Delhi Airport Viral Video: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీన్స్ చూసి బ్రిటిషర్‌కు షాక్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
ABN , Publish Date - Oct 11 , 2025 | 07:38 PM
రకరకాల హంగులతో వెలిగిపోతున్న ఢిల్లీ ఎయిర్‌పోర్టును చూసి ఓ బ్రిటిషర్ షాకైపోయారు. ఇది బ్రిటన్‌లోని సంపన్న వర్గాలుండే ప్రాంతంలా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోని పేదరికాన్ని, స్లమ్ ఏరియాలను చూపించి సొమ్ము చేసుకునే విదేశీ కంటెంట్ క్రియేటర్లు ఎందరో ఉన్నారు. అయితే, ఓ బ్రిటిష్ కంటెంట్ క్రియేటర్ తాజాగా పెట్టిన వీడియో ప్రస్తుతం భారతీయులను ఆకట్టుకుంటోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టును ప్రశంసిస్తూ నిక్ బూకర్ అనే బ్రిటిషర్ ఈ వీడియోను షేర్ చేశారు (Britisher in Awe of Delhi Airport).
నిక్ బూకర్.. ట్రావెల్ వ్లాగర్‌గా నెట్టింట ఫేమస్. తాజాగా ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టు టర్మినల్-1 వీడియోను పంచుకున్నారు. బ్రిటీష్ సంపన్న వర్గాలు ఉండే ప్రాంతాలతో సమానంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు వెలిగిపోతోందని కీర్తించారు. ఇక్కడికి వచ్చే బ్రిటన్ పర్యాటకులు తమకు తెలిసిన చోటుకే వచ్చినట్టు ఫీలవుతారని అన్నారు. షాపులు, పబ్స్‌తో ఈ ఎయిర్‌పోర్టును పర్యాటకుల కోసం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని అన్నారు. బ్రిటిషర్లకు నచ్చిన బడ్‌వైజర్ పబ్ కూడా ఉందని పేర్కొన్నారు. లండన్, హామ్లీ స్టోర్లు కూడా ఉన్నాయని తెలిపారు (Viral Video).
ఈ వీడియోపై నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నిజంగానే ఓ అద్భుతమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు బెంగళూరు ఎయిర్‌పోర్టు గురించి ప్రస్తావించారు. అక్కడి టర్మినల్-2 భూలోక స్వర్గాన్ని తలపిస్తుందని అన్నారు. భవిష్యత్తులోకి కాలుపెట్టినట్టు ఉంటుందని అన్నారు. భారత్‌లో స్లమ్ ఏరియాలపై కాకుండా ఇలాంటి అంశాలను కూడా ప్రపంచానికి పరిచయం చేసినందుకు అనేక మంది అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఈ ఆసక్తికర వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
భారతీయ యువకుడి వినూత్న కెరీర్.. డెంటిస్ట్‌గా మొదలెట్టి చివరకు యాపిల్‌లో ఏఐ ఇంజినీర్‌గా..
వివాహితతో ఎఫైర్.. ఆమె భర్తకు లవర్ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు