Share News

Auto Driver Secret Videos: విద్యార్థినుల వీడియోలు రహస్యంగా చిత్రీకరిస్తున్న ఆటో డ్రైవర్

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:35 PM

ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు వైరల్ అవుతున్నట్లు గమనించి ఆటోడ్రైవర్‌ను ఎట్టకేలకు గుర్తించాడు. మొదట డ్రైవర్ తప్పును ఒప్పుకోకపోవడంతో యువకుడు కోపంతో నాలుగు తగిలించేటప్పటికి నిజం ఒప్పుకున్నాడు.

Auto Driver Secret Videos: విద్యార్థినుల వీడియోలు రహస్యంగా చిత్రీకరిస్తున్న ఆటో డ్రైవర్
Auto Driver Secret Videos

ఢిల్లీ, సెప్టెంబర్ 27: ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలో ఒక ఆటోడ్రైవర్ చేస్తున్న నీచపు చేష్టలు బట్టబయలయ్యాయి. తన ఆటోలో ఎక్కిన కాలేజ్ అమ్మాయిల్ని సీక్రెట్ గా వీడియోలు తీసి, తర్వాత వాళ్లని లైంగికంగా వేధిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, కొంతమంది విద్యార్థినులను రహస్యంగా చిత్రీకరించి, అసభ్య క్యాప్షన్లు పెడుతూ ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఐ లవ్ యు మేరీ జాన్' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసినట్లు తేలింది. ఈ వీడియోలను చూసిన ఒక యువకుడు డ్రైవర్‌ను కనిపెట్టి నిలదీశాడు.


సదరు యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు వైరల్ అవుతున్నట్లు గమనించి, ఆటో డ్రైవర్‌ను ఎట్టకేలకు గుర్తించాడు. మొదట డ్రైవర్ తప్పును ఒప్పుకోకపోవడంతో యువకుడు కోపంతో నాలుగు తగిలించేటప్పటికి నిజం ఒప్పుకున్నాడు. దీంతో 112కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ ఘటనను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్‌ చేశాడు.

పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఆటోడ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వైరల్ వీడియోలను ధృవీకరిస్తూ దాడి ఘటనపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


ఇవి కూడా చదవండి..

ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..

షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2025 | 06:22 PM