Breaking News: విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ..
ABN , First Publish Date - Jun 20 , 2025 | 07:50 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 20, 2025 19:19 IST
విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్..
ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న అబ్దుల్ నజీర్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేష్. అనంతరం యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని గవర్నర్‌కి అందజేశాను.
-
Jun 20, 2025 19:16 IST
విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ..
అమరావతి: విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.
మోదీకి స్వాగతం పలకనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు.
శనివారం నాడు విశాఖ వేదికగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
-
Jun 20, 2025 18:40 IST
బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చకు సిద్ధం..
ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన సీఎం రేవంత్
మీడియాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
ఈనెల 23న కేబినెట్‌లో చర్చించి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తాం.
బనకచర్ల అనుమతుల కోసం కేంద్రం దగ్గరకు ఏపీ వెళ్లింది.
మమ్మల్ని సంప్రదించకుండా కేంద్రం దగ్గరకు వెళ్లడం సరికాదు.
రాష్ట్ర విభజన అంశాలపై మంత్రులు, అధికారులతో కమిటీలు ఉన్నాయి.
కమిటీలతో చర్చించకుండా కేంద్రం దగ్గరకు ఏపీ ఎందుకు వెళ్లింది?
మా ప్రాజెక్ట్‌లు పూర్తి చేసుకున్నాకే.. వరద జలాలను పరిగణనలోకి తీసుకోవాలి.
మా నీటిని మేం వినియోగించుకున్నాకే.. ఏపీ ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి.
ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ హక్కులను వదులుకోం.
జల సమస్యే.. బీఆర్ఎస్‌కు సంజీవని.
హరీష్‌రావు వాదనల్లో పస లేదు.
కృష్ణా జలాల్లో 500 టీఎంసీలకు ఎన్‌ఓసీ అడగడాన్ని తప్పుబడుతున్నారు.
2023లో కేంద్రానికి హరీష్‌రావు రాసిన లేఖలో 405 టీఎంసీలే కోరారు.
మేం అదనంగా 95 టీఎంసీలు కావాలని కోరాం.
ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చి.. బీఆర్ఎస్ ఇప్పుడు నాటకాలు ఆడుతోంది.
రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అనలేదా?
గోదావరి వరద జలాలను వాడుకుంటే తప్పేంటని ఆనాడు కేసీఆర్ అనలేదా?
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఒక్క అదనపు ఎకరాకు కూడా నీరందలేదు.
కాళేశ్వరం మీద ఆధారపడి ఈసారి ఏ ఒక్క పంట పండలేదు.
తెలంగాణ ధాన్యాగారంగా మారేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సంబంధం లేదు.
కృష్ణా, గోదావరి జలాల హక్కులను కేసీఆర్, హరీష్‌రావే ఏపీకి రాసిచ్చారు.
జలవివాదాలు పెట్టుకోవడం మా విధానం కాదు.
చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకుంటాం.
జులై 6, 7 తేదీల్లో మరోసారి ఢిల్లీ పర్యటన.
తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్‌రావే.
అధికారం కోల్పోయిన అసహనంలో హరీష్‌రావు ఉన్నారు.
నేను కేంద్రమంత్రులను కలిసే ఒకరోజు ముందే కిషన్‌రెడ్డి కలిశారు.
కేటీఆర్‌కు కిషన్‌రెడ్డి లైజనింగ్ అధికారిగా పనిచేస్తున్నారు.
కేసీఆర్‌కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని మోదీ, అమిత్‌షా అన్నారు.
కేబినెట్ నిర్ణయం తర్వాతే కాళేశ్వరం కట్టారని ఈటల చెబుతున్నారు.
ఏది నిజమో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలి.
-
Jun 20, 2025 16:44 IST
గవర్నర్‌ను కలవాలంటూ రాజ్ భవన్ ముందు బైఠాయించిన మహిళ.
విషయం తెలుసుకుని రాజ్ భవన్ వద్దకు చేరుకున్న పంజాగుట్ట పోలీసులు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు మహిళ తరలింపు.
మహారాష్ట్రలోని ముంబైలో మహిళ ఇంట్లో జరిగిన దాదాపు 24 లక్షల చోరీ.
ఈ వ్యవహారంలో ఇక్కడ బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు బాధితురాలు యత్నం.
తన ఫిర్యాదును స్వీకరించట్లేదంటూ మహిళ ఆందోళన.
గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకుంటే రాజ్ భవన్ ముందే ఆత్మహత్య చేసుకుంటా అంటున్న మహిళ.
-
Jun 20, 2025 16:31 IST
హనుమకొండ : వరంగల్ కోర్ట్ ప్రాంగణానికి బాంబు బెదిరింపు.
100 కి ఫోన్ చేసి చెప్పిన గుర్తు తెలియని వ్యక్తి.
కోర్టు ప్రాంగణంలో 6 డిటోనెటర్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
సకాలంలో పోలీసుల అప్రమత్తత తప్పిన ప్రమాదం.
-
Jun 20, 2025 16:19 IST
కడప: మేయర్ సురేష్‌బాబు చాంబర్‌కు నోటీస్
కమిషనర్ మనోజ్‌రెడ్డి పేరుతో నోటీస్ అంటించిన సిబ్బంది
ఈనెల 13న ఇచ్చిన నోటీస్ ప్రకారం కౌన్సిల్ హాల్‌లోనే సమావేశం
ఉ.11గంటలకు అధికారులు సమావేశానికి హాజరయ్యారు: మనోజ్‌రెడ్డి
కానీ మేయర్, కొందరు కార్పొరేటర్లు హాజరుకాలేదు: కమిషనర్ మనోజ్‌రెడ్డి
కోరం సభ్యులు లేనందున.. సమావేశం వాయిదా పడినట్టు పరిగణించాలి.
తదుపరి సమావేశంపై సభ్యులకు నోటీస్ ఇవ్వాలి: కమిషనర్ మనోజ్‌రెడ్డి
హాల్ మార్పుపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సరికాదు: మనోజ్‌రెడ్డి
-
Jun 20, 2025 16:00 IST
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ కౌంటర్
ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజు త్వరలో వస్తుందన్న అమిత్‌షా
RSS, బీజేపీ నేతల పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు.
పేద పిల్లలు మాత్రం ఉన్నతవిద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారు.
మాతృభాషతో పాటు ఇంగ్లీష్ చాలా అవసరం.
ఇంగ్లీష్ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని, ఉపాధిని కల్పిస్తుంది.
-
Jun 20, 2025 13:41 IST
కడప కార్పొరేషన్‌లో మేయర్ కౌన్సిల్ సమావేశం
అధికారులు లేకుండానే మాక్ కౌన్సిల్ ఏర్పాటు
మాక్ కౌన్సిల్‌లో ఎజెండా ప్రవేశపెట్టిన మేయర్
కార్పొరేషన్ సమావేశ మందిరంలో MLA మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు
సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కమిషనర్ మనోజ్‌రెడ్డి
కమిషనర్ మనోజ్‌రెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మేయర్ తీర్మానం
-
Jun 20, 2025 13:41 IST
వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు
సొంత పార్టీ నేతలపై కొండా మురళి విమర్శలు
మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ MLAలు, నేతలు ఫైర్
కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతల సమావేశం
నాయిని ఇంట్లో కాంగ్రెస్ MLAలు, కీలక నేతల భేటీ
భేటీలో పాల్గొన్న కడియం, రేవూరి, సారయ్య, సుధారాణి
సమావేశంలో పాల్గొన్న నాయిని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు
-
Jun 20, 2025 13:41 IST
అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి: పవన్
సినిమా డైలాగ్స్‌ను నిజ జీవితంలో ఆచరిస్తామంటే సాధ్యం కాదు: పవన్
ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందే: పవన్
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదు: పవన్ కల్యాణ్
అసాంఘిక శక్తులకు మద్దతు ఇస్తున్న వారిని ప్రజలు గమనించాలి: పవన్
అరాచకశక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే: పవన్ కల్యాణ్
-
Jun 20, 2025 12:59 IST
విశాఖలో కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ఐటీ క్యాంపస్
రూ.1,582 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్
ఐటీ క్యాంపస్ ఏర్పాటుతో 8 వేలమందికి ఉద్యోగావకాశాలు
కాపులుప్పాడ దగ్గర 21.31 ఎకరాలు కోరిన కాగ్నిజెంట్ సంస్థ
2029 లోపు ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్న కాగ్నిజెంట్
-
Jun 20, 2025 11:42 IST
కడప కార్పొరేషన్‌లో మరోసారి కుర్చీల వివాదం
మేయర్ కుర్చీ పక్కనే MLA, MLCలకు కుర్చీలు వేసిన అధికారులు
తన కుర్చీ పక్కన MLA, MLCలకు కుర్చీలు వేయడంపై మేయర్ అభ్యంతరం
కొంతకాలంగా మేయర్ సురేష్‌బాబు, MLA మాధవిరెడ్డి మధ్య విభేదాలు
