Elephant Video: ఆకలి వేస్తున్నా ఆ ఏనుగు ఎలా ప్రవర్తించిందో చూడండి.. క్యూట్ వీడియో వైరల్..
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:43 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు (Wild Animals) సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ బుల్లి ఏనుగు (Baby Elephant) ప్రవర్తించిన తీరుకు అందరూ ముగ్ధులవుతున్నారు (Elephant Video).
ఆ వీడియోను IFS అధికారి సుశాంత నంద తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video) ప్రకారం.. కొన్ని ఏనుగులు రోడ్డుమీద వెళ్తున్నాయి. ఒక భారీ ఏనుగు మీద మావటి కూర్చుని ఉన్నాడు. ఆ భారీ ఏనుగు వెనుక మిగతా ఏనుగులు నడుస్తున్నాయి. ఆ ఏనుగుల గుంపులో ఉన్న ఓ బుల్లి ఏనుగుకి రోడ్డు పక్కన చెరుకు బండి కనిపించింది. చెరుకు గడల కోసం బండి దగ్గరకు ఆ ఏనుగు వెళ్లింది. తనకు కావాల్సిన చెరుకు ముక్కను తీసేసుకోకుండా బండి ముందు నిలబడి అడిగింది. బండి దగ్గర ఉన్న మహిళ చెరుకు ముక్కను ఇచ్చే వరకు ఓపికగా ఎదురు చూసింది.
ఆ మహిళ చెరుకు ముక్క ఇవ్వగానే దానిని పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఆ ఘటనను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 61 వేల మందికి పైగా వీక్షించారు. 2.5 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ ఏనుగు ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించిందో అంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఏనుగులు పట్టణ వాతావరణంలో అలా తిరగాల్సి రావడం నిజంగా విషాదకరం అంటూ కొందరు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆహా.. ఇలాంటి పేదరికం అందరికీ కావాలి.. ఈ గుడిసెను చూస్తే నివ్వెరపోవాల్సిందే..
వామ్మో.. నూడిల్స్ తింటే ఇంత ప్రమాదమా.. నూడిల్స్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..