Share News

ఎడారిలో పూల ఏరులు

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:15 AM

ఎడారిలో పూల ఏరులేమిటని ఆశ్చర్యపోతున్నారా? అదే సూపర్‌ బ్లూమ్‌ మహిమ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎడారుల్లో మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఆకు రాలే కాలం లేదా శీతాకాలంలో నేల లోపలి విత్తనాలు మొలకెత్తి, చిగుర్చుతాయి.

ఎడారిలో పూల ఏరులు

కాలిఫోర్నియా రాష్ట్రంలోని ‘ఆంజా బొర్రెగో’ ఎడారి ప్రస్తుత రూపమిది. ఎడారిలో పూల ఏరులేమిటని ఆశ్చర్యపోతున్నారా? అదే సూపర్‌ బ్లూమ్‌ మహిమ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎడారుల్లో మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఆకు రాలే కాలం లేదా శీతాకాలంలో నేల లోపలి విత్తనాలు మొలకెత్తి, చిగుర్చుతాయి. ఎడారి పొద్దుతిరుగుడు పూలు, లిల్లీలు, ప్రైమ్‌రోజ్‌... తదితర పూలన్నీ ఈ సమయంలో పురివిప్పి నాట్యం చేస్తాయి.

ఈ వార్తను కూడా చదవండి: స్కూబా... దిల్‌రూబా...


book4.2.jpg

అందుకే ఎడారంతా ప్రాణం పోసుకున్నట్టుగా, అనేక రంగుల్లోకి మారుతుంది. అంజా బొర్రెగోతో పాటు కాలిఫోర్నియాలోని మరికొన్ని ఎడారుల్లో కూడా సూపర్‌బ్లూమ్‌ కనువిందు చేస్తుంది. ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ పూలతేరుల్ని ఏప్రిల్‌ చివరిదాకా చూడొచ్చు. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి ఆయా ఎడారుల్లో ఇలాంటి సూపర్‌బ్లూమ్‌లు ఆవిష్కృతమవుతాయి.


ఈ వార్తలు కూడా చదవండి

పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత

రైతులకు మహాప్రసాదం భూభారతి

చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త

వాట్ యాన్ ఐడియా సర్ జీ...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 20 , 2025 | 10:15 AM