Thief Viral Video: దొంగోడే కానీ, మహా భక్తుడు.. షాప్‌లో చోరీ చేసేందుకు వచ్చి ఆ దొంగ ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:54 AM
తాజాగా ఓ దొంగకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ దొంగ తీరు చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఆ వీడియోలోని దొంగ చాలా మంది మనసులను దోచుకున్నాడు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ చేష్టలు ఆ షాప్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ దొంగ తీరు చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఆ వీడియోలోని దొంగ (Thief) చాలా మంది మనసులను దోచుకున్నాడు. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ దొంగ రాత్రి సమయంలో ఓ షాప్ షట్టర్ తెరిచి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అడ్డుగా ఉన్న టేబుల్‌ను కాలితో తన్నాడు. దాంతో ఆ టేబుల్‌పై ఉన్న దేవుడి ఫొటో పై నుంచి కింద పడిపోయింది. ఆ దొంగ కాళ్ల దగ్గరే పడింది. అతను వెంటనే వెనక్కి వెళ్లి తలను లోపలికి పెట్టి వచ్చాడు. వెంటనే ఆ దేవుడి ఫొటోను పైకి లేపి కళ్లకు అందుకుని, దండం పెట్టుకున్నాడు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ చేష్టలు ఆ షాప్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 58 వేల మంది వీక్షించారు. 12 వందల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``దొంగకు కూడా విలువలు ఉంటాయి``, ``అతను చాలా సంస్కారవంతుడైన దొంగ``, ``ఏదో ఇబ్బంది కారణంగా దొంగతనం చేయాల్సి వచ్చినట్టుంది``, ``దొంగ కూడా ఒక మనిషే`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: పాపం.. ఆ అమ్మాయి ఏం చేసింది? ట్రైన్ ఆగినపుడు ఏం చేశాడో చూడండి..
Couple Viral Video: అయ్యో.. నడిరోడ్డు మీద ఏంటీ పని? జంట చేష్టలు చూసి అవాక్కవుతున్న జనం..
Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి