Viral Video: వామ్మో.. ఈ కుర్రాడు నిజంగా మనిషేనా.. వేడి వేడి నూనెలో చేతులు పెట్టి ఏం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:56 PM
వేడి వేడి నూనె చేతుల మీద పడితే ఆ నొప్పిని తట్టుకోవడం కష్టం. వెంటనే హాస్పిటల్‌కు పరిగెత్తి చికిత్స చేయించుకోవాల్సిందే. నరకంలో వేడి వేడి నూనెలో వేయించే శిక్ష గురించి చెప్పి భయపెడుతుంటారు. అంటే వేడి నూనెలో చేయి పెట్టడం ఎంత ప్రమాదకరమో ఊహించుకోవచ్చు.

వేడి వేడి నూనె (Hot Oil) చేతుల మీద పడితే ఆ నొప్పిని తట్టుకోవడం కష్టం. వెంటనే హాస్పిటల్‌కు పరిగెత్తి చికిత్స చేయించుకోవాల్సిందే. నరకంలో వేడి వేడి నూనెలో వేయించే శిక్ష గురించి చెప్పి భయపెడుతుంటారు. అంటే వేడి నూనెలో చేయి పెట్టడం ఎంత ప్రమాదకరమో ఊహించుకోవచ్చు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడిని చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఆ కుర్రాడు వేడి వేడి నూనెలో చేయి పెట్టి కలిపేస్తున్నాడు. ఆ వీడియో (Viral Video) సోషల్ మీడియా జనాలకు షాక్ కలిగిస్తోంది.
@aas_sthaa అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన ఉన్న ఓ స్టాల్‌లో పకోడీలు, చిప్స్ వేయిస్తున్నారు. నూనె చాలా చాలా వేడిగా ఉంది. అయితే అక్కడే ఉన్న కుర్రాడు ఎలాంటి పరికరం లేకుండా నేరుగా ఆ వేడి నూనెలో చేయి పెట్టి ఆ చిప్స్‌ను పైకి తీశాడు. ఆ తర్వాత ఆ వేడి నూనెను ఒట్టి చేతులతోనే కలిపేశాడు. ఆ కుర్రాడి తీరును ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5.5 లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వామ్మో.. ఇది ఎలా సాధ్యం అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించారు. ఇలాంటి వారికి యమదూతలుగా ప్రమోషన్ ఇవ్వాలని మరొకరు కామెంట్ చేశారు. ఇది నిజమైనా వీడియోనేనా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారా అని చాలా మంది ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
ఆహా.. ఇలాంటి పేదరికం అందరికీ కావాలి.. ఈ గుడిసెను చూస్తే నివ్వెరపోవాల్సిందే..
వామ్మో.. నూడిల్స్ తింటే ఇంత ప్రమాదమా.. నూడిల్స్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..