Santa Claus Story: క్రిస్మస్ స్పెషల్.. అసలెవరీ శాంతాక్లాజ్? అందరికీ గిఫ్ట్స్ ఎందుకిస్తాడు?
ABN , Publish Date - Dec 25 , 2025 | 07:53 AM
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కచ్చితంగా శాంతా క్లాజ్ ఉంటారు. అయితే, అసలెవరీ శాంతా క్లాజ్? అందరికీ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తాడు? ఆయన ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: క్రిస్మస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి క్రిస్మస్ ట్రీ, కేకులు, గిఫ్ట్స్… అంతేకాదు, ఎర్రటి దుస్తులు ధరించిన, తెల్లటి గడ్డం ఉన్న శాంతా క్లాజ్. కానీ అసలు శాంతా క్లాజ్ ఎవరు? ఆయన కథ ఏమిటి? అందరికీ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తాడు? అనేది చాలా మందికి తెలియదు. ఈ కథనంలో శాంతా క్లాజ్ అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శాంతా క్లాజ్ అసలు కథ
శాంతా క్లాజ్ కథ దాదాపు 1600 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆయన అసలు పేరు సెంట్ నికోలస్. టర్కీలోని మైరా అనే ప్రాంతంలో ఆయన ఒక క్రైస్తవ బిషప్‌గా జీవించారు. సెంట్ నికోలస్ ఎంతో దయగల వ్యక్తి. ముఖ్యంగా పేద పిల్లలకు, అవసరంలో ఉన్నవారికి రహస్యంగా సహాయం చేసేవారు.
గిఫ్ట్స్ ఇవ్వడం వెనుక కారణం..
సెంట్ నికోలస్ తన సంపదను పేదల కోసం ఉపయోగించేవారు. ఎవరికీ తెలియకుండా రాత్రివేళ ఇంటి బయట గిఫ్ట్స్ పెట్టి వెళ్లేవారు. ఈ మంచి అలవాటు క్రమంగా ఒక సంప్రదాయంగా మారింది. అందుకే శాంతా క్లాజ్ పిల్లలకు బహుమతులు ఇస్తాడనే నమ్మకం ఏర్పడింది.
శాంతాక్లాజ్ రూపం ఎలా మారింది?
కాలక్రమంలో సెంట్ నికోలస్ కథ యూరప్, అమెరికా దేశాల్లో విస్తరించింది. అక్కడి సంస్కృతులకు అనుగుణంగా ఆయన రూపం మారింది. ఎర్రటి దుస్తులు, పెద్ద సంచి, నవ్వుతూ ఉండే ముఖం.. ఇవన్నీ శాంతా క్లాజ్‌కు ప్రత్యేక గుర్తులుగా మారాయి.
శాంతాక్లాజ్ ప్రాముఖ్యత..
శాంతా క్లాజ్ కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. ఆయన దయ, ప్రేమ, సహాయం గుణం కలిగినవారు. పిల్లల్లో ఆనందం, మానవత్వం, సహాయ భావనను ప్రతిబింబిస్తాడు. క్రిస్మస్ సందర్భంగా శాంతా క్లాజ్ గుర్తు చేసేది ఒక్కటే.. మనం కూడా మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి అనే సందేశం. కాబట్టి, శాంతా క్లాజ్ ఒక కల్పిత పాత్రలా కనిపించినా, ఆయన వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పది. ప్రేమ, దయ, ఆనందాన్ని పంచే ప్రతీకగా శాంతా క్లాజ్ క్రిస్మస్ పండుగలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
ఇవీ చదవండి:
క్రిస్మస్ సందడి.. భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..