Shark Video: షాకింగ్ వీడియో.. సముద్రపు ఒడ్డున మొసలి.. ఓ షార్క్ వచ్చి ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:55 PM
నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మొసలి నోటి నుంచి ప్రాణాలతో బయటపడడం అరుదు. అయితే నీటిలో మొసలి కంటే షార్క్ చేప మరింత ప్రమాదకరమైనది, బలమైనది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఒళ్లు జలధరించడం ఖాయం.

నీటిలో ఉండే మొసలి (Crocodile) అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలి బలం ముందు ఏనుగు కూడా సరిపోదు. నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మొసలి నోటి నుంచి ప్రాణాలతో బయటపడడం అరుదు. అయితే నీటిలో మొసలి కంటే షార్క్ (Shark) చేప మరింత ప్రమాదకరమైనది, బలమైనది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఒళ్లు జలధరించడం ఖాయం. ఆ వీడియోలో ఓ మొసలికి షార్క్ చుక్కలు చూపించింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మొసలి సముద్రం ఒడ్డున అస్వస్థతకు గురైంది. అది తల్లకిందులుగా ఉంది. ఆ సమయంలో ఒక షార్క్ అక్కడకు వచ్చింది. ఈ మొసలిని నోటితో పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లిపోయింది. అప్పటికి తెలివిలోకి వచ్చిన మొసలి ప్రతిఘటించింది. అయితే షార్క్ బలం ముందు మొసలి పోరాటం పని చేయలేదు. మొసలి తెగిపోయిన మెడ కూడా వీడియోలో కనిపించింది. ఆ తర్వాత మొసలి శరీరం సగం నీటిలో తేలుతూ కనిపించింది.
ఆ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.5 కోట్ల మందికి పైగా వీక్షించారు. 89 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ముందు ఆ మొసలికి ఏమైంది``, ``అత్యంత భయంకరమైన వేట``, ``వామ్మో.. మొసలి కంటే షార్క్ మరింత ప్రమాదకరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Funny: మంచి కిక్ ఇచ్చే మార్కెటింగ్ టెక్నిక్.. మందు బాబులను ఎలా పిలుస్తున్నాడో చూడండి..
Viral Groom video: సోదరా.. పెళ్లి వద్దు.. సిగ్నల్‌ను అర్థం చేసుకో.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..