Share News

Viral Video: మీరెన్నో కష్టాలు పడుతున్నారని ఫీలైపోతున్నారా? ఈ వీడియో చూస్తే కష్టాలంటే ఎంటో తెలుస్తుంది..

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:55 PM

జీవితం అనేది చాలా మందికి ఎన్నో పరీక్షలు పెడుతుంది. ధైర్యాన్ని టెస్ట్ చేస్తుంది. చాలా మంది తాము ఎన్నో కష్టాలు పడుతున్నామని బాధపడిపోతూ ఉంటారు. మరికొందరు ఎంత కష్టం ఎదురైనా కుంగిపోకుండా ఎదురీదుతారు.

Viral Video: మీరెన్నో కష్టాలు పడుతున్నారని ఫీలైపోతున్నారా? ఈ వీడియో చూస్తే కష్టాలంటే ఎంటో తెలుస్తుంది..
Viral video

జీవితం అనేది చాలా మందికి ఎన్నో పరీక్షలు పెడుతుంది. ధైర్యాన్ని టెస్ట్ చేస్తుంది. చాలా మంది తాము ఎన్నో కష్టాలు పడుతున్నామని బాధపడిపోతూ ఉంటారు. మరికొందరు ఎంత కష్టం ఎదురైనా కుంగిపోకుండా ఎదురీదుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నిజమైన కష్టాలు (Problems) ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఆ వీడియోను చూసిన జనాలు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. naughtyworld అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది.


వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో ఓ వ్యక్తి నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర కూలి పని చేస్తున్నాడు. కాంక్రిట్ మిక్చర్‌ను బకెట్‌లోకి తీసుకుని వేరే చోటుకు తీసుకెళ్తున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఒక్క చేయి మాత్రమే ఉంది. ఆ ఒక్క చేతితోనే అతడు అంత బరువున్న బకెట్‌ను మోసుకెళ్తున్నాడు. విరిగిపోయిన సగం చేతితో ఆ బకెట్‌ను పైకి ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. ఈ యువకుడు ఎంతో మందికి ఆదర్శం అని పేర్కొంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను 7 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 70 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఎమోషనల్‌గా స్పందించారు. ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ధైర్యంగా ముందుకెళ్తే ఏ అడ్డంకి అయినా మనల్ని ఆపలేదని ఒకరు కామెంట్ చేశారు. నిజమైన బలం శరీరంలో కాదు, మనస్సులో ఉందని ఈ యువకుడు నిరూపించాడని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..

వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 19 , 2025 | 04:58 PM