Breaking News: హైదరాబాద్ మెట్రో రెండో దశ(బి) ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు
ABN , First Publish Date - Jun 21 , 2025 | 06:47 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 21, 2025 21:33 IST
హైదరాబాద్ మెట్రో రెండో దశ(బి) ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన తెలంగాణ సర్కార్
డీపీఆర్‌తో పాటు అన్ని డాక్యుమెంట్లను సమర్పించిన అధికారులు
వారం క్రితం మెట్రో ఫేజ్-2(బి)కి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు
మెట్రో ఫేజ్-2(బి)లో మొత్తం 86.1 కిలోమీటర్లు
రూ.19,579 కోట్లతో మెట్రో ఫేజ్-2(బి) నిర్మాణం
-
Jun 21, 2025 21:15 IST
కాళేశ్వరం కమిషన్ లేఖకు సమాధానం ఇచ్చిన సీఎంవో
ఈనెల 30లోగా కమిషన్ అడిగిన సమాచారం ఇస్తామన్న సీఎంవో
ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు లేఖ పంపిన సీఎంవో
కమిషన్ లేఖపై ఎల్లుండి కేబినెట్‌లో చర్చించే అవకాశం
-
Jun 21, 2025 21:15 IST
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్
షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కాజీపేట రైల్వే కోర్టు
ఈనెల 25లోపు ఇద్దరి షూరిటీలు సమర్పించాలని ఆదేశం
క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో బెయిల్
-
Jun 21, 2025 21:14 IST
గుంటూరు: జగన్ పర్యటనలో మృతిచెందిన సింగయ్య కేసులో కీలక మలుపు
జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్టు సమాచారం
వాహనం ఢీకొన్న వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు
ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ వాహనం కిందపడ్డ వ్యక్తి
జగన్ వాహనం కిందపడింది సింగయ్యనా.. కాదా అని విచారణ
ఘటన సమయంలో వీడియోలో ఉన్నవారి నుంచి సమాచారం సేకరణ
సింగయ్యను ఢీకొన్న వాహనం నెంబర్‌తో సహా చెప్పిన ఎస్పీ
-
Jun 21, 2025 19:48 IST
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
వరంగల్ : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు.
14 రోజుల పాటు రిమాండ్ విధించిన జడ్జి.
కౌశిక్ రెడ్డిని ఖమ్మం జిల్లా జైలుకు తరలించనున్న పోలీసులు.
కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ఉదయం నుంచి కొనసాగిన హైడ్రామా.
కౌశిక్ ది అక్రమ అరెస్ట్ అన్న బీఆర్ఎస్ నేతలు.
ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి కక్ష సాధిస్తోంది.
న్యాయపరంగా ఎదుర్కొంటాం : ఎర్రబెల్లి
కౌశిక్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు : వినయ్ భాస్కర్
కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటాం : వినోద్ కుమార్
-
Jun 21, 2025 19:24 IST
ఇండిగోకు తప్పిన పెను ప్రమాదం.. మేడే ప్రకటించిన పైలట్..

ఇండిగో విమానానికి పెను ముప్పు తప్పింది.
ఇంధనం తక్కువగా ఉండటంతో పైలట్ మేడే ప్రకటించారు.
168 మంది ప్రయాణికులతో విమానం.
గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం 6E-6764 (A321).
బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్.
తగినంత ఇంధనం లేకపోవడాన్ని గుర్తించిన పైలట్.
వెంటనే అలర్ట్.. మేడే ప్రకటన.
అలర్ట్ అయిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఆన్-గ్రౌండ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
వైద్య, అగ్నిమాపక సిబ్బందిని సమాయత్తం చేశారు.
కాసేపటికి విమానం కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
వాస్తవానికి ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
-
Jun 21, 2025 17:44 IST
హైదరాబాద్: మాదాపూర్‌లో ఏవీ ఇన్‌ఫ్రా పేరుతో భారీ మోసం
బై బ్యాక్ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడిన ఏవీ ఇన్‌ఫ్రా
పెట్టుబడుల పేరుతో రెట్టింపు డబ్బు ఇస్తామంటూ మోసం
పలు ప్రాంతాల్లో వెంచర్ అంటూ నమ్మించిన ఏవీ ఇన్‌ఫ్రా
18 నెలలకు 50 శాతం అదనంగా ఇస్తానని వసూలు చేసిన విజయ్
డబ్బులు అడిగితే మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం
విజయ్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదు
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
-
Jun 21, 2025 17:34 IST
ఎన్నికల కమిషన్‌పై రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు
ఎన్నికలకు సంబంధించిన డేటా 45రోజుల్లో డిలీట్ చేయడమేంటి?
