Share News

Breaking News: చిత్ర పరిశ్రమలో రాజకీయాలు సైలెంట్‌గా ఉంటాయి: బన్నీ వాసు

ABN , First Publish Date - May 24 , 2025 | 08:33 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: చిత్ర పరిశ్రమలో రాజకీయాలు సైలెంట్‌గా ఉంటాయి: బన్నీ వాసు
Breaking News

Live News & Update

  • May 24, 2025 21:41 IST

    చిత్ర పరిశ్రమలో రాజకీయాలు సైలెంట్‌గా ఉంటాయి: బన్నీ వాసు

    • రాజకీయాల్లో సినీ ఇండస్ట్రీ నలిగిపోతుందనే విషయం.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ గ్రహించాలి.

    • సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన.. పవన్‌ కల్యాణ్‌నే మనం ఇరిటేట్ చేశామంటే మన ఐక్యత.. ఎలా ఉందనేది ప్రశ్నించుకోవాలి.

  • May 24, 2025 19:38 IST

    నీతి ఆయోగ్‌ భేటీలో ప్రధానిని ప్రత్యేకంగా కలిసిన తెలంగాణ సీఎం రేవంత్‌

    • హైదరాబాద్‌ మెట్రోకు త్వరగా రెండో దశ అనుమతులు కోరిన రేవంత్‌.

    • పట్టణాభివృద్ధిశాఖకు ఆదేశాలు ఇవ్వాలని మోదీని కోరిన సీఎం రేవంత్‌.

    • RRR ఉత్తరభాగానికి ఆర్థిక, కేబినెట్‌ అనుమతులు కోరిన సీఎం రేవంత్‌.

    • RRR దక్షిణ భాగానికి కూడా ఒకేసారి అనుమతులు కోరిన సీఎం రేవంత్‌.

    • RRR దక్షిణ భాగం భూసేకరణకు 50 శాతం ఖర్చు భరిస్తామన్న రేవంత్‌.

    • RRRకు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే లైన్‌కు సహకరించాలన్న రేవంత్‌.

    • హైదరాబాద్‌ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్‌.

    • డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించాలన్న సీఎం రేవంత్‌.

    • తెలంగాణలో సెమీకండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు చొరవచూపాలన్న రేవంత్‌.

    • సెమీకండక్టర్‌ ప్రాజెక్టుకు అనువైన పరిస్థితులు, భూమి తెలంగాణలో ఉన్నాయని ప్రధాని మోదీకి తెలిపిన సీఎం రేవంత్‌.

    • వచ్చే ఏడాది హైదరాబాద్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

    • రక్షణరంగ MSMEలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరిన సీఎం రేవంత్‌.

  • May 24, 2025 19:36 IST

    పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలి: ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం

    • విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై చేసిన.. ఆరోపణలు తక్షణం వెనక్కి తీసుకోవాలి.

    • లేనిపక్షంలో చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక.

  • May 24, 2025 18:07 IST

    దేశంలోకి మరో రెండు కొత్త కరోనా వేరియంట్లు

    corona.jpg

    • కొత్త వేరియంట్లు NB.1.8.1, LF.7గా గుర్తింపు.

    • తమిళనాడు, గుజరాత్‌లో నమోదైనట్టు ఇన్సాకాగ్ వెల్లడి.

    • పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల సంఖ్య.

    • ఢిల్లీలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదు.

    • ఏపీలో గడచిన 24 గంటల్లో 4, తెలంగాణలో ఒకరికి పాజిటివ్‌.

    • కేరళలో ఇప్పటివరకు 273 కేసులు నమోదు.

    • ఉత్తరాఖండ్‌లో పలు జిల్లాల్లో హై అలర్ట్‌.

    • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం.

  • May 24, 2025 15:23 IST

    బాపట్ల: పొగాకు రైతులు, బయ్యర్లతో మంత్రి అచ్చెన్న భేటీ

    • నల్లబర్లీ ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

    • రైతు కూలీలే నల్లబర్లీ పండించారు.

    • గతేడాది నల్లబర్లీకి మంచి ధర లభించింది.

    • ధరల స్థిరీకరణకు రూ.130 కోట్లు కేటాయించాం.

    • ధరలు తగ్గిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

    • పొగాకు చివరి ఆకు వరకు కొనుగోలు చేయిస్తాం.

    • నల్లబర్లీ కొనుగోలులో కంపెనీలు స్పీడ్ పెంచాలి.

  • May 24, 2025 15:04 IST

    ఢిల్లీ: కేటీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మహేష్‌గౌడ్‌

    • ఇంట్లో కుంపటి తట్టుకోలేకే కేటీఆర్‌ వ్యాఖ్యలు.

