Chinese woman won lottery: షాపింగ్‌కు వెళ్లిన మహిళ.. వర్షం కురవడంతో కోటీశ్వరురాలైపోయింది..
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:17 PM
అదృష్టం కలిసిస్తే జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. కలలో కూడా ఊహించని అద్భుతాలు జరుగుతాయి. చైనాకు చెందిన ఓ మహిళకు తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది. హఠాత్తుగా కురిసిన వర్షం ఆమెను కోటీశ్వరురాలని చేసింది.
అదృష్టం (Luck) కలిసిస్తే జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. కలలో కూడా ఊహించని అద్భుతాలు జరుగుతాయి. చైనా (China)కు చెందిన ఓ మహిళకు తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది. హఠాత్తుగా కురిసిన వర్షం ఆమెను కోటీశ్వరురాలని చేసింది. నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళకు తాజాగా అద్భుతమైన అనుభవం ఎదురైంది.
యునాన్ ప్రావిన్స్‌లోని యుక్సీకి చెందిన ఓ మహిళ ఈ నెల 8వ తేదీన సరుకులు కొనడానికి షాపింగ్‌కు వెళ్లింది. అయితే అదే సమయంలో వర్షం (Rain) ప్రారంభమైంది. వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆ మహిళ ఓ షాప్‌లో తలదాచుకునేందుకు వెళ్లింది. అది ఓ లాటరీ షాప్. అక్కడ ఎక్కువ సేపు ఉండాల్సి రావడంతో టైమ్ పాస్ కోసం ఓ లాటరీ (Lottery) టికెట్ కొనుగోలు చేసింది. 30 టిక్కెట్లు ఉన్న ఒక మొత్తం బుక్‌లెట్‌ను రూ.12, 500కు కొనుగోలు చేసింది. ఆ బుక్‌లెట్‌లో ఆరో టికెట్‌ను స్క్రాచ్ చేయగానే ఆమెను అదృష్టం వరించింది. ఆ టికెట్ ద్వారా ఆమెకు పది లక్షల యువాన్లు బహుమతిగా గెలుచుకుంది.
పది లక్షల యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 1.4 కోట్ల రూపాయలు. ఊహించని విధంగా అంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకున్నందుకు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆనందంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..