ఇంతకు ముందు ఆధారాలు ఏడాది వరకూ ఉండేవి: ఎక్స్‌లో రాహుల్
మ్యాచ్ ఫిక్సయిందని క్లియర్‌గా తెలుస్తోంది: రాహుల్‌గాంధీ
ఇలాంటి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: ఎక్స్‌లో రాహుల్
-
Jun 21, 2025 13:29 IST
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై స్పందించిన సోనియాగాంధీ
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన సోనియా
గాజా, ఇరాన్ విషయంలో కేంద్రం మౌనం వీడాలి: సోనియా
గాజాలో నరమేధంపై భారత్ మౌనం మంచిది కాదు: సోనియా
భారత్‌కు ఇరాన్ చిరకాల మిత్రదేశం: సోనియా
ఇరాన్‌ను దూరం చేసుకోవడం మంచిదికాదు: సోనియా
-
Jun 21, 2025 13:29 IST
బనకచర్ల పాపం బీఆర్ఎస్‌దే: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మామాఅల్లుళ్లు చిల్లర పంచాయతీ పెడుతున్నారు
ప్రస్తుత నీటి ఒప్పందాలన్నీ బీఆర్ఎస్ హయాంలోవే
చేసిన తప్పును హరీష్‌రావు ఒప్పుకోవాలి: ఆదిశ్రీనివాస్
తప్పుఒప్పుకోకుండా రేవంత్‌పై విమర్శలా: ఆదిశ్రీనివాస్
-
Jun 21, 2025 12:01 IST
వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై మహేశ్ గౌడ్‌కు చేరిన నివేదిక
నివేదికపై ఇంచార్జీతో చర్చించనున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
వరంగల్ జిల్లాలో కొండా, కడియం వర్గీయుల మధ్య విభేదాలు
మంత్రి పదవి పోతుందని కడియం శ్రీహరి వర్గం ప్రచారం చేస్తోందని ఆరోపించిన కొండా సురేఖ
నేతలు బహిరంగ విమర్శలు సరికాదన్న డీసీసీ నేత నాయిని రాజేందర్ రెడ్డి
పీసీసీ నిర్ణయంపై కొనసాగుతున్న సస్పెన్స్
-
Jun 21, 2025 12:00 IST
హనుమకొండ: సుబేదారి పీఎస్‌లో MLA కౌశిక్‌రెడ్డి
గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు
కౌశిక్‌రెడ్డిని పరామర్శించిన మాజీమంత్రి ఎర్రబెల్లి
కౌశిక్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు: ఎర్రబెల్లి
రేవంత్‌రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్: ఎర్రబెల్లి
రేవంత్‌కు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదు: ఎర్రబెల్లి
మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ కంట్రోల్‌లో లేరు: ఎర్రబెల్లి
ఎవరికి వారు దోచుకు తింటున్నారు: ఎర్రబెల్లి
-
Jun 21, 2025 10:46 IST
బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన..
హనుమకొండ: సుబేదారి పీఎస్‌లో MLA కౌశిక్‌రెడ్డి
గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు
సుబేదారి పోలీస్‌స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
పీఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
కాసేపట్లో కౌశిక్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
-
Jun 21, 2025 10:46 IST
తోపులాట..
హైదరాబాద్: గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో స్వల్ప తోపులాట
యోగాసనాల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ పంపిణీలో తోపులాట
స్పృహ కోల్పోయిన యువతి, ఆస్పత్రికి తరలింపు
-
Jun 21, 2025 08:04 IST
గిన్నిస్ బుక్ రికార్డు..
గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న 3 లక్షల మంది ప్రజలు
సూరత్ రికార్డ్‌ను అధిగమించిన యోగాంధ్ర కార్యక్రమం
-
Jun 21, 2025 07:49 IST
ట్రాఫిక్ ఆంక్షలు..