    • సీఎం రేవంత్‌పై కేటీఆర్‌వి పసలేని ఆరోపణలు.

    • కవిత ఎపిసోడ్‌ను డైవర్ట్‌ చేసేందుకే కాంగ్రెస్‌పై ఆరోపణలు.

    • పదేళ్ల BRS తప్పిదాలను కవిత ఎండగట్టారు.

    • BRS, BJP మధ్య స్పష్టమైన అవగాహన ఉంది.

    • త్వరలో BRS మూడుముక్కలు కాబోతోంది.

    • కేటీఆర్‌, కవిత మధ్య పోటీ ఎక్కువ కావడంతో.. అదను కోసం హరీష్‌రావు ఎదురుచూస్తున్నారు.

  • May 24, 2025 15:02 IST

    విశాఖ: LTT ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

    • ముంబై-విశాఖ LTT ఎక్స్‌ప్రెస్‌లో..

    • బాంబు పెట్టామంటూ దుండగుడు ఫోన్‌

    • విశాఖ రైల్వేస్టేషన్‌లో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

    • నకిలీ ఫోన్‌ కాల్‌గా నిర్థారించిన అధికారులు

  • May 24, 2025 13:46 IST

    ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరిస్‌కు భారత జట్టు ప్రకటన

    • టెస్ట్‌ జట్టుకు కెప్టెన్‌గా శుభమన్‌ గిల్‌

    • టెస్ట్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ ఎంపిక

    • టీమ్‌లో జైశ్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, నితీష్‌ రెడ్డి, ఈశ్వరన్‌, కరణ్‌ నాయర్‌, జడేజా

  • May 24, 2025 13:33 IST

    కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌ గౌడ్ కౌంటర్
    • కేటీఆర్‌కు అధికార దెయ్యం పట్టింది: మహేష్‌గౌడ్

    • కేసీఆర్‌కు పట్టిన దెయ్యం కేటీఆరే అని కవిత చెప్పకనే చెప్పారు

    • కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతిభ్రమించింది: మహేష్‌గౌడ్

    • సీఎం రేవంత్‌పై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: మహేష్‌గౌడ్

    • కాళేశ్వరం స్కామ్‌లో కేసీఆర్, హరీష్‌రావుకు నోటీసులు రావడంతో షాక్ తిన్న కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు: మహేష్‌ గౌడ్

  • May 24, 2025 13:31 IST

    మోదీతో రేవంత్ భేటీ.. ఎప్పుడంటే..

    • ఢిల్లీ: సా.5గంటలకు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

    • సా.5:30కు కేంద్రమంత్రి కుమారస్వామితో రేవంత్ సమావేశం

  • May 24, 2025 13:29 IST

    movie-deyaters.jpg

    థియేటర్ల బంద్ వివాదంపై క్లారిటీ..

    • థియేటర్ల బంద్ వివాదంపై ఫిలిం చాంబర్ ప్రెస్‌మీట్

    • నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్లతో చర్చించాం

    • జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత అనేది లేదు: ఫిలిం చాంబర్

    • చిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగుతాయి: ఫిలిం చాంబర్

    • మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం: ఫిలిం చాంబర్

    • ఈనెల 30న సమస్యలపై కమిటీ వేస్తున్నాం: ఫిలిం చాంబర్

    • ఏపీ మంత్రి దుర్గేష్‌కి ఏ సమాచారం ఉందో మాకు తెలీదు

    • : తెలుగు ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్

  • May 24, 2025 13:02 IST

    సోషల్ మీడియా వార్తలు.. స్పందించిన విజయసాయిరెడ్డి

    • సోషల్ మీడియా వార్తలపై స్పందించిన విజయసాయిరెడ్డి

    • నా పేరుపై సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన నాది కాదు

    • నేను ఎలాంటి ప్రకటనలు చేయలేదు: విజయసాయిరెడ్డి

    • సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం: సాయిరెడ్డి

  • May 24, 2025 13:01 IST

    సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయింది: మంత్రి సీతక్క

    • కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం

    • కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు?: మంత్రి సీతక్క

    • అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోంది: సీతక్క

    • కవిత అన్న దయ్యం.. కేటీఆరే కావొచ్చు: సీతక్క

    • రాహుల్ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు: సీతక్క

  • May 24, 2025 13:00 IST

    విజయవాడ: వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

    • వాంతులు కావడంతో ఇబ్బందిపడుతున్న వంశీ

    • కంకిపాడు పీఎస్ నుంచి జీజీహెచ్‌కు తరలింపు

    • వల్లభనేని వంశీ వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు

    • ఆస్పత్రిలో ఒకరినొకరు పలకరించుకున్న వంశీ, PSR

    • బీపీ పెరగడంతో ప్రభుత్వాస్పత్రికి PSR ఆంజనేయులు

  • May 24, 2025 12:53 IST

    ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్ పరోక్ష వార్నింగ్

    • అంతర్గత విషయాలను బయట మాట్లాడటం సరికాదు: కేటీఆర్

    • అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది: కేటీఆర్

    • కవిత లేఖ పెద్ద విషయం కాదు: కేటీఆర్

    • పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరం సమానమే: కేటీఆర్

    • మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ: కేటీఆర్

    • కేసీఆర్‌కు లేఖలు రాయడం సహజమే: కేటీఆర్

    • కేసీఆర్‌కు సూచనలు చేయాలంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు: కేటీఆర్

  • May 24, 2025 12:21 IST

    KTR.jpg

    బీజేపీకి నిజాయితీ ఉంటే తెలంగాణలో స్కామ్‌లపై స్పందించాలి: కేటీఆర్

    • తెలంగాణలో స్కామ్‌లపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు స్పందించడంలేదు?: కేటీఆర్

    • తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని మోదీనే చెప్పారు: కేటీఆర్

    • RRR ట్యాక్స్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?: కేటీఆర్

    • బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ అవగాహనతో నడుస్తున్నాయి: కేటీఆర్

    • పొంగులేటి ఇంట్లో ఈడీ తనిఖీలు జరిగి ఏడాదైంది: కేటీఆర్

    • పొంగులేటి ఇంట్లో తనిఖీల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు: కేటీఆర్

    • కాంగ్రెస్ నేతలను బీజేపీ నేతలు ఎందుకు కాపాడుతున్నారు?: కేటీఆర్

    • వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రూ.45కోట్లు వచ్చాయి: కేటీఆర్

    • ఈ స్కామ్‌లో నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?: కేటీఆర్

  • May 24, 2025 11:29 IST

    దేశం ముందు పరువు తీస్తున్నారు: కేటీఆర్

    • యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారు: కేటీఆర్

    • తెలంగాణలో కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు అయింది: కేటీఆర్

    • ఈడీ చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరున్నా బీజేపీ స్పందించడం లేదు: కేటీఆర్

    • బీజేపీకి నిజాయితీ ఉంటే తెలంగాణలో స్కామ్‌లపై స్పందించాలి: కేటీఆర్

    • తెలంగాణలో స్కామ్‌లపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు స్పందించడంలేదు?: కేటీఆర్

    • బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ అవగాహనతో నడుస్తున్నాయి: కేటీఆర్

    • రేవంత్‌కు బ్యాగ్‌మాన్ అనే పేరు ఎప్పుడో వచ్చింది: కేటీఆర్

    • ఢిల్లీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది: కేటీఆర్

    • రేవంత్ మాటలు, మూటల ముఖ్యమంత్రి: కేటీఆర్

    • మూటలు పంచి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నారు: కేటీఆర్

    • తనని తాను కాపాడుకునేందుకు ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు: కేటీఆర్

    • రేవంత్‌కు ఢిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారు: కేటీఆర్

    • ఒకరు రాహుల్‌గాంధీ.. మరొకరు మోదీ: కేటీఆర్

    • 16 నెలల్లో 44సార్లు ఢిల్లీ వెళ్లి అరుదైన రికార్డ్ సాధించారు: కేటీఆర్

    • నిన్న రాత్రి చీకట్లో అమిత్‌షా కాళ్లు పట్టుకున్నారు: కేటీఆర్

    • ఈరెస్ట్ చేయొద్దని ఈడీకి చెప్పాలని వేడుకున్నారు: కేటీఆర్

    • నిజాయితీ ఉంటే సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలి: కేటీఆర్

    • లేదంటే ఢిల్లీ పెద్దలే రేవంత్‌ను తప్పించాలి: కేటీఆర్

    • నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు రూటు: కేటీఆర్

    • యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారు: కేటీఆర్

    • తెలంగాణలో కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కయింది: కేటీఆర్

    • ఈడీ చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరున్నా బీజేపీ స్పందించడం లేదు: కేటీఆర్

  • May 24, 2025 11:29 IST

    తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం

    ktr-2.jpg

    • నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉండటం తెలంగాణ సమాజానికే అవమానం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

