IT Layoffs: భారతీయ ఉద్యోగులను భారీ స్థాయిలో తొలగించిన అమెరికన్ కంపెనీ
ABN , Publish Date - Oct 03 , 2025 | 08:38 PM
భారతీయుల భారీ సంఖ్యలో తొలగించిన ఓ అమెరికన్ కంపెనీ ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ లేఆఫ్స్ పర్వంలో బాధితుడిగా మిగిలిన ఓ వ్యక్తి ఈ పోస్టును నెట్టింట పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ కంపెనీ అకస్మాత్తుగా ఉద్యో్గులను తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ ఓ భారతీయ వ్యక్తి రెడిట్‌లో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నిర్దయగా తమను తొలగించారంటూ సదరు నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తను అమెరికాకు చెందిన ఓ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలిపాడు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్టు వివరించాడు. అక్టోబర్ రోజున కంపెనీ సీఓఓ సడెన్‌గా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తమను తొలగించాలని అన్నారు. సీఓఓ ఉదయం 11.01 గంటలకు కాల్‌లో జాయిన్ అయ్యారని తెలిపారు. ఆ సమయంలో ఉద్యోగుల కెమెరాలు, మైక్రోఫోన్‌ను నిర్వీర్యం చేశారని తెలిపారు. కంపెనీలోని అధికశాతం మంది భారతీయులను తొలగిస్తున్నట్టు ఆయన తెలిపారని అన్నార. ఇది పనితీరు ఆధారిత తొలగింపులు కావని సీఓఓ చెప్పారని అన్నారు. అయితే, ఉద్యోగులకు ప్రశ్నలు అడిగేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని అన్నారు. కేవలం మూడు నిమషాల్లో కాల్ ముగిసిందని చెప్పారు. అమానవీయంగా తమను తొలగించాలని అన్నారు. సడెన్‌గా తొలగించినందుకు ఒక నెల శాలరీ, వాడుకోని సెలవులకు ప్రతిగా నగదు ఇస్తామని సీఓఓ చెప్పినట్టు తెలిపారు. అయితే, ఈ కంపెనీ ఏదనేది మాత్రం ఆ టెకీ వెల్లడించలేదు.
‘మొదటిసారి ఇలా నేను లేఆఫ్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. జాలీ దయ లేకుండా అత్యంత కర్కశంగా తొలగించారు. లేఆఫ్‌కు ముందస్తుగా సిద్ధమయ్యే అవకాశం కూడా లేకపోయింది’ అని అన్నారు. ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే, ఈ విషయంపై పెద్దగా ఆలోచించవద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదోక సమయంలో ఉద్యోగం కోల్పోయే ఉంటారని అన్నారు. ధైర్యంగా ముందడుగు వేస్తే కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ట్రంప్ సుంకాలు, వీసా ఆంక్షల నడుమ టెక్ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఉదంతంపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి:
కట్నం వద్దన్నందుకు పెళ్లి రద్దు.. యువకుడికి ఊహించని షాక్
చరిత్ర తెలియక తొందరపడ్డ మస్క్.. ఫైరైపోతున్న భారతీయులు