Share News

Anand Mahindra-Arattai: అరట్టై యాప్‌వైపు మొగ్గు చూపిన ఆనంద్ మహీంద్రా.. ధన్యవాదాలు తెలిపిన జోహో ఫౌండర్

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:58 PM

స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టైను డౌన్‌లోడ్ చేసుకున్నట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఇది తనకు గర్వకారణమని అన్నారు. తమను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారంటూ ఆనంద్ మహీంద్రాకు జోహో ఫౌండర్ ధన్యవాదాలు తెలిపారు.

Anand Mahindra-Arattai: అరట్టై యాప్‌వైపు మొగ్గు చూపిన ఆనంద్ మహీంద్రా.. ధన్యవాదాలు తెలిపిన జోహో ఫౌండర్
Anand Mahindra Arattai

ఇంటర్నెట్ డెస్క్: స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టైకి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఈ యాప్‌ వైపు మొగ్గు చూపారు. యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నట్టు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. అరట్టై యాప్‌ను జోహో అనే సంస్థ రూపొందించిన విషయం తెలిసిందే.

ఆనంద్ మహీంద్రా పోస్టుపై జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మహీంద్రా మద్దతు తనకు ఎంతో విలువైనదని అన్నారు. ‘మా తేన్‌కాశీ కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో మీటింగ్‌లో ఉండగా టీమ్ సభ్యుడు ఒకరు నాకు ఈ ట్వీట్ చూపించారు. ఆనంద్ మహీంద్రా మద్దతు మాలో పట్టుదలను మరింత పెంచింది’ అని పోస్టు పెట్టారు. ఇందుకు ప్రతిగా ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ మీకు అండగా ఉంటామని వ్యాఖ్యానించారు (Anand Mahindra Arattai App).


ఈ సంవాదంపై నెట్టింట కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం సంతోషం కలిగిస్తోందని ఒకరు కామెంట్ చేశారు.

అంతకుముందు, పర్‌ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ కూడా జోహో కార్పొరేషన్‌ను అభినందించారు. దేశీ యాప్‌కు దక్కుతున్న ఆదరణ గొప్పదని అన్నారు.

సెప్టెంబర్ చివరి వరకూ అరట్టై యాప్‌‌లో రోజువారి సైనప్‌లు కేవలం 3 వేలుగా ఉండేవి. ఆ తరువాత మూడు రోజుల్లోనే ఈ సంఖ్య 3.5 లక్షలకు చేరింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అరట్టై యాప్‌‌ వాట్సాప్‌కు మేటి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న విషయం తెలిసిందే.

అరట్టైతో పాటు జోహో కార్పొరేషన్ ఇతర సాఫ్ట్‌వేర్‌లను కూడా అందిస్తోంది. వ్యాపార అవసరాల కోసం ప్రత్యేక జోహో వన్ ఆపరేటింగ్ సిస్టమ్, సేల్స్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ కోసం సీఆర్ఎమ్ సూట్, అకౌంట్స్ నిర్వహణ కోసం ఫైనాన్స్ సూట్, మార్కెటింగ్ సూట్, వర్క్ ప్లేస్ సూట్ వంటి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అందిస్తోంది.


ఇవీ చదవండి:

కట్నం వద్దన్నందుకు పెళ్లి రద్దు.. యువకుడికి ఊహించని షాక్

లాటరీల జోలికెళ్లన వ్యక్తికి సడెన్‌గా బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.17 కోట్లు

Read Latest and Viral News

Updated Date - Oct 05 , 2025 | 04:08 PM