    • రేవంత్‌ది సీటుకు రూటు కుంభకోణం: కేటీఆర్

    • ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు: కేటీఆర్

    • యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు: కేటీఆర్

    • రూ.50కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా చెప్పారు: కేటీఆర్

    • రేవంత్‌కు బ్యాగ్‌మాన్ అనే పేరు ఎప్పుడో వచ్చింది: కేటీఆర్

    • ఢిల్లీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది: కేటీఆర్

    • రేవంత్ మాటలు, మూటల ముఖ్యమంత్రి: కేటీఆర్

    • మూటలు పంచి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నారు: కేటీఆర్

    • తనని తాను కాపాడుకునేందుకు ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు: కేటీఆర్

    • రేవంత్‌కు ఢిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారు: కేటీఆర్

    • ఒకరు రాహుల్‌గాంధీ.. మరొకరు మోదీ: కేటీఆర్

    • 16 నెలల్లో 44సార్లు ఢిల్లీ వెళ్లి అరుదైన రికార్డ్ సాధించారు: కేటీఆర్

    • నిన్న రాత్రి చీకట్లో అమిత్‌షా కాళ్లు పట్టుకున్నారు: కేటీఆర్

    • అరెస్ట్ చేయొద్దని ఈడీకి చెప్పాలని వేడుకున్నారు: కేటీఆర్

    • నిజాయితీ ఉంటే సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలి: కేటీఆర్

    • లేదంటే ఢిల్లీ పెద్దలే రేవంత్‌ను తప్పించాలి: కేటీఆర్

    • అవినీతి సీఎంను ఎందుకు కొనసాగిస్తున్నారో రాహుల్ చెప్పాలి: కేటీఆర్

    • కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి ఉంది: కేటీఆర్

    • నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు రూటు: కేటీఆర్

  • May 24, 2025 10:38 IST

    ఘోర రోడ్డుప్రమాదం..

    • కడప- రాయచోటి ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం

    • గువ్వల చెరువు ఘాట్‌లో ఎదురెదురుగా ఢీకొన్న కారు, లారీ

    • కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి

    • గువ్వల చెరువు ఘాట్‌లోని 4వ మలుపు వద్ద ప్రమాదం

    • కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీస్తున్న పోలీసులు, స్థానికులు

  • May 24, 2025 10:30 IST

    BRSను కుదిపేస్తున్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

    • KCR చుట్టూ దెయ్యాలున్నాయన్న కవిత

    • కవిత లేఖను లీక్ చేసిన కుట్ర దారులెవరు?

    • కవిత వ్యాఖ్యలపై 11 గంటలకు స్పందించనున్న కేటీఆర్

    • పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్‌ కీలక ప్రెస్‌మీట్‌

    • దెయ్యాలు, కుట్రదారులు కామెంట్స్‌పై స్పందించనున్న కేటీఆర్

    • కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతున్నారోనని ఉత్కంఠ

  • May 24, 2025 10:30 IST

    సజ్జల ఎస్టేట్‌లో డ్రోన్‌ వీడియో

    • కడప: సజ్జల ఎస్టేట్‌లో డ్రోన్‌తో రెవెన్యూ అధికారుల వీడియో

    • ప్రభుత్వ భూములు మరోసారి అన్యాక్రాంతం కాకుండా చర్యలు

    • ఎస్టేట్ మెయిన్ గేటుకు తాళం వేసిన సజ్జల కుటుంబసభ్యులు

  • May 24, 2025 10:29 IST

    హాజరైన అన్ని రాష్ట్రాల సీఎంలు..

    • ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతిఆయోగ్‌ పాలక మండలి భేటీ

    • ప్రగతి మైదాన్‌ మండపంలో నీతిఆయోగ్‌ సమావేశం

    • హాజరైన అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు

    • 2047 నాటికి పూర్తి అభివృద్ధి చెందిన భారత్‌ ఆవిష్కరణే లక్ష్యంగా భేటీ

  • May 24, 2025 10:28 IST

    ఉగ్రకుట్ర.. దర్యాప్తు ముమ్మరం..

    • విజయనగరం: పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం

    • రెండో రోజు సమీర్, సిరాజ్‌ను విచారించనున్న పోలీసులు

    • ఇతర రాష్ట్రాలు, దేశాల్లో సంబంధాలపై ప్రధానంగా ఆరా

    • ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి పోలీసుల విచారణ

    • పొంతనలేని సమాధానాలు చెబుతున్న సిరాజ్‌, సమీర్‌

  • May 24, 2025 10:27 IST

    బాబోయ్.. ఒకే కుటుంబానికి చెందిన..

