Cobra Funny video: ఫ్లూట్ శబ్దం విని పెట్టె నుంచి బయటకు వచ్చిన పాము.. తర్వాతేం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:26 PM
పాములను ఆడించే వ్యక్తులను మనం తరచుగా చూస్తుంటాం. ఆ వ్యక్తి ఫ్లూట్ తీసి వాయిస్తే ఆ శబ్దానికి అనుగుణంగా బాక్స్‌లోని పాము పడగ విప్పి నాట్యం చేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లు ఆ పాము విన్యాసాన్ని చూసి తమకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాగే పాముతో నాట్యం చేయిద్దామనుకున్నాడు.
పాములను (Snake) ఆడించే వ్యక్తులను మనం తరచుగా చూస్తుంటాం. ఆ వ్యక్తి (Snake charmer) ఫ్లూట్ తీసి వాయిస్తే ఆ శబ్దానికి అనుగుణంగా బాక్స్‌లోని పాము పడగ విప్పి నాట్యం చేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లు ఆ పాము విన్యాసాన్ని చూసి తమకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాగే పాముతో నాట్యం చేయిద్దామనుకున్నాడు. అయితే అనుకోకుండా ఆ పాము చేసిన పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Cobra Funny video).
@palsjat2024 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియో (Viral Video)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పాములను ఆడించుకునే వ్యక్తి ఫ్లూట్ వాయిస్తూ పాము ఉన్న పెట్టెను తెరిచాడు. ఆ పాము కాసేపు అక్కడే ఉండి వెంటనే వేగంగా పక్కకు వెళ్లిపోయింది. పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి ఆ పాములు పట్టే వ్యక్తి నుంచి తప్పించుకుపోయింది. ఆ పాములు పట్టే వ్యక్తి దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా చిక్కలేదు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. 8 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. పాము ఇలా తప్పించుకు పారిపోవడాన్ని తొలిసారి చూస్తున్నానని ఒకరు కామెంట్ చేశారు. ఆ పాము నాలుగు రోజుల నుంచి ఏమీ తిన్నట్టు లేదని మరొకరు పేర్కొన్నారు. ఆ కాలువలోని కప్పలకు, ఎలుకలకు కష్టాలు మొదలయ్యాయని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..