Breaking News: ఎగ్జిబిటర్ల నిర్ణయంపై విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశం
ABN , First Publish Date - May 23 , 2025 | 07:55 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 23, 2025 21:56 IST
ఎగ్జిబిటర్ల నిర్ణయంపై విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశం
అమరావతి: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై మంత్రి దుర్గేశ్ విచారణకు ఆదేశం.
నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖను కోరిన దుర్గేశ్.
హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు.. థియేటర్లు మూసివేయాలని నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.
ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే దానిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌తో మాట్లాడిన మంత్రి దుర్గేశ్.
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడంపై.. విచారణ చేయాలని ఆదేశించిన మంత్రి దుర్గేష్.
-
May 23, 2025 17:51 IST
తెలంగాణలో కరోనా కేసు నమోదు..
హైదరాబాద్ కూకట్‌పల్లిలో డాక్టర్‌కు కరోనా పాజిటివ్.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వైద్య ఆరోగ్యశాఖ.
-
May 23, 2025 16:58 IST
టీచర్ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు..
న్యూఢిల్లీ: ఏపీలో టీచర్ నియామకాలకు సంబంధించిన టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు.
టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వీలైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించారు.
డీఎస్సీ షెడ్యూల్ యధావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
-
May 23, 2025 14:10 IST
ఘోర రోడ్డు ప్రమాదం..
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కారును ఢీకొన్న లారీ, ఆరుగురు మృతి
మృతులు స్టువర్ట్‌పురం వాసులుగా గుర్తింపు
కొమరోలు మం. తాటిచెర్లమోటు దగ్గర ఘటన
మహానంది వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
-
May 23, 2025 13:03 IST
వైఎస్ జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేత సోమిరెడ్డి కౌంటర్
విధ్వంసాలు చేసిన వ్యక్తి వెన్నుపోటు దినం అంటున్నారు: ఎమ్మెల్యే సోమిరెడ్డి
ఉర్సా కంపెనీకి భూముల అప్పగింత విషయంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమా?: ఎమ్మెల్యే సోమిరెడ్డి
ఎకరం రూపాయికి ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: ఎమ్మెల్యే సోమిరెడ్డి
ఏపీలో ఇప్పుడు అన్ని మద్యం బ్రాండ్లు లభిస్తున్నాయి: సోమిరెడ్డి
జగన్ తెచ్చిన మద్యం తాగి చెర్లోపల్లిలో 27 మంది చనిపోయారు: ఎమ్మెల్యే సోమిరెడ్డి
2029లో వైసీపీకి ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు: సోమిరెడ్డి
-
May 23, 2025 13:02 IST
ఆపరేషన్ సిందూర్‌పై హోంమంత్రి అమిత్‌షా ప్రెస్‌మీట్
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు దీటైన జవాబిచ్చాం: అమిత్‌షా
ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులతో విరుచుకుపడ్డాం: అమిత్‌షా
పహల్గామ్ దాడులతో ఉగ్రవాదులు అన్ని హద్దులూ దాటారు: అమిత్‌షా
ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా కొనియాడింది: అమిత్‌షా
-
May 23, 2025 13:02 IST
పీఎం సూర్యఘర్ యోజన.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
ప్రహ్లాద్‌జోషితో సమావేశం సంతృప్తినిచ్చింది: ఎక్స్‌లో చంద్రబాబు
పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ రూఫ్‌టాప్ కేటాయింపులు కోరాం: ఎక్స్‌లో చంద్రబాబు
20లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ ఏర్పాటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ప్రతి నియోజకవర్గంలో సోలార్ ప్యానల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ ధరలు తగ్గించడంతో పాటు గ్రీన్ ఎనర్జీకి సహకారం అందిస్తాం: సీఎం చంద్రబాబు
-
May 23, 2025 13:02 IST
కస్టడీకి తురకా కిషోర్
పల్నాడు: పోలీస్ కస్టడీకి మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్
రెండు రోజుల కస్టడీకి అనుమతిచ్చిన మాచర్ల కోర్టు
భూకబ్జా, హత్యాయత్నం కేసులో గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తురకా కిషోర్
-
May 23, 2025 12:57 IST
మంత్రి నారా లోకేష్ మార్క్
కడప మహానాడులో మంత్రి నారా లోకేష్ మార్క్
గతానికి భిన్నంగా మహానాడు నిర్వహణకు యోచన
పార్టీ ఆలోచనల్లో మార్పులపై ప్రతిపాదనలు
6 అంశాలతో పార్టీకి కొత్త లుక్ తెచ్చేందుకు సమాలోచనలు
-
May 23, 2025 12:57 IST
పోలీస్ కస్టడీకి శ్రవణ్‌రావు..
హైదరాబాద్: చీటింగ్ కేసులో పోలీస్ కస్టడీకి శ్రవణ్‌రావు
ఒక్కరోజు కస్టడీకి అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు
రూ.6కోట్లు తీసుకుని మోసం చేశాడని అఖండ సంస్థ ఫిర్యాదు
-
May 23, 2025 12:57 IST
సీఎం చంద్రబాబు వరుస భేటీలు..
ఢిల్లీ: కేంద్రమంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలు
కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్ట్‌లపై చర్చ
BEL డిఫెన్స్ కాంప్లెక్స్, HAL-AMCAపై చర్చించే అవకాశం
-
May 23, 2025 11:31 IST
కవిత లేఖపై స్పందించని మాజీ మంత్రులు..
కవిత లేఖపై స్పందించేందుకు కేటీఆర్, హరీష్‌రావు నిరాకరణ
త్వరలోనే కవిత లేఖపై స్పందిస్తామన్న కేటీఆర్, హరీష్‌రావు
-
May 23, 2025 11:16 IST
ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ..
ఢిల్లీ: కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషితో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో సహకారం అందించాలని కోరిన చంద్రబాబు
కాసేపట్లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చంద్రబాబు సమావేశం
-
May 23, 2025 11:16 IST
రాజ్ కసిరెడ్డికి దక్కని ఊరట
ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట
తన అరెస్టును సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి పిటిషన్
కసిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం
-
May 23, 2025 10:12 IST
కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..
ఢిల్లీ: కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషితో సీఎం చంద్రబాబు భేటీ
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని కోరే అవకాశం
-
May 23, 2025 10:12 IST
విజయనగరం: ఉగ్ర కుట్ర భగ్నం కేసు
విశాఖ సెంట్రల్ జైలుకు విజయనగరం పోలీసులు
సిరాజ్, సమీర్‌ను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు
నిందితులను 7రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు
సిరాజ్, సమీర్‌ను ప్రశ్నించనున్న విజయనగరం పోలీసులు
-
May 23, 2025 10:12 IST
కసాయి తల్లి.. ఏం చేసిందంటే..
సిద్దిపేట: దుబ్బాక మండలం అప్పనపల్లిలో దారుణం
2నెలల పసికందును చంపి బావిలో పడేసిన తల్లి
తన కొడుకును ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు
దర్యాప్తులో తల్లే చంపినట్టు గుర్తించిన పోలీసులు
-
May 23, 2025 10:11 IST
మరోసారి ఎదురుకాల్పులు..
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్
భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు మృతి
కిష్టారం ప్రాంతంలో కొనసాగుతోన్న కాల్పులు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
May 23, 2025 10:11 IST
మరో ఎన్‌కౌంటర్.. జవాన్ మృతి..
జమ్మూకశ్మీర్: కిష్త్వార్ జిల్లాలో ఎన్‌కౌంటర్
ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ వీరమరణం
చత్రూ ప్రాంతంలో రెండు రోజులుగా కాల్పులు
భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతోన్న కాల్పులు
-
May 23, 2025 10:09 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
ఎస్ఎంఎస్-2లో ఎగిసిపడుతున్న మంటలు
మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది
ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్న అధికారులు
-
May 23, 2025 08:00 IST
కస్టడీకి తురక కిషోర్..
మాచర్ల మున్సిపల్ మాజీచైర్మన్ తురక కిషోర్‌కు కస్టడీ
నేడు, రేపు కిషోర్‌ను విచారించనున్న పోలీసులు
లాయర్ల సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశం
భూకబ్జా, హత్యాయత్నం కేసులో గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తురక కిషోర్
-
May 23, 2025 07:59 IST
విజయనగరం: పేలుళ్ల కుట్ర కేసు
ఏ1 సిరాజ్, ఏ2 సమీర్‌కు 7 రోజుల కస్టడీ
నేటి నుంచి సిరాజ్, సమీర్‌ను విచారించనున్న పోలీసులు
నేడు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలింపు
పేలుళ్ల కుట్రకేసులో కీలకంగా మారనున్న కస్టడీ విచారణ
-
May 23, 2025 07:58 IST
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
నేడు ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీకానున్న సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలపై చర్చించనున్న సీఎం
ప్రాజెక్టులు, పథకాలు అమలుకు ఏపీకి సహకరించాలని కోరనున్న సీఎం
నేడు ఉ.10 గంటలకు ప్రహ్లాద్ జోషితో భేటికానున్న చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని సీఎం కోరే అవకాశం
నేడు ఉ.11 గంటలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ను కలవనున్న సీఎం
ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్ట్‌లపై చర్చించనున్న సీఎం
బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్‌ఏఎల్-ఏఎంసీఏపై చర్చించనున్న సీఎం
ఇవాళ మ.12 గంటలకు జల్‌శక్తి మంత్రి పాటిల్‌ను కలవనున్న సీఎం
నేడు మ.3 గం.కు కేంద్ర ఆర్థికమంత్రిని కలవనున్న చంద్రబాబు
ఇవాళ సా.4 గం.కు అమిత్‌షా నిర్వహించే సమీక్షకు హాజరుకానున్న సీఎం
నూతన నేర చట్టాల అమలుపై సమీక్ష నిర్వహించనున్న అమిత్ షా
ఇవాళ రాత్రి 9 గం.కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిని కలవనున్న సీఎం
రేపు నీతి అయోగ్ పాలకమండలి భేటిలో పాల్గొననున్న సీఎం
-
May 23, 2025 07:57 IST
అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..
తూర్పు మధ్య ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం
మరో 36 గంటల్లో అల్పపీడనం..వాయుగుండంగా మారే అవకాశం
ఈనెల 27 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
రెండు రోజుల్లో అల్పపీడనం బలపడే అవకాశం
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరిక
రేపు అల్లూరి జిల్లా, మన్యం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు
మిగతా జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
ఎల్లుండి అల్లూరి జిల్లా, తూ.గో, కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు
ఎల్లుండి నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
-
May 23, 2025 07:57 IST
సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి..
నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
జహీరాబాద్ నియోకవర్గంలో సీఎం రేవంత్ పర్యటన
బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
రూ.494.67 కోట్లతో చేపట్టే పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్
అనంతరం పస్తాపూర్‌లో బహిరంగసభకు హాజరుకానున్న రేవంత్