Share News

Bengaluru Assault : మహిళ మీద పైశాచిక దాడి.. వైరల్ వీడియో

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:39 PM

బెంగళూరులో ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టి, రోడ్డుపైకి ఈడ్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అదే సమయంలో సోషల్ మీడియా పవరేంటో నిరూపితమైంది.

Bengaluru Assault : మహిళ మీద పైశాచిక దాడి.. వైరల్ వీడియో
Bengaluru Assault

బెంగళూరు, సెప్టెంబర్ 26 : బెంగళూరు అవెన్యూ రోడ్‌లోని సిటీ మార్కెట్ ప్రాంతంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టి, రోడ్డుపైకి తోసే ప్రయత్నం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

సదరు వీడియో ఫుటేజ్ ప్రకారం, ఓ వ్యక్తి తన జ్యువెలరీ షాప్ నుంచి మహిళను లాక్కొని రోడ్డుపైకి తీసుకొచ్చి, కోపంతో ఊగిపోతూ పదే పదే కాళ్లతో తన్ని, చేతులతో తీవ్రంగా కొట్టాడు. తనను కొట్టవద్దని బాధిత మహిళ ఎంత మొత్తుకున్నా షాపు యజమాని శాంతించలేదు. ఆమె ఒళ్లంతా కాళ్లతో తన్నుతూ మహిళ అని కూడా చూడకుండా అరచకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరుగుతుండగా, చుట్టూ చేరిన జనం సైతం ఈ దాడిని నిలువరించే ప్రయత్నం చేయలేకపోయారు.


అయితే, బాధిత మహిళ గురించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవెన్యూ రోడ్‌లో మాట్లాడేవారు లేరు, వినేవారు లేరంటూ విరుచుకుపడ్డారు. ఈ బాబూలాల్ మీద చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

దీంతో పోలీసులు తక్షణమే ఈ ఘటనపై స్పందించి చర్య తీసుకున్నారు. సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో Cr No. 196/2025 కింద, BNS సెక్షన్లు 74, 76, 79, 115(2), 133, 126(2), 351(2), 3(5) ప్రకారం FIR నమోదు చేశారు. ఘటనకు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఆ వైరల్ వీడియో ఇదే..


ఇవి కూడా చదవండి..

ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

Read latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 06:23 PM