి నెట్టింట పంచుకోవడంతో వైరల్‌గా మారింది. జనాలు ఆ యువకుడిపై దుమ్మెత్తిపోశారు. అతడి ప్రవర్తన అమర్యాదకరమని అన్నారు. అతడి తరపున మేము సారీ చెబుతున్నామంటూ అనేక మంది భారతీయులు కామెంట్స్ చేశారు. ఇలాంటి వీడియోలు వైరల్ అయినప్పుడు విదేశాల్లోని భారతీయులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారని మరొకరు అన్నారు. భారత్‌లో పర్యటించేటప్పుడు ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండాలని మరికొందరు కామెంట్ చేశారు. ప్రజల్లో పౌర స్పృహ, విదేశీ పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించాలన్న ఇంగిత జ్ఞానం పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకయ్యేలా చేస్తోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి (Indian man hug viral).


ఇవి కూడా చదవండి:

చైనాలో కొత్త విధానం.. పబ్లిక్ బాత్రూమ్స్‌లో టాయిలెట్ పేపర్ కోసం యాడ్ చూడాల్సిందే

హెచ్-1బీ వీసా పొరపాటు.. ఇలా చేస్తే జీవితం తలకిందులే

Read Latest and Viral News

Updated Date - Sep 19 , 2025 | 01:51 PM