Bandana Girl: 'బందనా గర్ల్' వీడియోకి మిలియన్ల వ్యూస్..సీక్రెట్ ఇదే!
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:32 PM
ప్రస్తుతం బందనా గర్ల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం 20 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ రావడానికి సీక్రెట్ ఏంటో టెక్ నిపుణులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో రెండు సెకన్ల మేకప్ క్లిప్‌తో ఓ యువతి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమెను ఇప్పుడు అందరూ 'బందనా గర్ల్'(Bandana Girl Viral Video) అని పిలుస్తున్నారు. నవంబర్ 2వ తేదీన 'bud wiser @w0rdgenerator' అనే పేరుతో ఉన్న ఓ ఎక్స్ ఖాత నుంచి రెండు సెకన్ల నిడివి ఉన్న వీడియో పోస్ట్ అయింది. ఆ వీడియోలో ఒక అమ్మాయి తెలుపు రంగు టాప్, వెండి చెవిపోగులు, బందనా (తలకు కట్టుకునే వస్త్రం) ధరించి కనిపిస్తోంది. ఆటోలో కూర్చుని ఈ వీడియో తీసినట్టుగా అర్థమవుతోంది. ఈ వీడియోకు 'Makeup ate today' అనే క్యాప్షన్‌తో జోడించింది. ఈ చిన్న వీడియోకు ఊహించని స్థాయిలో రీచ్ వచ్చింది. 20 రోజుల్లో ఈ వీడియోకి 100 మిలియన్ వ్యూస్ దాటాయి. ఇంకా భారీగా వ్యూస్ వస్తోన్నాయి. దీంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
'బందనా గర్ల్' వీడియో(Bandana Girl Viral Video)కు భారీగా వ్యూస్ రావడానికి గల కారణాన్ని టెక్నికల్ నిపుణులు వెల్లడించారు. ఆ వీడియో చాలా తక్కువ నిడివి ఉండటం ప్రధాన కారణమని అభిప్రాయ పడ్డారు. ఆ వీడియో కేవలం రెండు సెకన్లు మాత్రమే ఉండటంతో లైక్స్, షేర్స్, వ్యూస్ భారీగా వచ్చాయని తెలిపారు. అలానే ఈ వీడియో నిడివి తక్కువగా ఉంటడంతో చాలా మంది తమ ఎక్స్ అకౌంట్లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో సైతం రీపోస్టు చేసినట్లు, మిలియన్ల వ్యూస్ రావడానికి ఇది ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎక్స్ అల్గారిథమ్ 100 శాతం సక్సెస్ రేట్ ఉన్న వీడియోలను మరింత ప్రమోట్ చేస్తాయని తెలిపారు. తద్వారా ఈ వీడియో వచ్చే వ్యూస్ సంఖ్య విపరీతంగా పెరిగిందని అంటున్నారు.
ఈ వీడియోపై బందనా గర్ల్ మీడియాతో మాట్లాడినట్లు సమాచారం. ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తుండగా ఆటోలో లైటింగ్ బాగుందని భావించి, సరదాగా ఆ వీడియో తీశానని తెలిపింది. తొలుత ఆ వీడియో వెయ్యి వ్యూస్ వస్తే బాగుంటుందని భావించానని తెలిపింది. కానీ ఇంతలా వైరల్ అవుతుందని ఊహించలేదని తెలిపింది. ఈ పాపులారిటీతో సోషల్‌మీడియాలో ఓవర్ నైట్ లో సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ఈ యువతికి బ్లూ టిక్ హోదాని ఎక్స్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తోన్నాయి.
ఇవీ చదవండి:
కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