Breaking News: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలు ఇవే..
ABN , First Publish Date - May 19 , 2025 | 02:35 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 19, 2025 19:50 IST
క్యాబినెట్ భేటీ..
అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ
SIPB 6వ భేటీలో ఆమోదించిన సంస్థల పెట్టుబడులకు క్యాబినెట్‌లో ఆమోదం
19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు
వచ్చే జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిపై భేటీలో చర్చ
పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్‌కు పాలన పరమైన అనుమతులకు అమోదంపై చర్చ
ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ది-సంక్షేమం-పారిశ్రామిక వృద్ధిపై పెద్దఎత్తున ప్రచారం చేసే అంశంపై కీలక చర్చ
ఉద్యోగుల బదిలీల అంశంపై చర్చ
పలు సంస్థలకు భూ కేటాయింపులపై భేటీలో చర్చ
-
May 19, 2025 19:49 IST
సీఎం చంద్రబాబు సమీక్ష..
అమరావతి: పథకాలు, సేవలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందే: సీఎం చంద్రబాబు
ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి: సీఎం చంద్రబాబు
దీపం లబ్ధిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము: సీఎం చంద్రబాబు
జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు: సీఎం చంద్రబాబు
-
May 19, 2025 19:47 IST
అమరావతి: సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ లేఖ
ఢిల్లీలో గేట్ ఫౌండేషన్ బృందంతో ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుపై బిల్‌గేట్స్ ప్రశంసలు
పేదల విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపై ఒప్పందం
మంచి వాతావరణంలో సంప్రదింపులు జరిపాం: బిల్ గేట్స్
-
May 19, 2025 19:18 IST
HRC సీరియస్..
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై HRC సీరియస్
సుమోటోగా కేసు నమోదు, విచారణకు ఆదేశం
సీఎస్, సీపీ, ఫైర్ డీజీ, TSSPDCLకు నోటీసులు
జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం
మీడియా కథనాలపై స్పందించిన HRC
-
May 19, 2025 19:18 IST
అగ్నిప్రమాద కారణాలు ఇవే..
హైదరాబాద్: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలు గుర్తింపు
ఏసీ కంప్రెసర్ పేలుడే కారణంగా తేల్చిన ఫైర్ అధికారులు
గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఏసీ కంప్రెసర్లు పేలడంతోనే ప్రమాదం
నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన
అగ్నిప్రమాదంలో 17 మంది మృతి, పలువురికి గాయాలు
-
May 19, 2025 17:26 IST
ముంబై: BCCI కీలక ప్రకటన
ఆసియా కప్ నుంచి భారత్ వైదొలిగినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు: BCCI
సెప్టెంబర్‌లో జరిగే టోర్నమెంట్ కోసం ఇప్పుడే నిర్ణయం తీసుకోం: BCCI
-
May 19, 2025 17:26 IST
ఐదుగురు అదృశ్యం
సిద్దిపేట: ఖాదరపురలో ఐదుగురు కుటుంబ సభ్యులు అదృశ్యం
అప్పుల బాధ తాళలేక ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసిన వీరబత్తిని బాలకిషన్ కుటుంబ సభ్యులు
వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాలకిషన్ బంధువులు
-
May 19, 2025 17:25 IST
ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి: బొత్స
విశాఖ: కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు 20 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు: బొత్స
కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు: బొత్స
ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి: బొత్స
హామీలు ఇవ్వడం.. మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే
ఆడబిడ్డ నిధి పథకంపై కూటమి నేతలు స్పందించాలి: బొత్స
-
May 19, 2025 16:39 IST
కొవిడ్ పాజిటివ్..
శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్ పాజిటివ్
తనకు కొవిడ్ పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో శిల్పా శిరోద్కర్ ప్రకటన
సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్
-
May 19, 2025 16:34 IST
వర్షాలే.. వర్షాలు..
తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు
ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
-
May 19, 2025 16:33 IST
కాంగ్రెస్ నేతల సమావేశం..
విశాఖలో 26 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతల సమావేశం
పార్టీలో పరిణామాల నేపథ్యంలో అసంతృప్తి వర్గం సమావేశం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి
-
May 19, 2025 16:33 IST
వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
2-3 రోజుల్లో దక్షిణ అరేబియా, మార్దీవులు, కొమోరిన్‌లో విస్తరించనున్న రుతుపవనాలు
బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్న రుతుపవనాలు
మధ్య మహారాష్ట్ర సహా అంతర్గత కర్ణాటక, రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి
కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న మరో ద్రోణి
రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షసూచన
పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో పాటు ఈదురుగాలులు వీచే సూచన
-
May 19, 2025 16:32 IST
బెయిల్ పిటిషన్ వాయిదా..
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన నూజివీడు కోర్టు
కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన నూజివీడు కోర్టు
-
May 19, 2025 16:31 IST
వాగ్మూలం తీసుకుంటాం.. అనుమతి ఇవ్వండి: ఈడీ
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా
రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి కోరుతూ ఈడీ పిటిషన్
విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
-
May 19, 2025 16:30 IST
అందాల పోటీలపై బండి సంజయ్ ఏమన్నారంటే..
అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా?: బండి సంజయ్
సరస్వతి పుష్కరాలకు రూ.35 కోట్లు ఎలా సరిపోతాయి?
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం ఫెయిలైంది: బండి సంజయ్
కుంభమేళాలో 50 కోట్ల మందికి అద్బుతమైన ఆతిధ్యమిచ్చాం
ఇక్కడ 50 లక్షల మందికి ఏర్పాట్లు చేయలేకపోయారు: బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే పుష్కరాలను దక్షిణాది మొత్తం పండుగలా నిర్వహించే వాళ్లం: బండి సంజయ్
-
May 19, 2025 16:29 IST
సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
భారత్ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు
వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదు
శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
తక్షణం శరణార్థులు భారత్‌ను వీడాలి: సుప్రీంకోర్టు
-
May 19, 2025 16:28 IST
కమిషన్ గడువు పొడిగింపు..
కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పొడిగింపు
మరో 2 నెలలు విచారణ గడువు పొడింగించిన ప్రభుత్వం
జులై నెలాఖరు వరకు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం
-
May 19, 2025 14:39 IST
జనసేనకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం: పల్లా శ్రీనివాస్
విశాఖ: జీవీఎంసీలో మాకు అవసరమైన బలం ఉంది: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
జనసేనకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం: పల్లా శ్రీనివాస్
టీజీపీలో ఆశావాహులు ఉన్న మాట వాస్తవం: పల్లా శ్రీనివాస్
కోఆర్డినేషన్ సమస్య కారణంగా ఈ ఇబ్బంది వచ్చింది: పల్లా
సభ్యులు అందరూ వస్తారని దీమాతో ఉన్నాం: పల్లా శ్రీనివాస్
దీనికి నేనే పూర్తి బాధ్యత వహిస్తా: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా
-
May 19, 2025 14:37 IST
టీడీపీ అధిష్ఠానం సీరియస్..
విశాఖ: డిప్యూటీ మేయర్ ఎన్నికకు కార్పొరేటర్లు గైర్హాజరుపై టీడీపీ అధిష్టానం సీరియస్
చర్యలకు వెనకాడొద్దని రాష్ట్ర నాయకత్వానికి సూచన
నోటీసులు జారీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశాలు
-
May 19, 2025 14:35 IST
సీఎం రేవంత్ పర్యటన..
నాగర్‌కర్నూల్: మాచరంలో సీఎం రేవంత్ పర్యటన
ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన రేవంత్
ఆదివాసి గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం రూపొందించిన 10 అంశాలతో నల్లమల డిక్లరేషన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్
పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం: రేవంత్
మీరు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా ఉన్నాయి
ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్
నల్లమల అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతం: రేవంత్
ఎవరో వచ్చి నల్లమలను అభివృద్ధి చేయాలని అనేవారు: రేవంత్
పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని గర్వంగా చెప్పుకుంటా: రేవంత్
పొడురైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర BRSది: రేవంత్
గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ది: రేవంత్
అచ్చంపేటలో ప్రతిరైతుకు సోలార్ విద్యుత్ అందించి తీరుతాం: రేవంత్
సోలార్ విద్యుత్‌తో ఆదాయం వచ్చేలా చేస్తాం: సీఎం రేవంత్