Unusual love story: ఆమెకు 18.. అతడికి 55.. వీరి విచిత్రమైన ప్రేమకథ గురించి తెలిస్తే..
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:23 PM
ప్రేమకు ధనిక, బీద తేడా ఉండదు. కుల, మత తారతమ్యాలు ఉండవు అంటారు. అయితే ప్రేమ వయసు బేధాలు కూడా పట్టించుకోదని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియోలోని ప్రేమ జంటను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రేమకు ధనిక, బీద తేడా ఉండదు. కుల, మత తారతమ్యాలు ఉండవు అంటారు. అయితే ప్రేమ వయసు బేధాలు కూడా పట్టించుకోదని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియోలోని ప్రేమ జంటను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆ యువతి వయసు 18 సంవత్సరాలు కాగా, ఆమె ప్రియుడి వయసు 55 సంవత్సరాలు (sister-in-law and brother-in-law love).
తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని ఆమె ప్రేమించింది. అందుకోసం ఆమె స్వంత అక్కను కూడా మోసం చేయడం గమనార్హం. వైరల్ అవుతున్న ఆ వీడియోలో గులాబీ రంగు చీర కట్టుకున్న యువతి నిలబడి ఉంది. ఆమె పక్కనే తెల్ల గడ్డం, జుట్టుతో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వీడియోలో ఆమె తన ప్రేమకథ గురించి చెబుతోంది. అక్క అనారోగ్యానికి గురి కావడంతో బావకు వంట చేయడం కోసం ఆమె ఆ ఇంటికి వెళ్లింది. చాలా రోజులు అక్కడే ఉండిపోయింది. ఆ సమయంలో బావతో ఆమె ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు (real love story).
ఈ విచిత్రమైన ప్రేమకథకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (family love story). దాదాపు 4 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 25 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ ప్రేమకథ విన్న నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మీ అక్క ఆరోగ్యం మెరుగుపడిందా అని ఒకరు ప్రశ్నించారు. అక్క శాశ్వతంగా అనారోగ్యానికి గురై ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
జిమ్‌లో హెవీ వెయిట్ లిఫ్టింగ్.. కంటి చూపు కోల్పోయిన యువకుడు..
అబ్బాయికి క్యాన్సర్.. అమ్మాయికి కిడ్నీ వైఫల్యం.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..