విశాఖ: యోగాంధ్ర నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు ఆంక్షలు
ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరి వరకు రోడ్లు మూసివేత
కైలాసగిరి నుంచి భీమిలి వరకు ఒకమార్గం మూసివేత
విశాఖలో డ్రోన్లు ఎగరవేత నిషేధం
-
Jun 21, 2025 07:48 IST
హైదరాబాద్: గచ్చిబౌళి స్టేడియంలో యోగా డే వేడుకలు
హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, ప్రముఖులు
యోగాలో పాల్గొననున్న సినీ, రాజకీయ ప్రముఖులు
-
Jun 21, 2025 07:47 IST
హనుమకొండ: BRS MLA పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు
క్వారీ యజమానిని బెదిరించిన కేసులో కౌశిక్‌రెడ్డి అరెస్ట్
పాడి కౌశిక్‌రెడ్డిని వరంగల్‌కు తరలించిన పోలీసులు
BNS సెక్షన్ 308(2), (4), 352 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
-
Jun 21, 2025 07:47 IST
విశాఖ: ఆర్కే బీచ్ రోడ్‌లో యోగాంధ్ర కార్యక్రమం
పాల్గొన్న ప్రధాని మోదీ, గవర్నర్ నజీర్, చంద్రబాబు, పవన్, లోకేశ్
పాల్గొన్న కేంద్రమంత్రులు రామ్మోహన్, ప్రతాప్‌రావు, శ్రీనివాస్‌వర్మ
45 నిమిషాల పాటు యోగాసనాలు
యోగా ఫర్ వన్ ఎర్త్- వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమం
వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు
-
Jun 21, 2025 07:41 IST
భారత్ కు దక్కిన గొప్ప గౌరవం ఇది: పవన్..
యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే.. మోదీ విశ్వవ్యాప్తంగా చేశారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఇంటర్నేషనల్ యోగా డే భారతావనికి దక్కిన గొప్ప గౌరవం: పవన్
యోగాను అందించిన ఆదియోగి, పతంజలికి నమస్కారాలు: పవన్
యోగాసాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారు: పవన్
-
Jun 21, 2025 07:41 IST
దేశవ్యాప్తంగా వేడుకలు..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఘనంగా యోగా డే వేడుకలు
కేంద్రమంత్రుల సమక్షంలో యోగా డే కార్యక్రమాలు
గుజరాత్‌లో యోగా డేలో పాల్గొననున్న అమిత్ షా
ఉధంపూర్‌లో యోగా డేలో పాల్గొననున్న రాజ్‌నాథ్ సింగ్
-
Jun 21, 2025 07:38 IST
యోగా ప్రపంచాన్ని కలిపింది: ప్రధాని మోదీ
అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని నరేంద్ర మోదీ
యోగా ప్రపంచాన్ని కలిపింది: ప్రధాని మోదీ
175కుపైగా దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు: ప్రధాని మోదీ
ఇది మనతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ
కోట్ల మంది జీవనశైలిని యోగా మార్చింది: మోదీ
నేవీ నౌకల్లో కూడా యోగాసనాలు చేస్తున్నారు: మోదీ
వన్ ఎర్త్.. వన్ హెల్త్ థీమ్‌తో యోగా డే జరుపుకుంటున్నాం: మోదీ
ప్రపంచం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంది: మోదీ
యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నారు: మోదీ
మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతుంది: మోదీ
యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు: మోదీ
ఒబెసిటీ అనేది ప్రపంచానికి పెద్ద సమస్య: మోదీ
తీసుకునే ఆహారంలో నూనె పదార్థాల శాతం తగ్గించాలి
ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖ చిరునామా: ప్రధాని మోదీ
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు: మోదీ
చంద్రబాబు, పవన్ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారు: మోదీ
లోకేశ్ కూడా యోగాంధ్ర కార్యక్రమం కోసం కృషి చేశారు: మోదీ
కొత్త కార్యక్రమాల రూపకల్పనలో లోకేశ్ చొరవ ప్రశంసనీయం: మోదీ
-
Jun 21, 2025 07:36 IST
చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు
11వ యోగా దినోత్సవం రోజు విశాఖలో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు
యోగా డేను 130 దేశాల్లో జరుపుకుంటున్నారు: చంద్రబాబు
యోగాను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారు: చంద్రబాబు
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయి: చంద్రబాబు
మోదీ గత పదేళ్లుగా యోగాను ప్రోత్సహిస్తున్నారు: చంద్రబాబు
సూర్యనమస్కారాలతో గిరిజన విద్యార్థులు రికార్డు సాధించారు: చంద్రబాబు
యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలి: చంద్రబాబు
యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు: చంద్రబాబు
యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయి: చంద్రబాబు
స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తాం: చంద్రబాబు
సెప్టెంబర్‌లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం: చంద్రబాబు
30 రోజుల పాటు ఏపీవ్యాప్తంగా ఉద్యమంలా యోగాలో భాగమైంది: చంద్రబాబు
ప్రజలు రోజుకు గంట యోగాకు కేటాయించాలి: చంద్రబాబు