Breaking News: టీపీసీసీ కార్యవర్గం ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
ABN , First Publish Date - Jun 09 , 2025 | 02:53 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 09, 2025 21:46 IST
టీపీసీసీ కార్యవర్గం ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
టీపీసీసీలో 27 మంది ఉపాధ్యక్షులకు స్థానం
జనరల్ సెక్రటరీలుగా 69 మందికి అవకాశం
ఉపాధ్యక్షులు: బల్మూరి వెంకట్, బసవరాజ్ సారయ్య, బొంతు రామ్మోహన్
ఉపాధ్యక్షులు: కుమార్‌రావు, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఉపాధ్యక్షులు: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఝాన్సీరెడ్డి, బండి రమేష్, కొండ్రు పుష్పలీల
ఉపాధ్యక్షులు: కె.నీలిమా, బి.కైలాష్‌కుమార్, ఎన్.శ్రీనివాస్, ఆత్రం సుగుణ
ఉపాధ్యక్షులు: గాలి అనిల్‌కుమార్, సీహెచ్ సత్యనారాయణ, ఎల్.ధన్వంతి
ఉపాధ్యక్షులు: ఎం.వేణు గౌడ్, కె.వినయ్ రెడ్డి, కె.మల్లయ్య, ఎం.ఎ.ఫహీం
ఉపాధ్యక్షులు: ఎస్.సురేష్‌కుమార్, అక్సర్ యూసుఫ్ జాహీ, ఎస్.జగదీశ్వర్‌రావు
ఉపాధ్యక్షులు: నవాబ్ నిజాహిద్ ఆలం ఖాన్, జి.మోహన్ రెడ్డి, సీహెచ్ సంగమేశ్వర్
-
Jun 09, 2025 21:46 IST
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కేసీ వేణుగోపాల్‌తో గంటపాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చ
పలువురు మంత్రులకు శాఖల మార్పుపై భేటీలో కీలక చర్చ
రేపు AICC అధ్యక్షుడు ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం
ఖర్గేతో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించే అవకాశం
మరో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చించే అవకాశం
కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం
-
Jun 09, 2025 19:42 IST
ముంబై సబర్బన్ రైళ్లలో ఆటోమేటెడ్ డోర్ వ్యవస్థ
ప్రమాదాల నివారణకు నిర్ణయం తీసుకున్న రైల్వేబోర్డు
ముంబ్రా ప్రమాదం నేపథ్యంలో రైల్వేబోర్డు నిర్ణయం
రద్దీ కారణంగా ఉదయం పుష్పక్ రైలు నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి
-
Jun 09, 2025 19:42 IST
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు: ఉత్తమ్
8,378 కేంద్రాల నుంచి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
12.33 లక్షల మంది రైతులకు రూ.15,121 కోట్ల చెల్లింపులు: ఉత్తమ్
2023తో పోలిస్తే 13 లక్షల మెట్రిక్ టన్నులు అధికం: మంత్రి ఉత్తమ్
BRS పాలనతో పోలిస్తే అదనంగా రూ.9,139 కోట్ల చెల్లింపులు: మంత్రి ఉత్తమ్
-
Jun 09, 2025 19:42 IST
ముగిసిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణ
ప్రభాకర్‌రావును 8 గంటలు ప్రశ్నించిన అధికారులు
ప్రభాకర్‌రావు వాంగ్మూలం రికార్డు చేసిన అధికారులు
విచారణకు అందుబాటులో ఉండాలని ప్రభాకర్‌రావుకు ఆదేశం
మరో 2 రోజులపాటు ప్రభాకర్‌రావును ప్రశ్నించనున్న అధికారులు
-
Jun 09, 2025 18:39 IST
క్షమాపణ చెప్పాల్సిందే..
అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిది: షర్మిల
అమరావతిపై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: షర్మిల
ఏపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం
ఇప్పటివరకు వైసీపీ, సాక్షి మీడియా క్షమాపణ చెప్పలేదు: షర్మిల
క్షమాపణ చెప్పడం భారతీరెడ్డి బాధ్యత: షర్మిల
జగన్ క్షమాపణ చెప్పడంలో తప్పులేదు: షర్మిల
-
Jun 09, 2025 18:02 IST
ఆ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
2 వారాల మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని PSRకు కోర్టు ఆదేశం
కోర్టును PSR ఆశ్రయిస్తే ఆయన మెడికల్ రిపోర్టులను పరిశీలించి బెయిల్ పిటిషన్‌ను 2 వారాల్లో పరిష్కరించాలని హైకోర్టు ఆదేశం
APPSC ప్రశ్నపత్రాల మూల్యాంకనం కేసులో PSR, దాత్రి మధు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
-
Jun 09, 2025 16:59 IST
సజ్జల వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైర్..
అమరావతిపై సజ్జల వ్యాఖ్యలను ఖండించిన మంత్రి నారా లోకేష్
వైసీపీ నేతల భాషేంటి... వారి ప్రవర్తన ఏంటి?: మంత్రి నారా లోకేష్
మహిళలు నిరసన తెలిపితే.. వైసీపీ నేతలకు సంకరజాతిలా కనిపిస్తున్నారా?
మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అవమానిస్తారా?: లోకేష్
మహిళలను కించపరిచేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి: మంత్రి లోకేష్
సీనియర్ జర్నలిస్టులు మహిళలను అవమానించారు: మంత్రి లోకేష్
-
Jun 09, 2025 16:59 IST
ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం..
