Funny: మంచి కిక్ ఇచ్చే మార్కెటింగ్ టెక్నిక్.. మందు బాబులను ఎలా పిలుస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:15 PM
కొత్తగా ఆలోచించే వారు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. తమ బుర్రకు పదును పెట్టి కొత్త ఐడియాలతో ఇతరలను ఆశ్చర్యపరిచే వారికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు, ఫొటోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఆలోచించే వారు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. తమ బుర్రకు పదును పెట్టి కొత్త ఐడియాల (Idea)తో ఇతరలను ఆశ్చర్యపరిచే వారికి సంబంధించిన ఎన్నో వీడియోలు (Jugaad Videos) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
సాధారణంగా మద్యం బ్రాండ్ల గురించి, వైన్ షాప్ (Wine Shop)ల గురించి ప్రచారాలు చేయకూడదు. బిల్ బోర్డులు ఏర్పాటు చేయకూడదు. అలాంటి నిబంధన ఉండడంతో ఓ వ్యక్తి తన బుర్రకు పదును పెట్టి అద్భుతమైన ఐడియా వేశాడు. ఓ హైవే మీద పెద్ద బోర్డు ఏర్పాటు చేశాడు. దాని మీద ``మద్యపానం ఆరోగ్యానికి హానికరం`` అని రాశాడు. దాని కింద తన షాప్‌నకు వెళ్లే మార్గాన్ని సూచిస్తూ బాణం గుర్తు వేశాడు. అలా షాప్ గురించి వెరైటీగా ప్రచారం చేసుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఓ వ్యక్తి ఆ బోర్డును వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించి, వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందనలు తెలియజేశారు. ``ఇది నెక్ట్స్ లెవెల్ మార్కెటింగ్``, ``ఇతడు మార్కెటింగ్ జీనియస్``, ``వైన్ షాప్ గురించి అలా కూడా రాయాల్సిన అవసరం లేదు``, ``వావ్.. చాలా గొప్ప ఐడియా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Groom video: సోదరా.. పెళ్లి వద్దు.. సిగ్నల్‌ను అర్థం చేసుకో.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..