car hits scooter: షాకింగ్ యాక్సిడెంట్.. ఇలాంటి డ్రైవింగ్ చేసిన వారిని ఏం చెయ్యాలి..
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:53 PM
రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎంతో మంది ప్రమాదాల బారిన పడతారు. మనం చేసే తప్పు వల్ల ఇతరులు కూడా మూల్యం చెల్లించాల్సి రావచ్చు. రోడ్డు భద్రత గురించి ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా కొందరు మాత్రం తీరు మార్చుకోవడం లేదు.
రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎంతో మంది ప్రమాదాల బారిన పడతారు. మనం చేసే తప్పు వల్ల ఇతరులు కూడా మూల్యం చెల్లించాల్సి రావచ్చు. రోడ్డు భద్రత గురించి ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా కొందరు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాక్సిడెంట్ వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే (scooter accident).
@pixelsabhi అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కారు చాలా వేగంగా వెళ్తోంది. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ముందుకు వెళ్తోంది. ఆ సమయంలో ఓ స్కూటర్ మీద వెళ్తున్న జంటను ఆ కారు డ్రైవర్ ఢీకొట్టాడు. కారు ఢీ కొన్న వెంటనే స్కూటర్ నడుపుతున్న యువకుడు, అమ్మాయి రోడ్డుపై పడిపోయారు. ఆ యువకుడు హెల్మెట్ ధరించి ఉండటంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ ఆ అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె చాలా సేపు రోడ్డు మీద నుంచి లేవలేకపోయింది (shocking video).
పక్కనే ఉన్నవారు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు (road accident). ఓ బైకర్ ఈ యాక్సిడెంట్ వీడియోను రికార్డ్ చేశాడు. ప్రమాదం జరిగిన తర్వాత కారును ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా కారు డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి