Chanakya niti : ఇలాంటి స్నేహితులను ఎప్పటికీ నమ్మకండి.. కచ్చితంగా మోసపోతారు..
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:01 PM
Chanakya niti : ఆచార్య చాణక్యుడుకి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రంలోనే కాదు. సమాజంలోని ప్రతి అంశంపైనా చాణక్యనీతి ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆయన చెప్పినట్టుగా ఈ లక్షణాలున్న వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీరితో స్నేహం చేస్తే మీరు ఎప్పటికీ జీవితంలో ఏదీ సాధించలేరు.
Chanakya niti : అత్యంత జ్ఞానవంతుడు, పండితుడైన ఆచార్య చాణక్యుడు తన జీవితకాలంలో మానవజాతి సంక్షేమం కోసం అనేక విధానాలను రూపొందించాడు. ఈ విధానాలే తరువాత చాణక్య నీతిగా ప్రసిద్ధి చెందాయి. చాణక్య నీతి ప్రకారం ఎవరైనా విజయవంతమైన సంపన్నమైన జీవితాన్ని కోరుకుంటున్నట్లయితే.. ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీరు జీవితంలో ఎప్పుడూ స్నేహం చేయకూడని కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకోండి. ఎందుకంటే, మీరు గనక ఈ వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితంలో తప్పక సమస్యల్లో చిక్కుకుంటారు. ఇలాంటి వారితో స్నేహం చేయడం కంటే ఒంటరిగా గడపడం మేలంటాడు చాణక్యుడు.
అందరితో స్నేహం చేసే వ్యక్తులు..
చాణక్య నీతి ప్రకారం, అందరితో ఫ్రెండ్‌షిప్ చేసేవారితో మీరెప్పుడూ స్నేహం చేయకూడదు. ఇలాంటి వ్యక్తులు నిజంగా ఎవరికీ స్నేహితులు కారు. మీరు అలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం మానుకోవాలి. అలాంటి వారిని నమ్మడం అవివేకం. ఇలాంటి వారికి తప్పకుండా ఒక చెత్త అలవాటు ఉంటుంది. మీ మాటలను వక్రీకరించి మిమ్మల్ని కచ్చితంగా ఏదొకచోట ఇరికిస్తారు. వీరికి స్నేహితులుగా నటించడం ఎలాగో తెలుసు. మీ వెనుక చెడుగా ఇతరులతో మాట్లాడటానికి అస్సలు వెనుకాడరు.
మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు..
మీ విజయాన్ని చూసి అసూయపడే వారితో మీరు ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ తమను తాము ఇతరులతో పోల్చుకుంటారు. వీరికి ఒక రకమైన ఆత్మన్యూనతా భావం ఉంటుంది. అందుకే మీ పురోగతిని చూసి ఓర్వలేరు. మీరు జీవితంలో ఎప్పుడూ విఫలమవ్వాలని కోరుకుంటారు. అందుకోసం ఏ పనైనా చేస్తారు.
సంకుచిత మనస్తత్వం ఉన్నవారు..
సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులతో సన్నిహతంగా ఉంటే మీ మనస్తత్వం కూడా అలాగే మారుతుంది. వారి ముద్ర క్రమంగా మిమ్మల్ని కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తే.. మీరు కూడా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం, ఆలోచించడం మొదలుపెడతారు.
ఎక్కువగా మాట్లాడే వ్యక్తులు..
ఎక్కువగా మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తులు ఎప్పుడూ నమ్మదగినవారు కారు. మీరు వారితో స్నేహం చేసినా అది ఎక్కువ కాలం నిలవదు. ఒకవేళ కొనసాగించగలిగినా.. భవిష్యత్తులో వారివల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మిమ్మల్ని కాపాడలేరు.
Read Also : Business Idea : చేతిలో రూ.10000 ఉంటే చాలు.. ఈ 5 వ్యాపారాల్లో నెలకు రూ.30వేలు గ్యారెంటీ..
Bomb Threat: పాక్ ఫోన్ నెంబర్ నుంచి సీఎంకు బెదిరింపులు
Bitcoin Fluctuations: 84 వేల డాలర్ల వద్ద తచ్చాడుతున్న బిట్‌కాయిన్.. వారాంతంపైనే అందరి దృష్టి!