సూర్యాపేటలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన భట్టి, పొన్నం
బస్సులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నందునే ఆర్టీసీ నిలదొక్కుకుంటోంది
తెలంగాణ ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6,088 కోట్లు చెల్లించింది: భట్టి
ఆర్టీసీలో ఇప్పటివరకు మహిళలకు రూ.182 కోట్ల జీరో టికెట్లు: భట్టి
-
Jun 09, 2025 15:36 IST
విచారణకు కేసీఆర్..
సిద్దిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్‌రావు
కేసీఆర్‌తో సమావేశం కానున్న కేటీఆర్, హరీశ్‌రావు
ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
-
Jun 09, 2025 15:36 IST
ప్రభాకర్‌రావు మామూలు వ్యక్తి కాదు: బండి సంజయ్
SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మామూలు వ్యక్తి కాదు: కేంద్రమంత్రి బండి సంజయ్
అమెరికాలోనే ప్రభాకర్‌కు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ పూర్తయింది: బండి సంజయ్
పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు వచ్చారు: బండి సంజయ్
విచారణలో ప్రభాకర్‌రావు ఇచ్చే స్టేట్‌మెంట్ బహిర్గతం చేయాలి: బండి
సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్‌రావు: బండి సంజయ్
ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలి: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ చేసిన వాటిని ఏం చేశారు?: బండి సంజయ్
ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు?: బండి సంజయ్
ఆడియోలు అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు?: బండి సంజయ్
ప్రభాకర్‌రావుపై కఠిన చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
-
Jun 09, 2025 15:13 IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలు: సీఎం చంద్రబాబు
నియోజకవర్గాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్: చంద్రబాబు
త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు: చంద్రబాబు
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం: చంద్రబాబు
టెక్నాలజీ అనేదీ ఫ్యాషన్ కాదు.. గేమ్ ఛేంజర్: చంద్రబాబు
పేదరికం లేని ఏపీని తయారు చేస్తాం: చంద్రబాబు
అందుకే P4 కార్యక్రమం తీసుకువచ్చాం: చంద్రబాబు
-
Jun 09, 2025 14:58 IST
సిద్దిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్
కాసేపట్లో బీఆర్కేభవన్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు హరీశ్‌రావు
కేసీఆర్‌తో సమావేశం కానున్న కేటీఆర్, హరీశ్‌రావు
ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
-
Jun 09, 2025 14:58 IST
వారి స్థానంలో అధికారులు..
ఏపీలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల వైస్‌ఛైర్మన్ల స్థానంలో అధికారులకు బాధ్యతలు
4 స్థానాల్లో అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు
బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా జేసీకి అదనపు బాధ్యతలు
తిరుపతి జేసీకి తుడా వైస్ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగింత
కాకినాడ జేసీకి కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ బాధ్యతలు
తూ.గో.జిల్లా జాయింట్ కలెక్టర్‌కు రాజమండ్రి అర్బన్ వైస్‌ఛైర్మన్ బాధ్యతలు
-
Jun 09, 2025 14:58 IST
AICC పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి..
ఢిల్లీ: AICC పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై హైకమాండ్‌తో సీఎం చర్చలు
మంత్రుల శాఖళ పునర్ వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో సీఎం చర్చలు
మంత్రుల శాఖల్లో మార్పులు జరగనున్నట్లు సమాచారం
-
Jun 09, 2025 14:56 IST
మాజీ మంత్రికి రిమాండ్ పొడిగింపు..
కాకాణి గోవర్థన్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు
కాకాణికి మరో 14 రోజుల రిమాండ్ పొడిగించిన కోర్టు
మైనింగ్ కేసులో A-4 కాకాణి గోవర్ధన్‌రెడ్డి
కాకాణి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 11కి వాయిదా
-
Jun 09, 2025 14:53 IST
కొమ్మినేనిని సమర్థించిన సజ్జల.. ఇదేం బుద్ది..
కొమ్మినేని సుదీర్ఘకాలం జర్నలిస్ట్‌గా ఉన్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
కొమ్మినేనికి కొన్ని అంశాలపై ఆవేశం ఉంటుంది: సజ్జల
కానీ ఎవరి గురించి అనుచితంగా మాట్లాడరు: సజ్జల
చర్చల విషయంలో కొమ్మినేని కఠినంగా ఉంటారు: సజ్జల
ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు: సజ్జల
తన అభిప్రాయాన్ని కొమ్మినేని స్పష్టంగా చెబుతారు: సజ్జల
సాక్షి మీడియా కొమ్మినేనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది: సజ్జల
చర్చల్లో భిన్నాభిప్రాయాలు ఉండాలనేదే కొమ్మినేని తాపత్రయం
చర్చలను కొమ్మినేని స్వతంత్రంగానే నిర్వహిస్తారు: సజ్జల
చర్చలు ఎంతసేపు నడపాలన్నది కొమ్మినేని నిర్ణయించుకుంటారు: సజ్జల
పొరపాటున కూడా కొమ్మినేని నిర్ణయం తీసుకోరు: సజ్జల
అసభ్యంగా మాట్లాడటం కొమ్మినేనికి అలవాటు లేదు: సజ్జల