    • విజయవాడ: బెంజిసర్కిల్ NCB కాలనీలో విషాదం

    • విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

    • ఇళ్లు ఖాళీ చేసేందుకు సామాన్లు సర్దుతుండగా ఘటన

    • ఒకరిని కాపాడబోయి.. మిగిలిన ఇద్దరు మృతి

  • May 24, 2025 10:26 IST

    విజయవాడలో బాంబు కలకలం

    • బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టామంటూ ఫోన్‌కాల్‌

    • కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తి

    • బీసెంట్‌ రోడ్డులో తనిఖీలు చేపట్టిన బాంబ్‌ స్క్వాడ్

  • May 24, 2025 10:26 IST

    లతేహార్‌లో ఎన్‌కౌంటర్‌..

    • జార్ఖండ్‌: లతేహార్‌లో ఎన్‌కౌంటర్‌, ముగ్గురు మావోయిస్టులు మృతి

    • మృతుల్లో జార్ఖండ్ జన్ ముక్తీ పరిషత్ కీలక నేత పప్పు

    • పప్పు లోహరాపై రూ.10 లక్షల రివార్డు

  • May 24, 2025 08:48 IST

    బిజీబిజీగా సీఎం చంద్రబాబు..

    • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

    • నీతి ఆయోగ్‌ పాలకమండలి భేటిలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • May 24, 2025 08:48 IST

    నేడే నీతి అయోగ్ సమావేశం.. సీఎంలు అంతా..

    • నేడు నీతి అయోగ్‌ 10వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం

    • ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు నీతి అయోగ్‌ సమావేశం

    • 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా నీతి అయోగ్‌ సమావేశం

    • వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా రాష్ట్రాల అభివృద్ధిపై చర్చ

    • రాష్ట్రాలు కలిసి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి

  • May 24, 2025 08:47 IST

    మెట్రో ఛార్జీలు.. నేటి నుంచే..

    • హైదరాబాద్: తగ్గించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమలు

    • నేటి నుంచి అమలులోకి మెట్రోరైలు కొత్త చార్జీలు

    • కనిష్ఠంగా రూ.12 గరిష్ఠంగా రూ.75 ధరలు

    • పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్‌ ప్రకటించిన మెట్రో

  • May 24, 2025 08:45 IST

    నిర్మాతల భేటీ

    • నేడు ఎగ్జిబిటర్లు, డిస్ర్టిబ్యూటర్లతో నిర్మాతల భేటీ

    • థియేటర్ల బంద్‌ నిర్ణయంపై సమావేశంలో చర్చ

  • May 24, 2025 08:45 IST

    భారీ వర్షం..

    • విజయవాడలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం

    • ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం

    • లోతట్టు ప్రాంతాలు జలమయం

  • May 24, 2025 08:40 IST

    అమరావతే రాజధాని..

    అమరావతి: విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరాం: చంద్రబాబు

    లేపాక్షి-ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తాం: చంద్రబాబు

    రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు

    ఏపీలో రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలని కోరాం: సీఎం చంద్రబాబు

    ఏపీలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు..గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ: చంద్రబాబు

    కేంద్రం అనుమతి రాగానే పోలవరం-బనకచర్ల పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు

    2027 నాటికి పోలవరం పూర్తిచేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

    గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయింది: సీఎం చంద్రబాబు

    గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: సీఎం

    రాష్ట్రానికి ఆర్థిక సాయంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్న సీఎం చంద్రబాబు

  • May 24, 2025 08:40 IST

    ఘోర విషాదం..

    • చిత్తూరు: ఎస్ఆర్ పురం మం. మొక్కలచెరువులో విషాదం

    • చెరువులో చేపల కోసం వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు

    • గల్లంతయిన వారిని బయటికి తీసిన స్థానికులు

    • లావణ్య (12) బాలిక మృతి, చికిత్స పొందుతున్న కార్తీక్, పల్లవి

  • May 24, 2025 08:40 IST

    ఆ సమావేశానికి సీఎం రేవంత్

    • ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి హాజరుకానున్న సీఎం

  • May 24, 2025 08:40 IST

    వంశీని ప్రశ్నించనున్న పోలీసులు

    • విజయవాడ: నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు

    • నేడు వంశీని ప్రశ్నించనున్న కంకిపాడు పోలీసులు

  • May 24, 2025 08:33 IST

    మరో రెండు రోజుల్లో..

    • రెండు రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

    • తూర్పు మధ్య ఆరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనం

    • 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

    • ఈనెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

    • రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన

    • ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం