Breaking News: సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
ABN , First Publish Date - Jun 22 , 2025 | 07:13 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 22, 2025 17:27 IST
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
దళిత JAC నేత కంభంపాటి శిరీష ఫిర్యాదుతో తాడేపల్లి పీఎస్‌లో కేసు
మహిళలపై సజ్జల అసభ్య వ్యాఖ్యలు చేశారని శిరీష ఫిర్యాదు
ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్లిన సజ్జల
సజ్జలకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని లాయర్ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్
-
Jun 22, 2025 15:00 IST
జగన్ కారు కింద పడి సింగయ్య మరణించిన కేసులో కీలక మలుపు
జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి (ఒంగోలు AR కానిస్టేబుల్) ను కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు
మరి కొద్దిసేపట్లో A 1 గా కారు డ్రైవర్ రమణారెడ్డి, A 2 గా జగన్, A 3 గా కారు యజమానిని పెట్టాలని నిర్ణయం
కారు ఫార్చూనర్ AP 40 DS 2349 గా గుర్తించిన పోలీసులు
కారు ను YSR కాంగ్రెస్ పార్టీ పేరు మీద కొనుగోలు చేసి ప్రతినిధిగా జగన్ OSD గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు
తనకు తెలియదని చెబుతున్న కారు డ్రైవర్
సింగయ్య ఆక్సిడెంట్ లో చనిపోయిన రోజు IPC లోని 304 A క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు
అయితే ఈ రోజు కెమెరా విజువల్స్‌లో అది జగన్ ప్రయాణిస్తున్న కారు అని తేలడంతో అలెర్ట్ ఆయన పోలీసులు
దీనితో FIR లో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ వర్తించే అవకాశం
BNS చట్టంలోని సెక్షన్ 105 కింద నమోదు చేసే అవకాశం
-
Jun 22, 2025 13:56 IST
జగన్ కారు డ్రైవర్ కోసం పోలీసులు ఆరా..
అమరావతి: జగన్ కారు డ్రైవర్ ఎవరనే అంశంపై పోలీసుల ఆరా
మనిషి పడ్డాడని తెలిసినా కారు ఎందుకు ఆపలేదనే కోణంలో దర్యాప్తు
జగన్ డ్రైవర్‌ను విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని అంటున్న పోలీసులు
జగన్ సత్తెనపల్లి పర్యటన వీడియోలు క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న పోలీసులు
ఎవరెవరు వీడియోలు తీశారో ఆరా తీస్తున్న పోలీసులు
వీడియోలు తీసిన వారి నుంచి ఫుటేజ్ కలెక్ట్ చేసే ప్రయత్నాల్లో పోలీసులు
సీసీ కెమెరాల ద్వారా మరింత సమాచారం సేకరించే ప్రయత్నం
జగన్ కారు సమీపంలో ఉన్నవాళ్లను గుర్తించే పనిలో పల్నాడు పోలీసులు
-
Jun 22, 2025 13:54 IST
ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్..
నంద్యాల: శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్
క్యాషియర్ శ్రీనివాసులు, జూ. అసిస్టెంట్ మంజనాథ్ సస్పెన్షన్
హుండీ కౌంటింగ్‌లో నిర్లక్ష్యంగా వహరించినందుకు చర్యలు: ఈవో
హుండీ కౌంటింగ్‌కు తెచ్చిన నాణాల సంచులను వదిలేసి వెళ్లిన సిబ్బంది
-
Jun 22, 2025 12:27 IST
బల ప్రదర్శనకు వెళ్లి రెండు ప్రాణాలు తీశారు: మంత్రి ఫైర్..
జగన్ తన పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారు: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
ప్రజల్లో ఆదరణ ఉందని చూపడం కోసం అమాయకులను బలిగొంటున్నారు: మంత్రి గొట్టిపాటి
బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి మరో రెండు నిండు ప్రాణాలు బలితీసుకున్నారు: మంత్రి గొట్టిపాటి
వాహనం ఢీకొన్న వెంటనే ఆసుపత్రికి తరలిస్తే సింగయ్య ప్రాణం నిలబడేది: గొట్టిపాటి
చేసిన పనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
-
Jun 22, 2025 12:25 IST
హైదరాబాద్: ఆర్.కృష్ణయ్యతో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత భేటీ
తెలంగాణ జాగృతి నుంచి బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్యను కలిశాం: కవిత
కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం పోరాటం చేస్తున్నాం: కవిత
బీసీలకు 42% రిజర్వేషన్లు కోసం ప్రభుత్వం అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టింది: కవిత
బిల్లులు పాస్ చేశాం... రాష్ట్రపతికి పంపాం... అని చేతులు దులుపుకుంటున్నారు: కవిత
రేపటి కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇస్తుందని లీకులు వస్తున్నాయి: కవిత
ఔర్ ఏక్ దక్కా బీసీ బిల్లు పక్కా నినాదంతో చేస్తున్న రైల్‌రోకోకు మద్దతు కోరాం: కవిత
-
Jun 22, 2025 12:25 IST
మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
హైదరాబాద్: ఆర్ అండ్ బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష
పలు రోడ్లు, వంతెనల నిర్మాణ పనుల పురోగతిపై సమావేశంలో చర్చ
మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్ల నిర్మాణం, ఆర్వోబీల పనుల పురోగతిపై ఆరా
పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు
-
Jun 22, 2025 12:25 IST
తిరుపతి: అరుదైన వడ్రంగి తేనెటీగ గుర్తింపు
తిరుపతి మంచినీళ్లగుంట దగ్గర వడ్రంగి తేనెటీగను గుర్తించిన ఎస్వీయూ పూర్వ విద్యార్థి డా.హరికృష్ణ
ఉత్తర అమెరికా, పశ్చిమ కనుమల్లో కన్పించే వడ్రంగి తేనెటీగ
తొలిసారిగా తిరుపతిలో గుర్తింపు: డా.హరికృష్ణ
-
Jun 22, 2025 12:23 IST
పహెల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు అరెస్ట్
నిందితులిద్దరూ లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులుగా గుర్తింపు
పర్వీజ్ అహ్మద్, బషీర్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
ముగ్గురు ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు
పాక్ ఉగ్రవాదులే దాడి చేశారని నిర్ధారించిన ఎన్ఐఏ
-
Jun 22, 2025 10:59 IST
ఆధారాలు లభించాయ్..
గుంటూరు: జగన్ కారు కింద పడి వ్యక్తి మరణించినట్లు లభించిన ఆధారాలు
పోలీసుల చేతికి వెంగళాయపాళెం వాసి సింగయ్య మృతి చెందిన విజువల్స్
టూర్‌లో కారు ముందు భాగాన కుడి పక్క టైర్ కింద పడిపోయిన సింగయ్య
సింగయ్య మెడ మీదుగా దూసుకెళ్లిన కారు
మనిషి పడినట్లు తెలిసినా అంతే వేగంతో కారు ముందుకు నడిపిన డ్రైవర్
స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేసు బుక్ చేయాలని పోలీసుల నిర్ణయం
-
Jun 22, 2025 10:59 IST
తప్పిన పెద్ద ప్రమాదం..
ఎన్టీఆర్: తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
జగ్గయ్యపేటలో కెనరా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
ఎవరూ లేకపోవడంతో తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
-
Jun 22, 2025 10:24 IST
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీస్ కేసులు
జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిషేదాజ్ఞలు ఉల్లంఘించారని కేసులు
నల్లపాడు, పాతగుంటూరు పీఎస్‌లలో కేసులు నమోదు
అంబటి రాంబాబు సహా మరికొందరు వైసీపీ నేతలపై FIR నమోదు
-
Jun 22, 2025 10:24 IST
హైదరాబాద్: నకిలీ ట్రేడింగ్ యాప్‌లో లింకులు పంపి మోసాలు
పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
రిషికేష్, మహమ్మద్ సుల్తాన్ షేక్‌ను అరెస్ట్ చేరి రిమాండ్‌కు తరలింపు
ఇటీవలే టోలిచౌకీకి చెందిన 65ఏళ్ల వృద్ధుడికి సైబర్ నేరగాళ్ళు టోకరా
నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులతో వృద్ధుడి నుంచి రూ.74.36 లక్షలు స్వాహా
-
Jun 22, 2025 10:24 IST
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ కచ్చితంగా శాంతికి రావాల్సిందే: ట్రంప్
భవిష్యత్‌లో దాడులు మరింత తీవ్రం చేస్తాం: ట్రంప్
దాడులు చేయాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయి: ట్రంప్
ఇరాన్‌పై దాడులు అద్భుతమైన సైనిక విజయం: ట్రంప్
-
Jun 22, 2025 07:18 IST
ఇరాన్‌పై భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్
అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌కు చెందిన ముగ్గురు కమాండర్లు మృతి
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌కు చెందిన ఇస్ఫహాన్ అణుకేంద్రానికి భారీ నష్టం
బాలిస్థిక్ క్షిపణుల తయారీ కర్మాగారాలపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
కుజెస్థాన్ ప్రావిన్స్‌లో ఇరాన్ సైనిక సదుపాయాన్ని నాశనం చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమని ఇజ్రాయెల్ ప్రకటన
-
Jun 22, 2025 07:18 IST
నేడు తమిళనాడుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
మధురైలో జరగనున్న భక్తర్గల్ మానాడులో పాల్గొననున్న పవన్
మధుర మీనాక్షి, ఆరిల్మిగు మురుగున్ ఆలయాలు సందర్శన
అనంతరం మానాడులో ప్రసగించనున్న పవన్‌కల్యాణ్
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనే అవకాశం
-
Jun 22, 2025 07:18 IST
ఆత్మాహుతి దాడి..
నైజీరియా: బోర్నోలోని రెస్టారెంట్‌లో ఆత్మాహుతి దాడి
ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి, పలువురికి గాయాలు
-
Jun 22, 2025 07:16 IST
ఇరాన్‌పై అమెరికా దాడి.. ప్రకటించిన ట్రంప్
ఇరాన్‌లోని 3 న్యూక్లియర్ సైట్లపై దాడి: ట్రంప్ పోస్ట్
ఫార్దో అణుకేంద్రంపై అమెరికా బాంబుల వర్షం
అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడిన అమెరికా
ఫార్దో, నంతాజ్, ఇస్ఫహాన్‌లోని అణుకేంద్రాలపై భారీ దాడులు
దాడుల సమాచారం స్వయంగా ప్రకటించిన ట్రంప్
-
Jun 22, 2025 07:15 IST
భారీ బాంబులు ఫార్దోపై వేశాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు: ట్రంప్
ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫార్దో నాశనమైంది: ట్రంప్
ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి ఇరాన్‌పై దాడులు
మా విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి: ట్రంప్
ప్రపంచంలో మరే మిలటరీకి ఇది సాధ్యం కాదు: ట్రంప్
ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది: ట్రంప్ పోస్ట్
అమెరికా యోధులకు అభినందనలు: ట్రంప్ పోస్ట్
-
Jun 22, 2025 07:15 IST
మూడోరోజు టెస్టు మ్యాచ్..
అండర్సన్ తెందుల్కర్ ట్రోఫీ: నేడు మూడోరోజు టెస్టు మ్యాచ్
ఇంగ్లాండ్‌లోని హెడింగ్లీ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్-భారత్ టెస్టు మ్యాచ్
మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఇంగ్లాండ్-భారత్ మ్యాచ్
-
Jun 22, 2025 07:13 IST
కొనసాగుతున్న ఆపరేషన్ సింధు
ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి భారతీయులు తరలింపు
ఇరాన్ నుంచి 1,117 మంది భారత్‌కు తరలింపు
నేపాల్, శ్రీలంక పౌరులను కూడా తరలింస్తున్న భారత్