Share News

Baba Vanga predictions: బంగారంపై బాబా వంగా జోస్యం.. నిజమేనా?

ABN , Publish Date - Dec 03 , 2025 | 09:36 AM

కొత్త ఏడాది 2026లో ఇలా జరగనుందని బాబా వంగా జోస్యం చెప్పారంటూ ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో పలు వార్త కథనాలు వైరల్‌ అవుతున్నాయి.

Baba Vanga predictions: బంగారంపై బాబా వంగా జోస్యం.. నిజమేనా?

కొత్త సంవత్సరం 2026.. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దాంతో నూతన సంవత్సరంలోకి అంతా అడుగు పెడుతున్నాం. గతేడాది కంటే ఈ ఏడాది మరింత బావుండాలని అంతా భావిస్తారు. అయితే కొత్త ఏడాది 2026లో ఇలా జరగనుందంటూ బాబా వంగా జోస్యం చెప్పారంటూ ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో వార్త కథనాలు వైరల్‌ అవుతున్నాయి.

2026 నాటికి బంగారం ధరలు భారీగా పెరుగుతయాని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత అస్థిరంగా ఉంటుందని ఆమె జోస్యం చెప్పింది. అంతేకాదు.. ఆ ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆమె జోస్యం వైరల్‌‌గా మారింది.


బ్యాంకిగ్ రంగంలో అస్థిరత, రూపాయి విలువ తగ్గుదల, మార్కెట్‌లో ద్రవ్యం తగ్గడం వంటి సంఘటనలను సూచిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడి కోసం ప్రజలు.. బంగారం, వెండి వంటి వాటి వైపు మొగ్గు చూపుతారు. డిమాండ్ పెరుగుదల కారణంగా.. 2026 నాటికి బంగారం ధరలు 25 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షలుగా ఉంది. ఇక 2026లో ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని బాబా వంగా హెచ్చరించారు. ఇది ప్రపంచ స్థాయిలో భారీ మార్పులకు దారితీయవచ్చని పేర్కొన్నారు.


మరోవైపు గ్రహాంతరవాసులతో ప్రత్యక్ష సంబంధాలు సాధ్యమవుతాయని తొలిసారి బాబా వంగా అంచనా వేసిన విషయం విదితమే. ఇది ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. 2026లో ఏఐ టెక్నాలజీ మరింత వృద్ధిని సూచిస్తుందని.. ఇది మానవ జీవితానికి అతి పెద్ద సవాలుగా మారవచ్చని కూడా బాబా వంగా హెచ్చరించారు. ఇది మానవ జీవితంలోకి లోతుగా చొచ్చుకుపోతుందన్నారు.


ఇక అణుశక్తి సమస్యల మధ్య, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు గ్రీన్ ఎనర్జీ, ఫ్యూజన్ రియాక్టర్ల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. భవిషత్తులో మానవ అవసరాలను తీర్చడంలో ఈ కొత్త ఇంధన వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయని బాబా వంగా ఒక అంచనా వేశారు.


ఇంతకీ 2026లో ఏమి జరగనుందోనంటూ బాబా వంగా అంచనాలపై సర్వత్రా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది నిజమవుతుందా? లేక కేవలం ఊహాగానమా అనేది కాలం చెప్పాల్సి ఉంది.


ఎన్నో ఏళ్ల క్రితం బాబా వంగా చెప్పిన పలు జోస్యాలు ఫలించాయంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె చెప్పి మరో జోస్యం నిజమైందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం పుత్తడి ధర ఆకాశాన్ని తాకింది. కాసు బంగారం ధర రూ. లక్షన్నరకు చేరింది. 2026లో ఈ ధర మరింత పెరిగినా ఏ మాత్రం ఆశ్చర్య పోనక్కర్లేదని ఒక చర్చ సైతం సాగుతోంది. బాబా వంగా చెప్పిన జోస్యం ఇప్పటికే నిజమైందని పేర్కొంటున్నారు.


ఇంతకీ ఎవరీ బాబా వంగా..

బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. 1911లో బల్గేరియాలో ఆమె జన్మించింది. ఆమె వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు కూడ. భారీ తుపాను కారణంగా అతి చిన్న వయస్సులోనే కంటిచూపుని కోల్పోయారు. ఈ సంఘటన తర్వాతే బాబా వంగాకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని చెబుతారు.

1996లో ఆమె మరణించింది. ఆమె మరణానికి ముందు బాబా వంగా బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబయి ఉగ్రవాద దాడుల, చైనా ఎదుగుదల, రష్యా-ఉక్రెయిన్ వివాదం ఇలా ఎన్నో విషయాల గురించి బాబా వంగా చెప్పిన జోస్యం ఫలిచింది.'నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్'గా ఆమె పేరు పొందారు.


ఇవి కూడా చదవండి..

థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..
మీ స్కిల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో చేప, ఓ వృద్ధుడు ఉన్నారు.. ఎక్కడో కనిపెట్టండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 03 , 2025 | 10:04 AM