ఇంకా ప్రారంభంకాని సర్వసభ్య సమావేశం
సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి
కౌన్సిల్ హాల్‌కు రాకుండా చాంబర్‌లోనే ఉన్న మేయర్ సురేష్‌బాబు
కార్పొరేషన్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు
-
Jun 20, 2025 09:42 IST
భువనేశ్వరికి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
నీ ప్రేమ, బలం మన కుటుంబానికి పునాది: సీఎం చంద్రబాబు
నా ఉన్నతి, ఇబ్బందుల్లో నావైపే ఉన్నావు: చంద్రబాబు
నిన్ను అర్ధాంగిగా పొందడం నా అదృష్టం: చంద్రబాబు
నువ్వు మా జీవితాలకు వెలుగు: సీఎం చంద్రబాబు
ప్రజల పట్ల నీ ఆప్యాయత, ఆదరణ మాకు ప్రేరణ: చంద్రబాబు
వ్యాపారం, సేవా రంగాల్లో నీ నాయకత్వం మాకు ప్రేరణ: చంద్రబాబు
-
Jun 20, 2025 09:28 IST
ఇవాళ సాయంత్రం విశాఖకు ఏపీ సీఎం చంద్రబాబు
INS డేగ దగ్గర ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న చంద్రబాబు
రాత్రి విశాఖ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు బస
రేపు ఉ.6 గం.లకు ఆర్కే బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమం
ప్రధాని మోదీతో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
రేపు ఉ.11:30 గం.లకు ప్రధాని మోదీకి వీడ్కోలు
అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరనున్న సీఎం చంద్రబాబు
-
Jun 20, 2025 09:28 IST
డ్రగ్స్ పట్టివేత..
ముంబైలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
నైజీరియాకు చెందిన మహిళ అరెస్ట్
NDPS చట్టం కింద కేసు నమోదు
-
Jun 20, 2025 09:28 IST
మాజీ మంత్రికి షాక్..
నెల్లూరు: మాజీ మంత్రి అనిల్ కుమార్ లే అవుట్ తొలగింపు
భారీ పోలీసుల బందోబస్తు మధ్య 11 ఎకరాల లే అవుట్ తొలగింపు
కొత్తూరు, అంబాపురంలో అనిల్ బినామీ పేర్లతో అక్రమ లే అవుట్
ప్రభుత్వ, SC, ST భూములు ఆక్రమించినట్లు గుర్తింపు
-
Jun 20, 2025 08:15 IST
నేడే తొలి టెస్టు మ్యాచ్..
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ: నేడు ఇంగ్లాండ్-భారత్ తొలి టెస్టు మ్యాచ్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో నేడు ఇంగ్లాండ్-భారత్ తొలి టెస్టు
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ: మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మ్యాచ్
-
Jun 20, 2025 08:15 IST
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో గోనె ప్రకాష్ విచారణ
నేడు సిట్ విచారణకు హాజరుకానున్న గోనె ప్రకాష్
ఉ.10:30కు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు గోనె ప్రకాష్
ఉపఎన్నికల వేళ గోనె ప్రకాష్ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తింపు
సాక్షిగా సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్న గోనె ప్రకాష్
-
Jun 20, 2025 08:15 IST
హైదరాబాద్: నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్‌రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న ప్రభాకర్‌రావును ప్రశ్నించిన సిట్
నిన్న ప్రభాకర్‌రావును 8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
సిట్ విచారణకు ప్రభాకర్‌రావు సహకరించలేదు: సిట్ బృందం
-
Jun 20, 2025 07:50 IST
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో ఎంట్రీకి అమెరికా సన్నద్ధం
ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్న అమెరికా
సైనిక చర్యపై 2 వారాల్లో ట్రంప్ నిర్ణయం: వైట్‌హౌస్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేస్తాం: ఇజ్రాయెల్
ఖమేనీకి ఈ భూమిపై ఉండే అర్హత లేదు: ఇజ్రాయెల్
ఇరాన్ అణుకేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం
టెహ్రాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు: నెతన్యాహు
టెల్ అవీవ్, జెరూసలెం, హైఫా నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
ఇజ్రాయెల్ సైనిక కార్యాలయం, ఆస్పత్రులపై ఇరాన్ దాడులు