China Jiangsu Temple Fire Accident: క్యాండిల్స్ వినియోగంలో అజాగ్రత్త.. దేవాలయంలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:58 AM
చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లో తాజాగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. టూరిస్టు బాధ్యతారాహిత్యం కారణంగా ఓ దేవాలయం మంటల్లో దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: పర్యాటకుడి బాధ్యతారాహిత్యం కారణంగా చైనాలోని ఓ దేవాలయం మంటల్లో దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జియాంగ్సూ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. క్యాండిల్స్, అగరబత్తీల విషయంలో ఓ టూరిస్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దేవాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది (China Jiangsu Temple Fire Accident).
మూడు అంతస్తుల్లో నిర్మించిన దేవాలయం అంతటా మంటలు వ్యాపించాయి. దేవాలయం రూఫ్‌లో కొంత భాగం కూలిపోయింది. అయితే, ఇక్కడ పవిత్ర ప్రతిమలు, పురాతన వస్తువులు ఏవీ లేవు. ఒకప్పటి చైనా సంస్కృతి ఉట్టిపడేలా ఫెంగ్‌హువాన్ కొండలపై 2009లో నిర్మించిన ఈ ఆలయాన్ని వీక్షేందుకు, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
టూరిస్టు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సాంస్కృతిక కట్టడంతో పాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతానికి కూడా ఈ ప్రమాదం వల్ల ముప్పు పెరిగిందని అన్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం, దేవాలయ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పెద్ద చర్చ మొదలైంది. టూరిస్టుల బాధ్యతారాహిత్యంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, 2023లో కూడా దాదాపు ఇలాంటి ప్రమాదం చైనాలో కలకలానికి దారితీసింది. గాన్సూ ప్రావిన్స్‌లోని శతాబ్దాల నాటి షాండాన్ దేవాలయం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. గుడి లోపల ఉన్న బుద్ధుడి విగ్రహం కూడా చాలా వరకూ దెబ్బతిన్నది.
ఇవీ చదవండి:
వామ్మో మహిళా మేనేజర్.. ఉద్యోగిని తన కేబిన్‌కు రమ్మని..
పెళ్లిలో వధువు మైమరిచిపోయి డ్యాన్స్.. మరుసటి రోజు ఆమె చేసిన పనికి.