Viral Video: వామ్మో.. భయం అంటే మీనింగే తెలియని బ్లడ్ అది.. ఎంత ప్రమాదకరంగా పని చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jun 26 , 2025 | 09:33 PM
కూటి కోసం కోటి విద్యలు అంటారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి కొందరు వ్యక్తులు ఎంతో కష్టపడతారు. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు. మరికొందరు ఉద్యోగం కోసం తమ ప్రాణాలనే పణంగా పెడతారు. ప్రాణాపాయ స్థితిలోనే పని చేస్తారు. అలాంటి వారిని ఎంతో మందిని చూస్తుంటాం.
కూటి కోసం కోటి విద్యలు అంటారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి కొందరు వ్యక్తులు ఎంతో కష్టపడతారు. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు. మరికొందరు ఉద్యోగం కోసం తమ ప్రాణాలనే పణంగా పెడతారు (Risk). ప్రాణాపాయ స్థితిలోనే పని చేస్తారు. అలాంటి వారిని ఎంతో మందిని చూస్తుంటాం. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వ్యక్తి అతి ఎత్తైన బిల్డింగ్ (high building) మధ్యలో నిల్చుని పని చేస్తున్నాడు (Viral Video).
@RealTofanOjha అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చోట ఎత్తైన బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. ఓ కార్మికుడు నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్ బయట ఇనుప రాడ్‌లపై నిల్చుని పని చేస్తున్నాడు. అతడు సేఫ్టీ కోసం ఏమి జాగ్రత్తలు తీసుకున్నాడనేది మాత్రం ఆ వీడియోలో కనబడడం లేదు. అయితే అతడు బిల్డింగ్‌పై నిల్చున్న ఎత్తు చూస్తేనే కళ్లు తిరిగేలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అతడు ధైర్యంగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా కొద్ది సమయంలోనే 41 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అతడు యమధర్మరాజుకు చుట్టం అయి ఉంటాడు అని ఒకరు కామెంట్ చేశారు. అతడికి భయం అనే ఫీలింగ్ లేదనుకుంటా అంటూ మరొకరు పేర్కొన్నారు. 'అతడు ప్రమాదంలో లేడు.. అతడే ఒక ప్రమాదం' అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆహా.. ఇలాంటి పేదరికం అందరికీ కావాలి.. ఈ గుడిసెను చూస్తే నివ్వెరపోవాల్సిందే..
వామ్మో.. నూడిల్స్ తింటే ఇంత ప్రమాదమా.. నూడిల్స్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉందంటే..
వామ్మో.. ఈ కుర్రాడు నిజంగా మనిషేనా.. వేడి వేడి నూనెలో చేతులు పెట్టి ఏం చేస్తున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..