Share News

Chinese Woman Demands: పెళ్లి రద్దు చేసి.. అబ్బాయిని 'హగ్గింగ్ ఫీజు' డిమాండ్ చేసింది!

ABN , Publish Date - Oct 13 , 2025 | 01:57 PM

అమ్మాయి, అబ్బాయి ఇద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇక పెళ్లి తంతులో భాగంగా వరుడు, వధువు ఇద్దరూ వివాహ ఫోటోషూట్ కూడా చక్కగా చేసుకున్నారు. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంటకు నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి సమయం కొన్ని వారాలే ఉండగా.. కాబోయే వరుడికి ఆ యువతి షాక్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. తాను అతడికి పెళ్లి చేసుకొనని తేల్చి చెప్పింది.

Chinese Woman Demands: పెళ్లి రద్దు చేసి.. అబ్బాయిని 'హగ్గింగ్ ఫీజు' డిమాండ్ చేసింది!
Chinese Woman Demands

చైనా, అక్టోబర్ 13: పెళ్లి అనేది జీవితంలో ఒక మరచిపోలేని అనుభూతి. తమ భాగస్వామిని ఎంచుకొని జీవితాంతం వారితో లైఫ్ ను పంచుకోవడానికి ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని చూస్తారు. జీవితంలో ఒకేసారి జరిగే ఈ వేడుకను వైభవంగా జరుపుకునేందుకు ఎన్నో కళలు కంటుంటారు. ఈ వేడుకను ఘనంగా జరుపుకునేందుకు ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి ఫోటో షూటింగ్, ఇంకా పెళ్లి బట్టలు ఇలా అన్నింట్లో ఉత్సాహంతో ముందు చూపుతో బిజీ బిజీగా గడుపుతుంటారు. ఇలా ఘనంగా పెళ్లి చేసికున్న తర్వాత కొద్ది రోజులకే చిన్న చిన్న మనస్పర్థలు, ఈగో కారణంగా విడిపోతుంటారు. అలా తమ బంగారు భవిష్యత్తును భాగస్వామితో పంచుకునేందుకు బదులు మధ్యలోనే వారి మధ్య బంధాన్ని తెంచుకుంటుంటారు.


చైనాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇక పెళ్లి తంతులో భాగంగా వరుడు, వధువు ఇద్దరూ వివాహ ఫోటోషూట్ కూడా చక్కగా చేసుకున్నారు. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంటకు నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి సమయం కొన్ని వారాలే ఉండగా.. కాబోయే వరుడికి ఆ యువతి షాక్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. తాను అతడికి పెళ్లి చేసుకొనని తేల్చి చెప్పింది. దీంతో ఇరు కుటుంబాలు షాక్ అయ్యాయి. ఎలాగూ అమ్మాయి పెళ్లి చేసుకోను అని చెప్పింది కాబట్టి వారు కూడా పెళ్లి రద్దు చేసుకుందామని అనుకున్నారు.


ఇక ఎంగేజ్‌మెంట్ రోజున అమ్మాయికి ఇచ్చిన నిశ్చితార్థ బహుమతి 200,000 యువాన్లను (సుమారు US$28,000) తిరిగి ఇవ్వడానికి ఆ అమ్మాయి ఒప్పుకుంది. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్న వరుడు కుటుంబ సభ్యులకు ఆ యువతి అంతలోనే షాక్ ఇచ్చింది. వివాహ ఫోటోషూట్‌లో అబ్బాయి తనను కౌగిలించుకున్నాడని అందుకు తన కౌగిలింత ఫీజు (హగ్గింగ్ ఫీజుగా)గా 30,000 యువాన్లను తిరిగి ఇవ్వాలని కోరింది. అమ్మాయి వింత డిమాండ్ కు అబ్బాయి తరఫు వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హాగ్ చేసుకుంటే ఇంత డబ్బు తాను తిరిగి ఇవ్వాలా? అని వరుడు ప్రశ్నించాడు. తనకు అదంతా తెలియదని, తనని హాగ్ చేసుకున్నందుకు డబ్బు ఇచ్చి తీరాల్సిందేనని ఆ అమ్మాయి పట్టుబట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.


అయితే ఈ వివాదంపై వీరి వివాహాన్ని కుదుర్చిన మ్యాట్రిమోనీ మేకర్ వాన్ స్పందించారు. అక్కడి మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 'వరుడు చాలా హానెస్టీ పర్సన్. అతనికి ఆదాయం చాలా తక్కువగా ఉందని అమ్మాయి ఇలా చేసింది. అమ్మాయికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే తనను హాగ్ చేసుకున్నందుకు గాను 30,000 యువాన్ల ఫీజు అడుగుతోంది. గత పదేళ్లలో వెయ్యి జంటలను కలిపాను. వివాహ ఫోటోషూట్ సమయంలో ఫోటోగ్రాఫర్ అలా చేయమని చెప్పినందుకే ఆ వ్యక్తి యువతిని కౌగిలించుకున్నాడు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు' అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

Heavy Rains: ఇవాళ, రేపు భారీ వర్షాలు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన..

Konda Lakshma Reddy: మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

Updated Date - Oct 13 , 2025 | 02:01 PM