Peak Bengaluru Moment: అర్ధరాత్రి ఆటోలో మహిళ ప్రయాణం.. నేనూ తండ్రినే అన్న వాక్యం చదివి..
ABN , Publish Date - Dec 12 , 2025 | 09:09 PM
అర్ధరాత్రి ఆటో జర్నీలో ఓ మహిళకు ఎదురైన అనుభవం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మహిళకు భరోసా కల్పించిన ఆ ఆటోడ్రైవర్‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మహిళలకు ఇప్పటికీ అర్ధరాత్రి ప్రయాణాలు ఇబ్బందికారకమే. అయినా ఉద్యోగ వ్యాపారాల రీత్యా రాత్రి ప్రయాణాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆటోవాలా చేసిన పనికి ఓ మహిళకు ప్రాణం లేచొచ్చినట్టైంది. తనకు ఎదురైన అనుభవాన్ని (Peak Bengaluru Moment) ఆమె నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Bengaluru Auto Driver).
అర్ధరాత్రి బెంగళూరులో ఆటోలో వెళుతుండగా తనకు ఈ వింత అనుభవం ఎదురైందని ఆమె పేర్కొంది. ‘అప్పటికి అర్ధరాత్రి 12 గంటలు అవుతోంది. ఆటోలో వెళుతున్నా. వెంటనే ఆటోలో రాసున్న ఈ వాక్యాలు కనిపించాయి. దీంతో నాలో భయం మాయమై భరోసా కలిగింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ‘నేను ఓ తండ్రిని, ఓ ఆడబిడ్డకు సోదరుడిని. మీ భద్రతకే నా తొలి ప్రాధాన్యం. కాబట్టి నిశ్చితంగా ప్రయాణించండి’ అన్న వాక్యాలున్న పేపర్ ఆటో లోపలివైపు కనిపించడంతో ఆమెకు ప్రాణం లేచొచ్చినంతపనైంది.
ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అనేక మంది ఆటోవాలాపై ప్రశంసలు కురిపించారు. మహిళల ఆందోళనను అర్థం చేసుకున్న వ్యక్తిగా అతడు తన అనుభవంతో ఇలాంటి కామెంట్ రాసిపెట్టుకుని ఉంటాడని కొందరు అన్నారు. బెంగళూరు రేంజ్ అంటే ఇదీ అని మరికొందరు ప్రశంసలు కురిపించారు. జనాల్లో ఇలాంటి సంస్కారం ఉంటే సమాజం చాలా త్వరగా అభివృద్ధి చెందుతుందని, ఎలాంటి భయాలు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ ఉదంతంపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..
ఈ మహిళ ఏ టూత్ పేస్టు వాడుతోందో గానీ.. వైరల్ వీడియో.. షాకింగ్ సీన్స్